TE/Prabhupada 0399 - శ్రీ నామ గాయ్ గౌరచంద్ మధూర్ స్వరే పాటకు భాష్యము: Difference between revisions

 
(Vanibot #0023: VideoLocalizer - changed YouTube player to show hard-coded subtitles version)
 
Line 7: Line 7:
[[Category:TE-Quotes - in USA, Los Angeles]]
[[Category:TE-Quotes - in USA, Los Angeles]]
<!-- END CATEGORY LIST -->
<!-- END CATEGORY LIST -->
<!-- BEGIN NAVIGATION BAR -- TO CHANGE TO YOUR OWN LANGUAGE BELOW SEE THE PARAMETERS OR VIDEO -->
<!-- BEGIN NAVIGATION BAR -- DO NOT EDIT OR REMOVE -->
{{1080 videos navigation - All Languages|French|FR/Prabhupada 0398 - La teneur et portée de Sri Krishna Caitanya Prabhu|0398|FR/Prabhupada 0400 - La teneur et portée du Sri Sri Siksastakam|0400}}
{{1080 videos navigation - All Languages|Telugu|TE/Prabhupada 0398 - శ్రీ కృష్ణ చైతన్య మహాప్రభు పాటకు భాష్యము|0398|TE/Prabhupada 0400 - శిక్షాష్టకము శ్లోకములకు భాష్యము|0400}}
<!-- END NAVIGATION BAR -->
<!-- END NAVIGATION BAR -->
<!-- BEGIN ORIGINAL VANIQUOTES PAGE LINK-->
<!-- BEGIN ORIGINAL VANIQUOTES PAGE LINK-->
Line 18: Line 18:


<!-- BEGIN VIDEO LINK -->
<!-- BEGIN VIDEO LINK -->
{{youtube_right|PZzgMygi0aM|శ్రీ నామ గాయ్ గౌరచంద్ మధూర్ స్వరే పాటకు భాష్యము  <br />- Prabhupāda 0399}}
{{youtube_right|CxCYCHsKjNo|శ్రీ నామ గాయ్ గౌరచంద్ మధూర్ స్వరే పాటకు భాష్యము  <br />- Prabhupāda 0399}}
<!-- END VIDEO LINK -->
<!-- END VIDEO LINK -->



Latest revision as of 19:22, 8 October 2018



Purport to Sri Nama, Gay Gaura Madhur Sware -- Los Angeles, June 20, 1972


గాయ్ గౌరచంద్ మధూర్ స్వరే. ఇది భక్తి వినోద ఠాకూరుల వారిచే రచించబడిన గీతము. ఆయన ఇలా చెబుతున్నారు, చైతన్య మహాప్రభు, గౌర, గౌర అంటే చైతన్య మహాప్రభు, గౌరసుందర, బంగారు వర్ణం లో వున్నవాడు. గాయ్ గౌరచంద్ మధుర్ స్వరే మధుర స్వరం లో మహా మంత్రాన్ని గానం చేస్తున్నాడు, హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ కృష్ణ హరే హరే, హరే రామ హరే రామ రామ రామ హరే హరే. ఆయన మధుర స్వరం లో గానము చేస్తున్నారు, మహా-మంత్రాన్ని గానము చేసే పధ్ధతిలో వారి అడుగుజాడలను అనుసరించుట మన బాధ్యత.

భక్తివినోద ఠాకుర ఇలా సూచిస్తున్నారు, gṛhe thāko, vane thāko, sadā 'hari' bole' ḍāko. గృహే థాకో అంటే గృహస్థుడిగా మీరు మీ ఇంటి వద్ద ఉన్నాకూడా అని అర్థం, లేదా మీరు సన్యాసిలా అరణ్యవాసం చేస్తూ ఉన్నా సరే,ఎలావున్నా పరవాలేదు. అయితే మీరు హరేకృష్ణ మహా మంత్రాన్ని జపించాలి. Gṛhe vane thāko, sadā 'hari' bole' ḍāko. ఎల్లప్పుడూ ఈ మహా-మంత్రాన్ని జపించు. Sukhe duḥkhe bhulo nā'ko, "దుఃఖంలో వున్నా ఆనందంలోవున్నా హరినామ జపాన్ని మరువవద్దు." Vadane hari-nāma koro re. హరి నామ జప కీర్తనల విషయానికి వస్తే వాటిని ఎప్పుడూ విడువకూడదు, కాబట్టి ఎటువంటి పరిస్థితిలో అయినా, నేను ఈ మహా-మంత్రాన్ని జపిస్తూ ఉంటాను, హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ కృష్ణ హరే హరే, హరే రామ హరే రామ రామ రామ హరే హరే.

భక్తి వినోద ఠాకూరుల వారు ఈ విధంగా సూచిస్తున్నారు, "మీరు బాధ లో వున్నా లేదా ఆనందంలో ఉన్నాగానీ పట్టించుకోవద్దు,ఈ మహా-మంత్రాన్ని జపిస్తూ ఉండండి." Māyā-jāle baddha ho'ye, ācho miche kāja lo'ye. మీరు మాయా శక్తి యొక్క ఉచ్చులో చిక్కుకుపోయారు. మాయా జాలే బద్ద హొయే, ఎలాగంటే జాలరి ఉచ్చు వేసి, సముద్రంలోని రకరకాల జలచరాలను ఆ ఉచ్చు తో బంధిస్తాడో. అదేవిధంగా మనం కూడా మాయ యొక్క ఉచ్చు లో ఉన్నాము, మనకు స్వేచ్ఛ లేని కారణంగా ,మన కార్యక్రమాలన్నీ వ్యర్థము. స్వేచ్ఛతో చేసే పనులకు కొంత అర్థం ఉంది కానీ మనకు స్వేచ్ఛ లేదు, మనం మాయ యొక్క ఊబిలో, మాయ యొక్క ఉచ్చులో చిక్కుకొని ఉన్నాము కాబట్టి మన స్వేచ్ఛకు విలువ లేదు. అందువలన, మనము ఏమి చేస్తున్నా, అది కేవలం ఓటమిపాలే అవుతూంది. మన స్వరూప స్థితి తెలియకుండా, మీరు ఏదో చేయలని ప్రయత్నిస్తే, మాయ యొక్క ప్రబావం వలన, అది కేవలం అనవసర కాల వ్యయమే అవుతుంది. అందువలన, భక్తివినోద ఠాకురు ఇలా అంటున్నారు, "ఇప్పుడు మీరు మానవ శరీరం పొంది పూర్తి చైతన్యము కలిగి ఉన్నారు. కాబట్టి హరే కృష్ణ ,రాధా మాధవ అని భగవావన్నామాలను కీర్తించండి. అందులో నష్టం ఏమీ లేదు, కానీ గొప్ప లభాన్ని పొందుతారు. " Jīvana hoilo śeṣa, nā bhajile hṛṣīkeśa. ఇప్పుడు క్రమముగా ప్రతి ఒక్కరూ మరణం అంచుకి చేరతారు, నేను ఉంటాను, నేను మరొక వంద సంవత్సరాలు జీవిస్తాను, అని ఎవరమూ చెప్పలేము, లేదు, ఏ క్షణమైనా మనము మరణించవచ్చు. అందువలన వారు ఈ విధంగా సలహా ఇస్తున్నారు, జీవన హయిలో శేష: మన జీవితము ఏ క్షణంలో అయిన ముగియవచ్చు, మరియు అప్పుడు మనము హృషికేశుని, కృష్ణుడి సేవ చేయలేము. Bhaktivinodopadeśa. భక్తి వినోదోపదేశ ,అందువల్ల భక్తివినోద ఠాకురుల వారు ఇలా సలహ ఇస్తున్నారు, ekbār nām-rase mati re: Bhaktivinodopadeśa. దయచేసి హరినామం పట్ల మంత్రముగ్ధులయి, నామరసే, దివ్య నామ జపము లో రసాస్వాదనను పొందండి. కృష్ణ ప్రేమ సాగరంలో మునిగి తేలండి.ఇది నా అభ్యర్థన.