TE/Prabhupada 0462 - వైష్ణవ అపరాధము ఒక గొప్ప అపరాధము

Revision as of 19:33, 8 October 2018 by Vanibot (talk | contribs) (Vanibot #0023: VideoLocalizer - changed YouTube player to show hard-coded subtitles version)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


Lecture on SB 7.9.7 -- Mayapur, February 27, 1977


ప్రభుపాద: వైష్ణవ అపరాధము ఒక గొప్ప అపరాధము. మీకు అంబరీష మహారాజు తెలుసు కదా. ఆయన ఒక భక్తుడు, ఆయన... దుర్వాసముని, ఆయన తన యోగ శక్తికి చాలా గర్వంగా ఉన్నాడు, ఆయన అంబరీష మహారాజు యొక్క పాదముల వద్ద అపరాధము కావించెను, మరియు ఆయన కృష్ణుడిచే శిక్షింపబడ్డాడు, ఆయన మీదకు సుదర్శన చక్రం పంపడం ద్వారా . ఆయన చాలా మంది బ్రహ్మ, విష్ణువు నుండి సహయం కోరారు. ఆయన నేరుగా విష్ణులోకంకు వెళ్లవచ్చు, కాని ఆయన క్షమించబడలేదు. ఆయన వైష్ణవుడైన అంబరీష , మహారాజు దగ్గరకు వచ్చి ఆయన కమల పాదముల వద్ద పడిపోయడు. మరియు ఆయన, వాస్తవానికి, వైష్ణవుడు, కనుక వెంటనే ఆయన్ని క్షమించెను. కాబట్టి వైష్ణవ అపరాధ గొప్ప అపరాధము,hātī-mātā. మనం వైష్ణవ అపరాధ గురించి చాలా జాగ్రత్త వహించాలి. మనము చేయ కూడదు ... Arcye viṣṇu śilā-dhīr guruṣu nara-matir vaiṣṇava-jāti-buddhiḥ (Padma Purāṇa). vaiṣṇava-jāti-buddhiḥ. వైష్ణవుని యొక్క జాతి-బుద్ది చూడటం కూడ ఇంకొక అపరాధము, గొప్ప అపరాధము. అదేవిధముగా, గురువు సాధారణ మానవుడని ఆలోచించడం, అది కూడ అపరాధము. అర్చామూర్తి లోహంతో, రాయి తో తయారు చేసినది అని ఆలోచించడం, అది కూడా... ఇవన్నీ అపరాధములు. Sa nārakī.

మనం క్రమబద్ధమైన సూత్రాల గురించి చాలా జాగ్రత్త వహించాలి వైష్ణవుని అడుగుజాడలను అనుసరించండి. Mahājano yena sa gataḥ. ప్రహ్లద మహారాజ సాధారణ బాలుడు అని అనుకోవద్దు. మనము ప్రహ్లద మహారాజు నుండి భక్తియుత సేవలో ఎలా అభివృద్ధి సాధించాలి అనేది నేర్చుకోవాలి.

చాలా ధన్యవాదాలు.

భక్తులు: జయ ప్రభుపాద