TE/Prabhupada 0515 - మీరు సంతోషముగా ఉండరు, సర్, ఎంత కాలము మీరు ఈ భౌతికము శరీరమును కలిగి ఉంటారో

Revision as of 14:10, 31 December 2017 by Kamalakar (talk | contribs) (Created page with "<!-- BEGIN CATEGORY LIST --> Category:1080 Telugu Pages with Videos Category:Prabhupada 0515 - in all Languages Category:TE-Quotes - 1973 Category:TE-Quotes - Le...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


Lecture on BG 2.25 -- London, August 28, 1973


మన సంతోషకరమైన జీవితము గురించి మనము సిద్ధాంతముగా చెప్పవచ్చు. కానీ మీరు సంతోషముగా ఉండరు, సర్, ఎంత కాలము మీరు ఈ భౌతికము శరీరమును కలిగి ఉంటారో. అది సత్యము. Janma-mṛtyu-jarā-vyādhi-duḥkha-doṣānudarśanam ( BG 13.9) అందువలన తెలివైన వ్యక్తులు, వారు ఉండాలి... కృష్ణుడు ప్రతి ఒక్కరిని తెలివిగలవానిగా చేస్తున్నాడు: "నీవు మూర్ఖుడవు, నీవు జీవితంలో శారీరక భావనలో ఉన్నావు. మీ నాగరికతకు విలువ లేదు. ఇది మూర్ఖపు నాగరికత." ఇక్కడ విషయము ఉంది,

yaṁ hi na vyathayanty ete
puruṣaṁ puruṣarṣabha
sama-duḥkha-sukhaṁ dhīraṁ
so 'mṛtatvāya kalpate
(BG 2.15)

మీ సమస్య ఎలా మీరు తిరిగి నిలదొక్కుకోవాలి అని మనము శాశ్వతము కనుక. ఏదో ఒక మార్గము ద్వారా, మనము ఈ భౌతిక ప్రపంచంలో పడిపోయాము అందువలన, మనం జన్మ మరియు మరణమును అంగీకరిస్తాము. కాబట్టి మన సమస్య మళ్ళీ ఎలా శాశ్వతంగా ఉండాలి. అది అమృతత్వా. కానీ ఈ మూర్ఖులకు, వారికి తెలియదు, శాశ్వతముగా మారే అవకాశం ఉంది అని. కేవలం కృష్ణుని అర్థం చేసుకోవడం ద్వారా, ఒకరు అమరత్వం సాధిస్తారు. Janma karma ca me divyaṁ yo jānāti tattvataḥ ( BG 4.9) కృష్ణుని అర్థం చేసుకోవటానికి ప్రయత్నిస్తే, కృష్ణుడు అంటే ఏమిటి. అప్పుడు tyaktvā dehaṁ punar janma naiti ( BG 4.9) కేవలము కృష్ణుని అర్థం చేసుకోవడం ద్వారా, మీరు కృష్ణునికి సేవ చేయకపోయినా కూడా. మీరు సేవ చేస్తే, మీరు ఇప్పటికే విముక్తి పొందారు. మీరు కేవలం కృష్ణుడిని అర్థం చేసుకోవడానికి తత్వపరముగా ప్రయత్నిస్తే. కానీ, లేదు మూర్ఖులు, వారు ఇలా చెబుతారు: మేము కృష్ణుడిని గొప్ప వ్యక్తిగా అంగీకరిస్తాము. మేము కృష్ణుని భగవంతునిగా అంగీకరించము. ఆర్య-సమాజము వారు చెప్తారు. సరే మీరు ఒక గొప్ప వ్యక్తిని, గొప్ప వ్యక్తిత్వాన్ని అంగీకరిస్తే, మీరు ఆయన ఉపదేశమును ఎందుకు అంగీకరించరు? అప్పుడు ఏ విధముగా గొప్ప వ్యక్తిత్వాన్ని అంగీకరిస్తారు? మీరు కృష్ణుని గొప్ప వ్యక్తిగా అంగీకరించినట్లయితే, కనీసం మీరు కృష్ణుని ఉపదేశమును అనుసరించాలి. కానీ లేదు, అది కూడా వారు చేయరు. ఇంకా వారు ఆర్య-సమాజ్. ఆర్య అంటే పురోగతి చెందుతున్న పక్షము. వారు అధోగతి చెందుతున్న పక్షము. వాస్తవముగా పురోగతి సాధిస్తున్న పక్షము కృష్ణ చైతన్యము కలిగిన వ్యక్తులు, కృష్ణుని భక్తులు. వారు ఆర్యులుగా ఉన్నారు. ఉదాహరణకు అర్జునుడు, కృష్ణుని ఉపదేశము నిర్లక్ష్యం చేయడానికి ప్రయత్నిస్తున్నప్పుడు, అయ్యా, నేను పోరాడను, ఆయన చెప్పాడు, అనార్య -జుష్టమ్ :(BG 2.2). కృష్ణుడి ఆదేశానికి అవిధేయుడైన ఎవరైనా ఆయన అనార్యన్ . కృష్ణుడి ఆదేశాన్ని పాటించిన వారు ఎవరైనా, అతడు ఆర్యన్. ఇది వ్యత్యాసం. అందువల్ల, ఆర్య-సమాజ్ అని పిలవబడే వారు, వారు కృష్ణుడి ఆదేశాన్ని పాటించరు, ఇంకా వారు ఆర్యన్ అని చెప్పుకుంటారు. వాస్తవానికి వారు అనార్యన్ . అనార్య - జుష్టమ్ . ఈ విషయాలు భగవద్గీతలో ఉన్నాయి.

కావున నానుశోచితుమర్హసి :(BG 2.25). ఇక్కడ కృష్ణుడు అన్నాడు, "నీవు శాశ్వతమైన వాడవు. మీ కర్తవ్యము ఆ శాశ్వతమైన స్థానాన్ని సాధించడము ఎలా, అయితే, శరీరానికి సంబంధించినంతవరకు, అంతవంత ఇమే దేహః :(BG 2.18), ఇది నాశనము అవుతుంది. మీరు ఈ శరీరం గురించి చాలా తీవ్రముగా ఉండకూడదు." ఇది వేదముల నాగరికత, ఆర్యుల నాగరికత మధ్య వ్యత్యాసం. వేదముల నాగరికత అంటే ఆర్యన్. అనార్యన్ నాగరికత. అనార్యన్ నాగరికత అంటే శరీర భావన అని అర్థం, ఆర్యన్ నాగరికత అంటే ఆధ్యాత్మిక భావన కలిగి ఉన్న జీవితము, ఎలా ఆధ్యాత్మిక పురోభివృద్ధి సాధించాలి? అది నిజమైన నాగరికత. జీవితం యొక్క శారీరిక సుఖాల కోసము గట్టిగా ఆలోచన చేసేవారు ఎవరైనా వారు అందరు అనార్యులు ఇప్పుడు అది నిరాశపర్చబడినది , నానుశోచితుమర్హసి : ఈ అనవసరపు విషయాల మీద విచారపడకండి.

చాలా ధన్యవాదాలు.

హరే కృష్ణ.