TE/Prabhupada 0284 - నా స్వభావము సేవకునిగా ఉండటము

Revision as of 10:25, 18 August 2017 by Kamalakar (talk | contribs) (Created page with "<!-- BEGIN CATEGORY LIST --> Category:1080 Telugu Pages with Videos Category:Prabhupada 0284 - in all Languages Category:TE-Quotes - 1968 Category:TE-Quotes -...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


Lecture -- Seattle, September 30, 1968


ఈ కృష్ణ చైతన్య ఉద్యమము చాలా సులభం. చాలా సులభం. ఇది ప్రత్యేకంగా భగవంతుడు చైతన్య మహాప్రభువుచే ప్రారంభించబడింది, ఇది చాలా పాతది అయినప్పటికీ, వేద గ్రంథాలలో, కానీ ఇప్పటికీ, చారిత్ర్హిక దృష్టి నుండి తీసుకోవడం ద్వార, ఈ కృష్ణ చైతన్య ఉద్యమం, కృష్ణుడు ఐదు వేల సంవత్సరాల క్రితం ఈ లోకము యొక్క ఉపరితలంపై భగవంతుడు అవతరించినప్పటి నుంచి, తరువాత ఐదు వందల సoవత్సరాల క్రితo, భగవంతుడు చైతన్య మహా ప్రభువు, ఈ ఉద్యమాన్ని, కృష్ణ చైతన్యమును విస్తరించాడు. అయిన లక్ష్యము, భగవంతుడు చైతన్య మహాప్రభువు యొక్క లక్ష్యము, ārādhyo bhagavān vrajeśa-tanayaḥ. మీరు ప్రేమించాలని అనుకుంటే, లేదా మీరు సేవకునిగా ఉండాలని కోరుకుంటే ... అందరూ సేవకులుగా ఉంటారు. ఇది తప్పు. అందరూ స్వతంత్రంగా ఉండాలని కోరుకుంటారు, కానీ ఎవరూ స్వతంత్రంగా లేరు. అందరూ సేవకులే. "నేను స్వతంత్రంగా ఉన్నాను" అని ఎవరూ చెప్పలేరు. మీరు స్వతంత్రులు అని మీలో ఎవరైనా చెప్పగలరా? ఎవరైనా ఉన్నారా? లేదు. ప్రతి ఒక్కరూ సేవకులు, ఇష్టపూర్వకంగా ఉన్నారు. శక్తి ద్వారా కాదు. అందరూ సేవకులు అవ్వుతారు. ఒక అమ్మాయి ఒక అబ్బాయికి చెప్పుతుంది, "నేను మీ సేవకునిగా ఉండాలని కోరుకుంటున్నాను," ఇష్టపూర్వకంగా. అదేవిధంగా ఒక అబ్బాయి ఒక అమ్మాయికి చెప్తాడు, "నేను మీ సేవకునిగా ఉండాలని అనుకుంటున్నాను." ఎందుకు? నా స్వభావం. నేను సేవకునిగా ఉండాలని అనుకుంటున్నాను. నా స్వభావం సేవకునిగా ఉండటం. కాని నాకు తెలియదు. నేను మొగ్గుచూపుతాను ... నేను సేవకునిగా ఉండటాన్ని తిరస్కరిస్తాను; నేను మరొకరికి సేవకునిగా ఉండటానికి అంగీకరిస్తాను. కానీ సేవాతత్వము ఉంది. ఒక కార్మికుడు వలె. అయిన ఇక్కడ పని చేస్తాడు. అయిన వేరొక్క చోట మంచి వేతనాలు ఇస్తున్నారని కనుగొంటాడు, అక్కడకు అయిన వెళ్తాడు. కానీ అయిన స్వతంత్రుడు అని అర్థం కాదు. అయిన సేవకుడు. అందువల్ల చైతన్య మహా ప్రభువు బోధిస్తున్నాడు మీరు సేవకునిగా ఉండాలని కోరుకుంటే లేదా మీరు ఎవరినైన పూజించాలని అనుకుంటే ... ఎవరు పూజిస్తారు ఎవరినైనా? నీవు నీ కంటే ఎవరైనా ఎక్కువ అని భావిస్తే తప్ప, నీవు ఎందుకు ఆరాధిస్తావు? నా యజమానిని నేను పుజిస్తాను, ఎందుకంటే అయిన నా కంటే ఎక్కువగా ఉన్నాడని నేను భావిస్తాను. అయిన నాకు వేతనాలు, జీతాము, నెలవారీ ఆరు వందల డాలర్లు ఇస్తాడు. అందువలన నేను అయినని ఆరాధించాలి, నేను అయినని సంతృప్తి పరచాలి.

చైతన్య మహాప్రభు చెప్పుతారు మీరు కృష్ణుడికి సేవకునిగా ఉండండి Ārādhyo bhagavān vrajeśa-tanayaḥ. మీరు పుజిoచాలనుకుంటే, కృష్ణుడిని పూజిoచండి. తరువాత, tad-dhāmaṁ vṛndāvanam. మీరు ఎవరినైన పుజిoచాలని కోరుకుంటే, అప్పుడు కృష్ణుడిని ప్రేమిoచండి లేదా కృష్ణుడిని పూజించoడి, లేదా అయిన ప్రదేశమైన వృందావనన్ని. ఎందుకంటే ప్రతి ఒక్కరూ ఎదో ఒక్క స్థలాన్ని ప్రేమిoచాలనుకుంటారు . ఇప్పుడు ఇది జాతీయత - ఎదో ఒక్క దేశం. ఎవరో చెప్పుతారు, "నేను ఈ అమెరికన్ దేశాన్ని ప్రేమిస్తున్నాను." "నేను ఈ చైనీస్ దేశాన్ని ప్రేమిస్తున్నాను" అని ఎవరో చెప్పుతారు ఎవరో చెప్పుతారు, "నేను రష్యన్ దేశాన్ని ప్రేమిస్తున్నాను." ప్రతి ఒక్కరూ ఏదో ఒక్క దేశాన్ని ఇష్టపడతారు. Bhauma ijya-dhīḥ. Bhauma ijya-dhīḥ. ఎదో ఒక్క భౌతిక ప్రదేశాన్ని ప్రేమించాలని సహజంగా ప్రజలు ఆసక్తి చూపుతారు. సాధారణంగా, అయిన జన్మించిన ప్రదేశమును అయిన ప్రేమిస్తాడు. చైతన్య మహాప్రభు చెప్పుతారు "మీరు ఎవరినైన ప్రేమిoచాలని అనుకుoటే, మీరు కృష్ణుడిని ప్రేమిoచండి. మీరు ఏదైనా ప్రదేశాన్ని ప్రేమిoచాలని కోరుకుoటే, మీరు వృందావనాన్ని ప్రేమిoచండి. " Ārādhyo bhagavān vrajeśa-tanayas tad-dhāma vṛndāvanam. కానీ ఎవరో చెప్తే, "కృష్ణుడిని ఎలా ప్రేమిoచాలి? నేను కృష్ణుడిని చూడలేను. కృష్ణుడిని ఎలా ప్రేమిoచాలి? " అప్పుడు చైతన్య మహాప్రభు చెప్పుతాడు, ramyā kācid upāsanā vrajavadhū-vargeṇa yā kalpitā. మీరు నేర్చుకోవాలనుకుంటే, మీరు తెలుసుకోవాలనుకుంటే, కృష్ణుడిని పూజించే పద్ధతి, లేదా కృష్ణుడిని ప్రేమించడం, ఉదాహరణకు గోపీకల అడుగుజాడలను అనుసరించడానికి ప్రయత్నించండి. గోపికలు. గోపీకలు, వారి ప్రేమ - ఉన్నతమైన పరిపూర్ణ ప్రేమ. Ramyā kācid upāsanā. ప్రపంచంలో వివిధ రకాల ప్రేమ లేదా ఆరాధన పద్దతులు ఉన్నాయి. ప్రారంభము, "ఓ దేవుడా, మాకు రోజు వారి రొట్టెను ఇవ్వండి." ఇది ప్రారంభము. మనకు దేవుణ్ణి ప్రేమిoచాలని నేర్పించినప్పుడు, మనకు సూచన ఇవ్వబడినది. మీరు దేవాలయానికి వెళ్ళoడి, చర్చికి వెళ్ళoడి, మీ అవసరాల కోసం, మీ ఫిర్యాదుల కోసం దేవుడికి ప్రార్థన చేయండి. ఇది ఆరంభం. కానీ అది పవిత్రమైన ప్రేమ కాదు. పవిత్రమైన ప్రేమ, పవిత్రమైన ప్రేమ యొక్క పరిపూర్ణత్వము, గోపీకలలో చూడవచ్చు. ఇదే ఉదాహరణ.

ఎలా? వారు కృష్ణుడిని ఎలా ప్రేమిoచారు? వారు కృష్ణుడిని ప్రేమిoచారు. కృష్ణుడు వెళ్ళాడు ... కృష్ణుడు గోప బాలుడు, అయిన స్నేహితులు, ఇతర గోప బాలురు, అయిన రోజంతా పచ్చిక బయళ్లలో తన ఆవులతో వెళ్ళేవాడు. ఆది పద్ధతి. ఎందుకంటే ఆ సమయంలో ప్రజలు భూమితో ఆవులతో సంతృప్తి చెందే వారు. అది అంతే. అది అన్ని ఆర్థిక సమస్యలకు పరిష్కారం. వారు పారిశ్రామికంగా లేరు, వారు ఎవరికీ సేవకులుగా లేరు. ఉదాహరణకు భూమి నుండి ఉత్పత్తి పొందండి ఆవులు నుండి పాలు తీసుకోండి, మొత్తం ఆహార సమస్య పరిష్కారం అవ్వుతుంది.