TE/Prabhupada 0434 - మోసగాళ్ల నుండి శ్రవణం చేయవద్దు మరియు ఇతరులను మోసం చేయటానికి ప్రయత్నించవద్దు: Difference between revisions

(Created page with "<!-- BEGIN CATEGORY LIST --> Category:1080 Telugu Pages with Videos Category:Prabhupada 0434 - in all Languages Category:TE-Quotes - 1975 Category:TE-Quotes -...")
 
(Vanibot #0023: VideoLocalizer - changed YouTube player to show hard-coded subtitles version)
 
Line 6: Line 6:
[[Category:TE-Quotes - in Australia]]
[[Category:TE-Quotes - in Australia]]
<!-- END CATEGORY LIST -->
<!-- END CATEGORY LIST -->
<!-- BEGIN NAVIGATION BAR -- TO CHANGE TO YOUR OWN LANGUAGE BELOW SEE THE PARAMETERS OR VIDEO -->
<!-- BEGIN NAVIGATION BAR -- DO NOT EDIT OR REMOVE -->
{{1080 videos navigation - All Languages|French|FR/Prabhupada 0433 - Nous déclarons : "Ne vous adonnez pas à la vie sexuelle illicite"|0433|FR/Prabhupada 0435 - Ces problèmes matériels nous rendent perplexes|0435}}
{{1080 videos navigation - All Languages|Telugu|TE/Prabhupada 0433 - మనం చెప్పుతాము మీకు అక్రమ లైంగిక సంబoధము ఉండకూడదు|0433|TE/Prabhupada 0435 - ఈ సకల ప్రాపంచిక సమస్యలచేత మనము కలవరపాటుకు గురవుతున్నాము|0435}}
<!-- END NAVIGATION BAR -->
<!-- END NAVIGATION BAR -->
<!-- BEGIN ORIGINAL VANIQUOTES PAGE LINK-->
<!-- BEGIN ORIGINAL VANIQUOTES PAGE LINK-->
Line 17: Line 17:


<!-- BEGIN VIDEO LINK -->
<!-- BEGIN VIDEO LINK -->
{{youtube_right|suTi4Y5sp9o|మోసగాళ్ల నుండి శ్రవణం చేయవద్దు మరియు ఇతరులను మోసం చేయటానికి ప్రయత్నించవద్దు  <br/>- Prabhupāda 0434}}
{{youtube_right|D0REu9tfzwg|మోసగాళ్ల నుండి శ్రవణం చేయవద్దు మరియు ఇతరులను మోసం చేయటానికి ప్రయత్నించవద్దు  <br/>- Prabhupāda 0434}}
<!-- END VIDEO LINK -->
<!-- END VIDEO LINK -->



Latest revision as of 19:28, 8 October 2018



Morning Walk -- May 10, 1975, Perth


ప్రభుపాద: ఆధునిక యుగం అంటే అందరూ మూఢులు మరియు మూర్ఖులు. మనం మూఢులను, మూర్ఖులను అనుసరించడానికి లేదు. మీరు పరమ ప్రామాణికుడైన, కృష్ణుడిని అనుసరించాలి.

పరమహంస: వచ్చిన సమస్య ఏంటంటే ప్రతి ఒక్కరూ మోసగిస్తున్నారు. ప్రతి ఒక్కరూ దాని గురించో దీని గురించో సంబంధించిన జ్ఞానాన్ని ఇస్తున్నారు...

ప్రభుపాద: అందువలన కృష్ణుడిని మనము అంగీకరించాము,ఎవరైతే మోసం చేయరో మీరు మోసగాళ్ళు, అందువల్ల మీరు మోసగాళ్ళను నమ్ముతున్నారు. మేము మోసం చేయము,మరియు మేము మోసం చేయని ఒక వ్యక్తి ని అంగీకరిస్తాము. అది మాకూ మీకూ మధ్య వ్యత్యాసం.

గణేశ: కానీ శ్రీల ప్రభుపాద, మీ వద్దకు వచ్చే ముందు మేమంతా మోసగాళ్లము. అప్పుడు మేమంతా మోసగాళ్ళము ,అయితే మేము ఒక మోసగాన్ని అంగీకరించడం జరగలేదు ఎందువలన? ఎలా మోసగాళ్ళమైన మేము మీ నుండి కొంత జ్ఞానాన్ని పొందగలిగాము?

ప్రభుపాద: అవును, ఎందుకంటే మేము కృష్ణుడు బోధించిన దాని గురించి మాట్లాడుతున్నాము. అతను మోసగాడు కాదు. అతను దేవాదిదేవుడు. నేను మీతో మాట్లాడుతున్నది, నా స్వంత జ్ఞానం కాదు. మేము కృష్ణుడు బోధించిన దానిని మీకు వివరిస్తున్నాము అంతే. అందువలన నేను మోసగాన్ని కాను. నేను ఒక మోసగాన్ని కావచ్చు, కానీ నేను కృష్ణుని యొక్క ఉపదేశాలను మాత్రమే మాట్లాడుతున్నాను,కాబట్టి అప్పటినుండి నేను మోసగాన్ని కాను. (దీర్ఘ విరామం) కృష్ణుడు చెబుతున్నాడు, vedaham samatitani ( BG 7.26) "నేను భూత, వర్తమాన భవిష్యత్తుల గురించి ఎరుగుదును." అందువలన అతను మోసగాడు కాదు. కానీ మన విషయానికి వస్తే, మనము గతము మరియు భవిష్యత్తు గురించి ఎరుగము. మనకు ప్రస్తుతం గురించి కూడా సంపూర్ణంగా తెలియదు. మరియు మనము ఏదో మట్లాడితే, అది మోసగించడం అవుతుంది. అది మోసం. (దీర్ఘ విరామం) మా కృష్ణ చైతన్య ఉద్యమం ఏంటంటే మోసగాళ్ల మాటలు వినవద్దు మరియు ఇతరులను మోసం చేయటానికి ప్రయత్నించవద్దు. నిజాయితీగా ఉండండి, ప్రామాణికుని నుండి శ్రవణం చేయండి. అది కృష్ణుడు. (దీర్ఘ విరామం)

అమోఘ: శ్రీల ప్రభుపాద? ఎందుకు కొంతమంది ప్రజలు, వారు కృష్ణచైతన్యము గురించి విన్నప్పుడు, కొందరు స్వీకరిస్తారు,మరికొందరు స్వీకరించరు. అటు పిమ్మట, ఆ తరువాత, కృష్ణచైతన్యాన్ని తీసుకుంటున్న వారిలో, కొందరే నిలచి ఉంటారు, మరి కొందరు కృష్ణచైతన్యాన్ని కొంచెం సమయం పాటించి తరువాత వారు విఫలమౌతారు?

ప్రభుపాద: అదే అదృష్టం ,దురదృష్టకరం. ఎలాగంటే ఒకరు తండ్రి ఆస్తిని వారసత్వంగా పొందుతాడు. అలా అనేక మిలియన్ల డాలర్లు పొందివున్నాడు,మరియు అతను డబ్బు నిరుపయోగం చేయడం వల్ల పేదవాని గా మారాడు. ఆవిధముగా, అతను దురదృష్టవంతుడు. అతను ధనాన్ని పొందాడు, కానీ అతను దానిని సద్వినియోగపరచుకోలేకపోయాడు.

జయధర్మ: అదృష్టం అంటే అది కృష్ణుడి దయనా?

ప్రభుపాద: కృష్ణుడి యొక్క దయ ఎల్లప్పుడూ ఉంది. అది మీ స్వేచ్ఛను దుర్వినియోగం పరచడం. మీకు తెలియదు ... మీకు అవకాశం ఇవ్వబడింది - అది అదృష్టం. కానీ మీరు ఆ భాగ్యాన్ని స్వీకరించలేదు. అది మీ దురదృష్టం. అది చైతన్య-చరితామృతం లో చెప్పబడింది. చైతన్య మహాప్రభు చెబుతున్నారు, ei rupe brahmanda bhramite kona bhagyavan jiva ( CC Madhya 19.151) కోనో - ఎవరో అదృష్టవంతుడు దానిని స్వీకరిస్తాడు. కారణం ఎక్కువమంది వారు దురదృష్టవంతులు. మీరే చూడండి, మొత్తం యూరోప్ మరియు అమెరికా అంతటా మనము ప్రచారం చేస్తున్నాము. ఎంతమంది విద్యార్థులు వచ్చారు? వారు వచ్చినప్పటికీ,చాలా తక్కువ సంఖ్య లో వచ్చారు. వారు అదృష్టవంతులు.