TE/Prabhupada 0489 - రహదారిపై కీర్తన చేయడము ద్వారా, వీధిలో, మీరు రసగుల్లాలను వితరణ చేస్తున్నారు

Revision as of 06:13, 27 September 2017 by Kamalakar (talk | contribs) (Created page with "<!-- BEGIN CATEGORY LIST --> Category:1080 Telugu Pages with Videos Category:Prabhupada 0489 - in all Languages Category:TE-Quotes - 1968 Category:TE-Quotes -...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


Lecture -- Seattle, October 18, 1968


విష్ణుజన: మనం మన మాలలను జపిస్తున్నప్పుడు లేదా హరి నామాన్ని బిగ్గరగా కీర్తన చేస్తున్నప్పుడు, ఇది సరి ఆయనదేనా మన మనస్సులో ఆలోచనలను కొనసాగించవచ్చా?

ప్రభుపాద: తప్పు కాదా?

విష్ణుజన: అతడు ఇప్పటికే ... ప్రభుపాద: ఇది ఆచరణీయ మార్గం. మీరు ఆలోచలు చేయకపోతే, హరి నామ కీర్తనము మీరు ఆయనను తలచేలాచేస్తుంది. మీరు గమణించారా? కృష్ణ అనే శబ్దం బలవంతంగా అలా చేస్తుంది.అది దాని శక్తి. భగవన్నామ జపము చాలా రమ్యమైనది. మరియు ఇదే ఈ యుగములో ఆచరణాత్మక యోగ పధ్ధతి. మీరు ధ్యానం చేయలేరు. మీ మనస్సు చాలా కలతచెంది ఉంది, మీరు మీ మనస్సును కేంద్రికరించలేరు. అందువలన భగవన్నామాన్ని కీర్తించండి, ఆ దివ్య శబ్ధ ప్రకంపనం, అది బలవంతంగా మీ మనస్సులోకి చొచ్చుకుపోతుంది. మీరు కృష్ణున్ని ఇష్టపడకపోయినా, కృష్ణుడు మీ మనసులోకి ప్రవేశిస్తాడు. బలవంతంగా. ఇది సులభమైన పద్ధతి. మీరు కష్టపడే పని లేదు. కృష్ణుడు నామరూపంలో మీ మనసులోకి వస్తున్నాడు. ఇది చాలా సులభమైన పద్ధతి. కాబట్టి ఈ కలియుగం కోసం దీనిని సిఫర్సు చేస్తున్నారు. మరియు ఇతరులు కూడ ప్రయోజనం పొందుతారు. మీరు హరినామాన్ని బిగ్గరగా కీర్తించండి. ఇతరులు ఎవరైతే అలవాటులేని వారు , వారు కూడా, కనీసం ... ఎలాగంటే వీధుల్లో పార్కుల్లో వారు "హరే కృష్ణ!" అంటారు. వారు ఎలా నేర్చుకున్నారు? ఈ కీర్తనను వినడం ద్వారా. అంతే. కొన్నిసార్లు పిల్లలు, వారు మనను చూసిన వెంటనే, "ఓ, హరే కృష్ణ!" అంటారు. మాంట్రియల్లో పిల్లలు, నేను వీధిలో నడుస్తున్నప్పుడు, పిల్లలందరు, దుకాణాదారులు, గిడ్డంగిదారులు, వారు "హరే కృష్ణ !" అంటారు. అంతే. అంటే మనం హరే కృష్ణ శబ్ధప్రకంపనని వారి మనస్సులోకి బలవంతంగా చొప్పించాము. మీరు యోగను, ధ్యానాన్ని ఆచరిస్తే, అది మీకు ఉపయోగకరం కావచ్చు. కాని ఇది చాలామంది ఇతరులకు కూడా ఉపయోగకరం అవుతుంది. ఉదాహరణకు ఒకటి చాలా బాగుంది అని అనుకుందాం, మీకు మీరే దానిని ఆస్వాదిస్తున్నారు, కొన్ని రసగుల్లాలు- ఇది ఒక దశ. కానీ మీరు రసగుల్లాలు వితరణ చేస్తే, అది మరొక దశ. కాబట్టి రహదారిపై కీర్తన చేయడము ద్వారా, వీధిలో, మీరు రసగుల్లాలను వితరణ చేస్తున్నారు. (నవ్వు) మీరు పిసినారులు కాదు, ఎందుకంటే మీరు ఒక్కరే తినడం లేదు. మీరు చాలా ఉదారంగా ఇతరులకు వితరణ చేస్తున్నారు. ఇప్పుడు కీర్తిన చేయండి,వితరణ చేయండి. (నవ్వు).