TE/Prabhupada 0231 - భగవంతుడు ప్రపంచము మొత్తానికి యజమాని

Revision as of 17:03, 24 July 2017 by Kamalakar (talk | contribs) (Created page with "<!-- BEGIN CATEGORY LIST --> Category:1080 Telugu Pages with Videos Category:Prabhupada 0231 - in all Languages Category:TE-Quotes - 1974 Category:TE-Quotes -...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)




Lecture on BG 2.1-5 -- Germany, June 16, 1974

అందువల్ల కృష్ణుడు ప్రామాణికులచే భగవన్, లేదా భగవంతుడు దేవాదిదేవుడుగా అంగీకరించబడ్డాడు. భగవన్ అంటే ఏమిటి? భగవన్ అర్థం, ఆరు ఐశ్వర్యములు పూర్తిగా కలిగి ఉన్న వ్యక్తి. పూర్తిగా అన్ని సంపదలు అమర్చబడి ఉంటే అయిన భగవన్ అందరికంటే ధనవంతుడు. ఎంత ధనవంతుడో భగవన్, లేదా దేవుడు, మనము అర్థం చేసుకోగలము, మనకు కొన్ని ఎకరాల భూమి కలిగి ఉన్నందుకు గర్వపడుతున్నాం, భగవన్ అంటే మొత్తం విశ్వం యొక్క యజమాని. అందువలన అయినను అత్యంత ధనవoతుడిగా భావిస్తారు. అదేవిధంగా, అయినను బలవంతుడిగా భావిస్తారు. అదేవిధంగా, అయిన తెలివైన వ్యక్తిగా భావించబడ్డాడు. అదేవిధంగా, అయినను చాలా అందమైన వ్యక్తిగా భావిస్తారు. ఈ విధంగా, మీరు ఒక వ్యక్తి ధనిక, అత్యంత అందమైన, అత్యంత తెలివైన, బలమైన - ఈ విధంగా, మీరు చూసినప్పుడు, అయిన భగవన్ లేదా దేవుడు. ఈ భూమ్మీద ఉన్నప్పుడు కృష్ణుడు తన ఐశ్వర్యములను నిరూపించాడు. ఉదాహరణకు, అందరు వివాహం చేసుకుంటారు, కానీ కృష్ణుడు, మహోన్నతమైన వ్యక్తిగా, 16,108 మంది స్త్రీలను వివాహం చేసుకున్నాడు. కానీ అయిన పదహారు వేల భార్యలకు ఒక భర్త ఉన్నాడని కాదు. అయిన వివిధ రాజభవనాలలో పదహారు వేల భార్యలు ఉండడానికి ఏర్పాటు చేసాడు. ప్రతి రాజభవనము, వర్ణించబడింది, అవి మొదటి తరగతి పాలరాయి , సామాను దంతములతో తయారు చేయబడ్డాయి చాలా మంచి, మృదువైన పత్తితో కూర్చుoడే ప్రదేశం తయారు చేయబడినది ఈ విధంగా వివరణ ఉంది. ఇంటి వెలుపల, అనేక పుష్పముల చెట్లు ఉన్నాయి. అంతే కాకుండా, అయిన వ్యక్తిగతoగా కూడా పదహారు వేల మందిగా విస్తరించాడు. అయిన ప్రతి భార్య తో ఆ విధంగా నివసిస్తున్నరు. అది దేవుడికి కష్టమైన పని కాదు. దేవుడు ప్రతిచోటా ఉన్నట్లు చెబుతారు. మన దృష్టిలో, అయిన పదహారు వేల గృహాల్లో ఉoడడానికి, అయినకి ఇబ్బంది ఏమిటి? ఇక్కడ చెప్పబడినది, śrī-bhagavān uvāca. అత్యంత శక్తివంతమైన ప్రామాణికుడు మాట్లాడుతూన్నారు. అందుచేత, అయిన ఏమి చెప్పిన దానిని నిజంగా తీసుకోవాలి. ఈ బద్ధ జీవితంలో, మనం భౌతిక స్థితిలో నివసిస్తున్నట్లుగా, మనకు నాలుగు లోపాలు ఉన్నయి: మనము పొరపాట్లు చేస్తాము, మనము భ్రమ పడతాము, మనము మోసం కూడా చేయాలనుకుంటున్నాము, మన ఇంద్రియాలు అసంపూర్ణము. అందువల్ల నాలుగు రకాల లోపాలను సంక్రమించిన వ్యక్తి నుండి పొందిన జ్ఞానం పరిపూర్ణంగా ఉండదు. అందువల్ల ఈ నాలుగు రకాల లోపాలు లేని ఆద్యాత్మిక వ్యక్తి నుండి మీకు జ్ఞానం లభిస్తే, అది పరిపూర్ణ జ్ఞానo అవ్వుతుంది. ఆధునిక శాస్త్రవేత్తలు, వారు ఈ విధంగా ఉంటుందని , ఇది ఆ విధముగా ఉంటుంది అని వారు భావిస్తారు, కానీ ఇది పరిపూర్ణ జ్ఞానం కాదు. మీరు మీ అసంపూర్ణ ఇంద్రియాలతో కల్పనచేస్తే, ఆ జ్ఞానం యొక్క విలువ ఏమిటి? ఇది పాక్షిక జ్ఞానం కావచ్చు, కానీ ఇది పరిపూర్ణ జ్ఞానం కాదు. అందువలన మనము జ్ఞానం పొందే పద్ధతి ఏమిటంటే, పరిపూర్ణ వ్యక్తి నుండి దానిని స్వీకరిoచాలి. అందువల్ల మనకు కృష్ణుడు, భగవన్ అత్యంత పరిపూర్ణుడు నుండి జ్ఞానం తీసుకుoటున్నాము, అందువలన మన జ్ఞానం పరిపూర్ణము. చిన్నపిల్లల వలె. అయిన పరిపూర్ణుడు కాకపోవచ్చు, కానీ అయిన తండ్రి చెప్పినప్పుడు, "నా ప్రియమైన పుత్రుడా, దీనిని కళ్ళజోడు అని పిలుస్తారు" అందువల్ల పిల్లవాడు మాట్లాడుతుంటే, "ఇది కాళ్ళజోడు", ఆ జ్ఞానం ఖచ్చితమైనది. ఎందుకంటే జ్ఞానం తెలుసుకోవడానికి పిల్లవాడు పరిశోధన చేయలేడు. అయిన తన తండ్రి లేదా తల్లిని అడిగాడు, "ఇది ఏమిటి, డాడీ? ఇది ఏమిటి, అమ్మ?" తల్లి చెప్పింది, "నా ప్రియమైన బాలుడా, ఇది ... ఇది." మరొక ఉదాహరణ ఇవ్వవచ్చు ఒక పిల్లవాడు, చిన్నతనంలో, అయినకు తన తండ్రి ఎవరో తెలియదు, అప్పుడు అయిన ఏ పరిశోధన చేయలేడు. తన తoడ్రిని కనుగొనేoదుకు అతను పరిశోధనా చేస్తే, అతను తన తoడ్రిని ఎన్నడూ చూడడు. కానీ అయిన తన తల్లిని అడిగితే, "ఎవరు నా తండ్రి?" తల్లి చెప్పుతుంది, "అయిన మీ తండ్రి," ఇది ఖచ్చితంగా ఉంటుoది. జ్ఞానం, దేవుడు జ్ఞానం, మీ ఇంద్రియాలకు అవగతం కాని, మీరు ఎలా తెలుసుకోవచ్చు? అందువల్ల మీరు దేవుడి నుండి లేదా అయిన ప్రతినిధి నుండి తెలుసుకోవాలి. ఇక్కడ కృష్ణుడు, భగవంతుడు దేవాదిదేవుడు మాట్లాడుతున్నాడు, అది అత్యంత ప్రామాణికం. అయిన అర్జునుడుతో ఈ విధంగా చెప్పాడు. అయిన చెప్పారు aśocyān anvaśocas tvaṁ prajñā-vādāṁś ca bhāṣase: (BG 2.11) నా ప్రియమైన అర్జునుడా, మీరు బాగా జ్ఞానము కలిగిన పండితుడిలా మాట్లాడుతున్నారు, కానీ మీరు భాధపడకుడని విషయముపై మీరు బాధపడుతున్నారు. " Gatāsūn agatāsūṁś ca nānuśocanti paṇḍitāḥ. Gatāsūn అంటే ఈ శరీరం అని అర్థము. ఇది చనిపోయినప్పుడు లేదా అది సజీవంగా ఉన్నప్పుడు, జీవితం యొక్క శారీరక భావన మూర్ఖత్వం. జ్ఞానము కలిగిన మనిషి శరీరంను తీవ్రముగా పరిగణలోకి తీసుకోడు. అందువల్ల వేదముల సాహిత్యం ప్రకారం, "జీవితం యొక్క శారీరక భావనలో ఉన్నవాడు, అయిన జంతువు కంటే ఎక్కువ కాదు." ప్రస్తుత క్షణం లో, ఆత్మ జ్ఞానం లేకుండా, మొత్తం ప్రపంచము శరీరిక భావనలో ఉంది. జంతువులలో శరీరిక భావం ఉంది. పిల్లులు కుక్కలు, అవి ఒక పెద్ద పిల్లిగా లేదా పెద్ద కుక్కగా అయినందుకు చాలా గర్వంగా ఉoటాయి. అదేవిధంగా వ్యక్తి గర్వము పొందితే "నేను పెద్ద అమెరికన్," "పెద్ద జర్మన్," "పెద్ద," తేడా ఏమిటి? కానీ వాస్తవానికి ఇది జరుగుతోంది, అందుచే వారు పిల్లులు కుక్కల వలె పోరాడుతున్నారు.

మనము రేపు మరింత చర్చించవలసి ఉంటుంది.