TE/Prabhupada 0260 - ఇంద్రియాల ప్రేరణతో మనము పాపములను జన్మ జన్మలుగ చేస్తున్నాము

Revision as of 16:19, 7 August 2017 by Kamalakar (talk | contribs) (Created page with "<!-- BEGIN CATEGORY LIST --> Category:1080 Telugu Pages with Videos Category:Prabhupada 0260 - in all Languages Category:TE-Quotes - 1968 Category:TE-Quotes -...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


Lecture -- Seattle, September 27, 1968


ఇంద్రియాలు ఎంత బలంగా ఉన్నాయో అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. కేవలం యువకులు మాత్రమే ఇంద్రియాలకు సేవకులు కాదు. డెబ్బై ఐదు సంవత్సరాలు, ఎనభై సంవత్సరాల వయస్సు, లేదా మరణం సమయంలో కుడా, వారు అoదరు ఇంద్రియాలకు సేవకులు. ఇంద్రియాలు ఎప్పటికి సంతృప్తి చెందవు. ఇది భౌతిక ప్రేరణ. అందువలన నేను సేవకునిగా ఉన్నాను. నేను నా ఇంద్రియాలకు సేవకుడిని,, నా ఇంద్రియాలకు సేవ చేయుట వలన, నేను సంతృప్తి చెందలేదు, నా ఇంద్రియాలు సంతృప్తి చెంద లేదు, అవి నా పట్ల సంతోషముగా లేవు. గందరగోళముగా ఉంది. ఇది సమస్య. ఉత్తమ విషయము ... అందువల్ల కృష్ణుడు చెపుతున్నాడు,

sarva-dharmān parityajya
mām ekaṁ śaraṇaṁ vraja
ahaṁ tvāṁ sarva-pāpebhyo
mokṣayiṣyāmi mā śucaḥ
(BG 18.66)

మీరు మీ ఇంద్రియాలకు జన్మ జన్మలుగ, సేవ చేశారు 8,400,000 జీవ జాతులలో పక్షులు, అవి కూడా ఇంద్రియాల కింద ఉన్నాయి. జంతువులు, అవి కూడా ఇంద్రియాల కింద ఉన్నాయి. వ్యక్తులు, మానవులు, దేవతలు కుడా, ఈ భౌతిక ప్రపంచం లోపల ఉన్న ప్రతి ఒక్కరు వారు, వారి ఇంద్రియల వెంట పడుతున్నారు, ఇంద్రియలకు సేవ చేస్తున్నారు. కానీ కృష్ణుడు ఇలా అంటాడు, "నీవు నాకు శరణాగతి పొందు. నాకు సేవ చేయడానికి అంగీకరిoచు. అప్పుడు నేను నీ బాధ్యతలను స్వీకరిస్తాను. "ఇది అంతే. Ahaṁ tvāṁ sarva-pāpebhyo mokṣayiṣyāmi mā śucaḥ. ఎందుకంటే ఇంద్రియాల ప్రేరణతో మనము పాపములను జన్మ జన్మలుగ చేస్తున్నాము; అందువలన మనము వివిధ స్థాయిల శరీరములను కలిగి ఉన్నాము. ప్రతి ఒక్కరూ ఒకే ప్రమాణములో ఉన్నారని భావించవద్దు. కాదు ప్రతి ఒక్కరు తాను చేస్తున్న పని ప్రకారం అయినకు విభిన్నమైన శరీరము వస్తుంది. అందువల్ల ఈ విభిన్న రకాలైన శరీరములు వివిధ రకాలైన ఇంద్రియ తృప్తి వలన. పంది జీవితంలో కూడా ఇంద్రియ తృప్తి ఉంటుంది. ఎందుకు అయినకు పంది శరీరం వచ్చింది? పూర్తిగా ఇంద్రియా సంభంధము సోదరి ఎవ్వరు, లేదా తల్లి ఎవ్వరు ఇది ఎవ్వరు, లేదా అది ఎవ్వరు అనే వివక్ష లేదు. ఇది ఆచరణాత్మకమైనది, మీరు చూస్తారు. కుక్కలు పందులు, అవి అలాంటివి. మానవ సమాజంలో కూడా సోదరి ఎవరు తల్లి ఎవరు, లేదా వీరు ఎవరు అని పట్టించుకోని వారు అనేకులు ఉన్నారు. ఇంద్రియాలు బలంగా ఉన్నాయి. ఇది మన దుఃఖమునకు కారణం, అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. మనం బాధపడుతున్న మూడురకాల క్లేశములు, మనము పరిష్కారం కోసం ప్రయత్నిస్తున్నాం, ఇంద్రియాల ప్రేరణ కారణంగా ఉంది. అందువలన కృష్ణుడు అక్కడ ఉన్నాడు. కృష్ణుడు అక్కడ ఉన్నాడు. అయిన నామము మదానా-మోహన. మీరు మీ ప్రేమను కృష్ణుడికి బదిలీ చేయడానికి ప్రయత్నించినట్లయితే, మీరు ఫలితాన్ని చూస్తారు. వెంటనే మీరు పొందుతారు.Sevonmukhe hi jihvādau (Brs. 1.2.234). ఈ తప్పుడు ప్రయత్నం, "నేను చేస్తున్న ప్రతి దానిలో నేను యజమానిగా వుంటాను" నేను చేస్తున్న ప్రతి దానిలో నేనే చక్రవర్తిని, ఈ వైఖరిని వదిలేయాలి మనలో ప్రతి ఒక్కరు స్వరూపముగా సేవకులము. ఇప్పుడు, ప్రస్తుత క్షణం లో, మనము ఇంద్రియాలకు సేవకులము. ఇప్పుడు, ఈ సేవ కృష్ణుడికి మాత్రమే చేయాలి Sevonmukhe hi jihvādau svayam eva sphuraty adaḥ. మీ సేవను మీరు కృష్ణుడికి మార్చిన వెంటనే, క్రమంగా, మీరు నిజాయితీగా మారుతారు, కృష్ణుడు మీకు సాక్షాత్కారము ఇస్తాడు, కృష్ణుడికి మీకు మధ్య పరస్పర సేవ చాలా బాగుంటుంది. మీరు అయినను ప్రేమిస్తారు స్నేహితునిగా, లేదా యజమానిగా, ప్రేమిoచేవారిగా ఎన్నో విషయములు ఉన్నాయి. ఏ విధంగా అయినా మీరు అయినను ప్రేమిస్తారు మీరు ఎంత సంతృప్తి చెందుతారో చూడవచ్చు. ఇది కృష్ణ చైతన్య ఉద్యమం. దయచేసి అర్థం చేసుకోండి.