TE/Prabhupada 0439 - నా ఆధ్యాత్మిక గురువు నన్ను ఒక గొప్ప మూర్ఖుడిగా గుర్తించారు: Difference between revisions

(Created page with "<!-- BEGIN CATEGORY LIST --> Category:1080 Telugu Pages with Videos Category:Prabhupada 0439 - in all Languages Category:TE-Quotes - 1968 Category:TE-Quotes -...")
 
(Vanibot #0023: VideoLocalizer - changed YouTube player to show hard-coded subtitles version)
 
Line 7: Line 7:
[[Category:TE-Quotes - in USA, Los Angeles]]
[[Category:TE-Quotes - in USA, Los Angeles]]
<!-- END CATEGORY LIST -->
<!-- END CATEGORY LIST -->
<!-- BEGIN NAVIGATION BAR -- TO CHANGE TO YOUR OWN LANGUAGE BELOW SEE THE PARAMETERS OR VIDEO -->
<!-- BEGIN NAVIGATION BAR -- DO NOT EDIT OR REMOVE -->
{{1080 videos navigation - All Languages|French|FR/Prabhupada 0438 - La bouse de vache séchée, brûlée et réduite en cendre est utilisée pour faire du dentifrice|0438|FR/Prabhupada 0440 - La philosophie mayavadi est que l’esprit suprême est impersonnel|0440}}
{{1080 videos navigation - All Languages|Telugu|TE/Prabhupada 0438 - ఆవు పేడను ఎండబెట్టి మరియు కాల్చి బూడిద చేసి తర్వాత పళ్ళపొడిగా వాడవచ్చును|0438|TE/Prabhupada 0440 - మాయావాద సిద్దాంతం ప్రకారం అంత్యమున ఆత్మ నిరాకారమైనది|0440}}
<!-- END NAVIGATION BAR -->
<!-- END NAVIGATION BAR -->
<!-- BEGIN ORIGINAL VANIQUOTES PAGE LINK-->
<!-- BEGIN ORIGINAL VANIQUOTES PAGE LINK-->
Line 18: Line 18:


<!-- BEGIN VIDEO LINK -->
<!-- BEGIN VIDEO LINK -->
{{youtube_right|4VCyXsIucbU|నా ఆధ్యాత్మిక గురువు నన్ను ఒక గొప్ప మూర్ఖుడిగా గుర్తించారు  <br />- Prabhupāda 0439}}
{{youtube_right|iqor_pb2JMw|నా ఆధ్యాత్మిక గురువు నన్ను ఒక గొప్ప మూర్ఖుడిగా గుర్తించారు  <br />- Prabhupāda 0439}}
<!-- END VIDEO LINK -->
<!-- END VIDEO LINK -->



Latest revision as of 19:29, 8 October 2018



Lecture on BG 2.8-12 -- Los Angeles, November 27, 1968


Tad vijñānārthaṁ sa gurum evābhigacchet (MU 1.2.12). తద్ విజ్ఞానార్థం, దివ్య జ్ఞానాన్ని పొందడం కోసం ప్రతి ఒక్కరూ ఆధ్యాత్మిక గురువును ఆశ్రయించాలి. Gurum eva,కచ్చితంగా,తప్పనిసరిగా. లేకపోతే అవకాశం లేదు. అందుచేత ఇక్కడ కృష్ణుడు అర్జునుడి యొక్క ఆధ్యాత్మిక గురువుగా అంగీకరించబడ్డాడు, మరియు ఆధ్యాత్మిక గురువుగా వున్నవారు లేదా తండ్రి,లేదా గురువు, తన కుమారున్ని లేదా శిష్యున్నో శిక్షించే హక్కు ఉంది ... తండ్రి మందలించినప్పుడు కుమారుడు ఆయనపట్ల అసంతృప్తి చెందరాదు. ఇది ప్రతిచోటవున్న కనీస మర్యాద. తండ్రి కొన్నిసార్లు కఠినంగా వ్యవహరించినా, పిల్లవాడు లేదా కుమారుడు సహిస్తాడు. ప్రహ్లాద మహరాజు అందుకు ఒక ఉదాహరణ. ఒక అమాయక పిల్లవాడు, కృష్ణచైతన్యపు పిల్లవాడు, కానీ తండ్రి వేధింపులకు గురవుతున్నాడు. అతను ఎన్నడూ అడ్డు చెప్పలేదు. "సరే కానివ్వండి." అదేవిధంగా కృష్ణుడు,ఆధ్యాత్మిక గురువుగా పదవిని స్వీకరించిన వెంటనే, అర్జునుడిని గొప్ప మూర్ఖుడిగా పేర్కొన్నాడు. చైతన్య మహాప్రభు కూడా చెప్పినవిధంగా "నా ఆధ్యాత్మిక గురువు నన్ను ఒక గొప్ప అవివేకిగా భావించారు( CC Adi 7.71) ". చైతన్య మహాప్రభు అవివేకా? మరియు ఎవరైన చైతన్య మహాప్రభు యొక్క ఆధ్యాత్మిక గురువుగా అవగలరా? ఈ రెండు విషయాలూ అసాధ్యం. చైతన్య మహాప్రభు, కృష్ణుడి అవతారంగా అతనిని భావించనప్పటికీ, కేవలం మీరు అతనిని సాధారణ పండితుడిగా లేదా మానవుడిగా తలచినా కూడా, అతని పాండిత్యానికి సాటి లేదు. కానీ అతను "నా ఆధ్యాత్మిక గురువు నన్ను ఒక గొప్ప అవివేకిగా గుర్తించాడు."అని అన్నాడు. దాని అర్థం ఏమిటి? ఏమిటంటే "ఒక వ్యక్తి ఏ స్థితిలో ఉన్నా కూడా తన ఆధ్యాత్మిక గురువు ముందు మూర్ఖుడిగా భావించాలి, అది అతనికి మంచిది." ఎవరూ మీకేం తెలుసు నాకు మీకన్నా ఎక్కువ తెలుసు అని వాధించకూడదు. అది సరైన స్థితి కాదు, అది నిరాకరించబడింది. శిష్యుని తరపు నుండి మరో విషయం ఏమంటే, ఎందుకు అతను ఎల్లప్పుడూ ఒక వ్యక్తి ముందు ఒక అవివేకిగా భావించాలి? నిజంగా ఒక వ్యక్తి ప్రామాణికుడు అయితేనే, అతడు ఇంకొకరిని అవివేకిలా తలచి నేర్పించగలడు. ఎవరైనా ఒక ఆధ్యాత్మిక గురువును స్వీకరించే విధం ఎలావుండాలంటే,ఆధ్యాత్మిక గురువును స్వీకరించిన వెంటనే , అతను నిజంగా మూర్ఖుడు కాకపోయినా,తనను తాను ఎల్లప్పుడూ మూర్ఖుడిలా భావించాలి, కానీ ఉన్నతమైన స్థితి ఆ విధముగా వుంటుంది. కాబట్టి అర్జునుడు కృష్ణునితో సమాన స్థాయి వ్యక్తిగా లేక స్నేహితుడిగా ఉండకుండా, కృష్ణుడి ముందు ఒక అవివేకిగా ఉండటానికి స్వచ్ఛందంగా అంగీకరించాడు. మరియు కృష్ణుడు అంగీకరిస్తూ "నీవు ఒక అవివేకివి. నీవు పండితునిలా మాట్లాడుతున్నప్పటికీ, నీవు ఒక అవివేకివి, ఎందుకంటే పండితులెవరూ చింతించని భౌతిక పదార్థం గురించి నువ్వు చింతిస్తున్నావు. " అంటే "ఒక అవివేకి చింతిస్తాడు"కాబట్టి, " నీవు ఒక అవివేకివి." ఇది మరోవిధంగా చెప్పేవిధానము ... ఎలాగంటే,తర్కం లో దానిని ఏమని పిలుస్తారు? కుండలీకరణం? లేదా దాని వలె ఏదో, అని. సరే, ఇప్పుడు నేను "నువ్వు నా గడియారం దొంగిలించిన వ్యక్తిలా కనిపిస్తున్నావు"అని అంటే దాని అర్థం "నీవు ఒక దొంగ లాగా కనిపిస్తున్నావు"అని. అదేవిధంగా, కృష్ణుడు,మరో విధంగా ఇలా చెబుతున్నాడు, "నా ప్రియమైన అర్జునా, నీవు జ్ఞానవంతుడైన వ్యక్తిలా మట్లాడుతున్నావు, కానీ పండితుడైన వ్యక్తి శోకింపదగని విషయం గురించి శోకిస్తున్నావు."