TE/Prabhupada 0365 - ఇస్కాన్ ను ఒక మలం సమాజంగా చేయవద్దు. దీనిని ఒక తేనె సమాజం చేయండి

Revision as of 08:04, 1 September 2017 by Kamalakar (talk | contribs) (Created page with "<!-- BEGIN CATEGORY LIST --> Category:1080 Telugu Pages with Videos Category:Prabhupada 0365 - in all Languages Category:TE-Quotes - 1969 Category:TE-Quotes -...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


Lecture on SB 1.5.9-11 -- New Vrindaban, June 6, 1969

ఇక్కడ నారద ముని సలహా ఇస్తున్నాడు "మీరు వివరించారు ..." Dharmādayaś ca artha. వేరే సాహిత్యంలో మీరు మొత్తం వేదాలను అర్ధం చేసుకోగలిగిన భాషలో, పురాణాలుగా విభజించారు. పురాణాలు అంటే వేదాలకు అనుబంధం, వేదముల జ్ఞానంను లక్షణముల ప్రకారం వివరించడానికి. ప్రతి మానవుడు భౌతిక ప్రకృతి యొక్క కొన్ని లక్షణములలో ఉంటాడు. వారిలో కొoదరు చీకటిలో లేదా అజ్ఞానంలో ఉoటారు. వారిలో కొందరు రజో గుణములో ఉంటారు. వారిలో కొoదరు తమో గుణము రజో గుణముల మిశ్రమములో ఉoటారు. వారిలో కొoదరు కాంతిలో, లేదా సత్వ గుణములో ఉoటారు. అందరు ఒకే స్థాయిలో లేరు. వ్యక్తులు వివిధ తరగతులలో ఉన్నారు. ఉదాహరణకు మన హయాగ్రివ లైబ్రరీలో మీరు చాలా తత్వశాస్త్ర పుస్తకాలను చూస్తారు. కానీ మీరు సామాన్య మానవుడి దగ్గరకు వెళ్తే మీరు కొన్ని అర్ధం లేని సాహిత్యం, కల్పన, సెక్స్ సైకాలజీని, మరెన్నో చూస్తారు. రుచి ప్రకారం. రుచి ప్రకారం, వివిధ రుచులు. వ్యక్తులు వివిధ తరగతుల వ్యక్తులు ఉన్నారు కనుక. అది తరువాతి శ్లోకములో వివరించబడుతుంది. నారద ముని చెప్పుతాడు, na yad vacaś citra-padaṁ harer yaśo jagat-pavitraṁ pragṛṇīta karhicit tad vāyasaṁ tīrtham uśanti mānasā na yatra haṁsā niramanty uśik-kṣayāḥ ( SB 1.5.10)

అందువల్ల అతడు వేదావ్యాసుడు రచించిన అన్ని పుస్తకాలను పోల్చాడు, వేదాంత తత్వముతో సహా. ఇది vāyasaṁ tīrtham అని అతను చెప్తాడు. vāyasaṁ tīrtham. vāyasaṁ అంటే కాకులు. కాకులు, వాటికి ఆనందం ఇచ్చే ప్రదేశము. మీరు కాకులను చూశారా? భారతదేశంలో మనకు అనేక కాకులు వున్నాయి. మీ దేశంలో కాకులు చాలా తక్కువ ... కానీ భారతదేశంలో కాకులు, అవి అన్ని అసహ్యమైన వాటిల్లో ఆనందం పొందుతాయి. కాకులు. మీరు అవి , చెత్త, చెత్త ఉన్నా ప్రదేశంలో అవి ఆనందం పొందుతాయి అవి చెత్తను ఎక్కడ ఉన్నా ఎంచుకుంటాయి, ఎక్కడ చీము, శ్లేష్మం ఉంటాయో ఎక్కడ ... ఉదాహరణకు ఈగలు లాగా .... అవి మలము మీద కూర్చుని ఉంటాయి. Mākṣikaṁ bhramarā icchanti తేనెటీగలు, అవి తేనెను తీసుకోవాలని ప్రయత్నిస్తుంటాయి. జంతువులలో కూడా మీరు చూస్తారు. తేనె ... తేనెటీగలు మలము దగ్గరకు ఎప్పటికీ రావు. సాధారణ ఈగలు, అవి తేనెను సేకరించడానికి ఎప్పటికీ వెళ్ళవు. అదేవిధంగా, పక్షులలో విభాగాలు, జంతువుల విభాగాలు, మానవ సమాజంలో విభాగాలు ఉన్నాయి. సాధారణ వ్యక్తి కృష్ణ చైతన్యమునకు వస్తాడని మీరు ఆశించ కూడదు. మీరు చూడoడి? వారు ఈగలుగా మారడానికి శిక్షణ పొందినారు కనుక వారు మలమును రుచి చూస్తారు. మీరు చూడoడి? ఆధునిక విద్య, ప్రజలను ఈగలు అవ్వడానికి బోధిస్తుంది, కేవలం మలం మాత్రమే. ఇక్కడ కాదు. కృష్ణ చైతన్యములో. కానీ మీరు దాన్ని తేనెగూడు చేయండి. తేనె కోరుకునే వారు, "ఇక్కడ ఏదో ఉంది" అని చూస్తారు. మీరు చూడoడి? దీనిని ఒక మలం సమాజంగా చేయవద్దు. దీనిని ఒక మలం సమాజంగా చేయవద్దు. దీనిని ఒక తేనె సమాజం చేయండి మీరు చూడoడి? దీనిని ఒక తేనె సమాజం చేయండి. కనీసం, తేనె కోసము వెతుకుతున్నవారికి అవకాశం ఇవ్వండి. ప్రజలను మోసం చేయవద్దు. వారు వస్తారు

ఇక్కడ నారద ముని చెప్పరు, "చాలా పుస్తకాలను మీరు రచించారు, అది సరే. ఆలోచన ఏమిటి? ఆలోచన ఏమిటంటే dharmādayaḥ.. మీరు ధర్మ సూత్రాలను ప్రచారము చేస్తున్నారు. " ఇరవై ఉన్నాయి,viṁśati, dharma-śāstrāḥ. ఈ మను-సoహిత, పరాశర ముని యొక్క చట్టం, సాంఘిక ఆచారం, ఇవి, ఆవి. చాలా ఉన్నాయి. ఇవి మొదట వేర్వేరు ఋషులుచే రచించ బడినవి , కానీ వ్యాసదేవుడు దీనిని తయారు చేసాడు, సరైన ఉపయోగం కోసం దీనిని రచించారు. ప్రజలు వాటిని అర్థం చేసుకోగలరు. అందువల్ల అయిన ఈ పుస్తకాలన్నింటినీ మానవ సమాజం యొక్క వాడకానికి నిస్సందేహంగా వివరించాడు. ధర్మముగా ఎలా ఉండాలి , ఆర్ధిక స్థితిని ఎలా అభివృద్ధి చెసుకోవాలి, విముక్తిని ఎలా అర్థం చేసుకోవాలి, ఏవిధంగా నియమములతో ఇంద్రియాలను సంతృప్తి పరుచుకోవాలి. పుస్తకాలలో మాదిరిగానే, వ్యాసాదేవుని పుస్తకాలలో, మీరు ఈ విభిన్న రకాలు కనుగొంటారు... కేవలము మాంసం తింటున్నావారి వలె. ఆది కూడా వ్యాసదేవుడుచే దర్శకత్వం ఇవ్వబడింది, తమాసిక-పురాణములో, అజ్ఞానంలో ఉన్న వ్యక్తుల కోసం పురాణము.

అతను ఎవరినీ తిరస్కరించ లేదు. ఏ వ్యక్తి అయినా పుస్తకాలను చదవటానికి అయిన పుస్తకాలు చేసాడు ... ఒక పాఠశాలలో వేర్వేరు తరగతులు ఉన్నాయి వేర్వేరు తరగతులకు వేర్వేరు పుస్తకాలు సిఫారసు చేయబడ్డాయి. అదేవిధంగా, వ్యాసాదేవుడు మొత్తం వేదముల సాహిత్యంను పురాణముల రూపంలో చక్కని విధంగా ఇచ్చాడు ఏ వ్యక్తి అయినా అత్యధిక స్థానానికి చేరుకోవచ్చు, ఇలాంటి పుస్తకాలను చదువటము వలన. ఉదాహరణకి తీసుకోండి, మత్తు తీసుకోవటం, మాంసం తినడం, లైంగిక జీవితమునకు బానిసలయిన వారు - ఎందుకంటే ఇవి సహజ ప్రవృత్తులు . Loke vyavāyāmiṣa-madya-sevā nityā hi jantor na hi tatra codanā. ( SB 11.5.11) భోధన చేయడానికి, పాఠం ఇవ్వడానికి ఎవరూ అవసరం లేదు. ఎవరికీ అతడు లైంగిక సంబంధం ఎలా కలిగి ఉండాలో నేర్పించాల్సిన అవసరం లేదు. ఎవరు తీసుకోలేదు, నా ఉద్దేశ్యం, భోధించలేదు అయిన మత్తును ఎలా తీసుకోవాలో . మీరు మత్తుపదార్థాలు, మత్తులో ఉన్న వ్యక్తి, వారు సహజముగా అలవాటు పడ్డారు? విశ్వవిద్యాలయం లేదు. ఏ విద్యా పద్ధతి లేదు "మీరు అయ్యారు ... ఈ LSDని ఈ విధముగా తీసుకోండి." లేదు ఇది ఒక సహజ ధోరణి. మత్తు తీసుకోవడము, మద్యం తీసుకోవడము, LSD, gāñjā, pān, oh, చాలా సులభంగా మీరు నేర్చుకోవచ్చు. లైంగిక జీవితాన్ని ఉపయోగించుకోవటానికి ...

Loke vyavāya... ఇవి సహజమైన ప్రవృత్తులు. వారు కావచ్చు ... సహజముగా అవి చేయబడుతాయి. ఏటువంటి ప్రశ్న లేదు ... అప్పుడు పుస్తకం వలన ఉపయోగం ఏమిటి? పుస్తకము పరిమితం చేయడానికి. అది వారికి తెలియదు. వ్యాసదేవుడు మీరు వివాహం ద్వారా లైంగిక జీవితం కలిగి ఉండాలని సిఫారసు చేసినప్పుడు, అంటే పరిమితి. అంటే పరిమితి. మీరు ఇక్కడ అక్కడ లైంగిక జీవితం ఇష్టమోచ్చినట్లు కలిగి ఉండకూడదు మీరు ఒక భార్య లేదా ఒక భర్తను కలిగి ఉన్నారు, ఆది కూడా పరిమితం చేయబడింది: పిల్లల కోసం మీరు సెక్స్ జీవితాన్ని కలిగి ఉంటారు. చాలా విషయాలు. మొత్తం ఆలోచన పరిమితి. అంతే కాని "నాకు ఒక భార్య ఉంది. ఆమె సెక్స్ జీవితం కోసం ఒక యంత్రం." కాదు కాదు. ఒక వివాహం అంటే అర్థం, దాని అర్థం అది కాదు. వివాహం అలాంటి అర్ధము కలిగి లేదు. ఇది పరిమితి. మొత్తం వేదముల నాగరికత వ్యక్తులను ఆధ్యాత్మిక స్థితికు తీసుకురావడనికి, తన అర్ధంలేని అలవాట్లను పరిమితం చేసి శూన్యము చేయడానికి. కానీ అకస్మాత్తుగా కాదు. క్రమంగా, లక్షణము ప్రకారం. అదేవిధంగా, మాంసం తినడం మాంసమునకు బానిసలు, మాంసం తినడానికి: "అది సరే." వైదిక సాహిత్యం ఇలా చెప్తుంది, "సరే, మీరు మాంసం తినవచ్చు. కానీ దేవత, కాళీకా దేవీ ముందు ఒక జంతువును త్యాగం చేసి, మీరు తినవచ్చు. " అప్పుడు మాంసం తినుటున్నా మనిషి, అయిన తిరుగుబాటు చేయడు.