TE/Prabhupada 0518 - బద్ద జీవితము యొక్క నాలుగు విధులు అంటే జన్మ, మరణము, వృద్ధాప్యము, మరియు వ్యాధి: Difference between revisions

(Created page with "<!-- BEGIN CATEGORY LIST --> Category:1080 Telugu Pages with Videos Category:Prabhupada 0518 - in all Languages Category:TE-Quotes - 1968 Category:TE-Quotes - Le...")
 
m (Text replacement - "(<!-- (BEGIN|END) NAVIGATION (.*?) -->\s*){2,}" to "<!-- $2 NAVIGATION $3 -->")
 
Line 7: Line 7:
[[Category:TE-Quotes - in USA, Los Angeles]]
[[Category:TE-Quotes - in USA, Los Angeles]]
<!-- END CATEGORY LIST -->
<!-- END CATEGORY LIST -->
<!-- BEGIN NAVIGATION BAR -- TO CHANGE TO YOUR OWN LANGUAGE BELOW SEE THE PARAMETERS OR VIDEO -->
<!-- BEGIN NAVIGATION BAR -- DO NOT EDIT OR REMOVE -->
{{1080 videos navigation - All Languages|French|FR/Prabhupada 0517 - Même né dans une famille riche, vous n’êtes pas à l’abris de la maladie|0517|FR/Prabhupada 0519 - Les êtres conscients de Krishna ne courent pas après des fantasmagories|0519}}
{{1080 videos navigation - All Languages|Telugu|TE/Prabhupada 0517 - మీరు చాలా గొప్ప కుటుంబంలో జన్మించినందున, మీకు వ్యాధుల రాకుండా ఉంటాయని కాదు|0517|TE/Prabhupada 0519 - కృష్ణ చైతన్యము ఉన్న వ్యక్తులు, వారు అసాధ్యమైన, అవాస్తవమైన వాటి కొరకు కాదు|0519}}
<!-- END NAVIGATION BAR -->
<!-- END NAVIGATION BAR -->
<!-- BEGIN ORIGINAL VANIQUOTES PAGE LINK-->
<!-- BEGIN ORIGINAL VANIQUOTES PAGE LINK-->
Line 18: Line 18:


<!-- BEGIN VIDEO LINK -->
<!-- BEGIN VIDEO LINK -->
{{youtube_right|ETjDsFJipm4|బద్ద జీవితము యొక్క నాలుగు విధులు అంటే జన్మ, మరణము, వృద్ధాప్యము, మరియు వ్యాధి  <br />- Prabhupāda  0518}}
{{youtube_right|THD8I6GK260|బద్ద జీవితము యొక్క నాలుగు విధులు అంటే జన్మ, మరణము, వృద్ధాప్యము, మరియు వ్యాధి  <br />- Prabhupāda  0518}}
<!-- END VIDEO LINK -->
<!-- END VIDEO LINK -->



Latest revision as of 23:37, 1 October 2020



Lecture on BG 7.1 -- Los Angeles, December 2, 1968


మీరు భౌతిక జీవితానికి పరిష్కారమును భౌతిక పద్ధతిలో కనుగొనాలంటే, అది సాధ్యం కాదు. అది కూడా స్పష్టంగా చెప్పబడింది. భగవద్గీతలో మీరు చూస్తారు, దైవీ హి ఏష గుణమయీ మమ మాయా దురత్యయా ( BG 7.14) ఈ భౌతిక ప్రకృతి ఏదైతే ఆమోదించబడినదో, అది కృష్ణునిచే "నా శక్తి" గా పేర్కొనబడినది. మయ మాయా..... ఇది కూడా కృష్ణుని మరొక శక్తి. ఏడవ అధ్యాయంలో అంతా వివరించబడుతుంది. కాబట్టి ఈ శక్తి నుండి బయటపడటం చాలా కష్టం. ఆచరణాత్మకంగా మనం చూస్తున్నాం- మనమేమీ? భౌతిక ప్రకృతి నియమాలను అధిగమించడానికి మనం చేస్తున్న ప్రయత్నాలు చాలా చిన్నవి. ఇది కేవలం సమయం వృధా. భౌతిక ప్రకృతి పై జయించడం ద్వారా మీరు సంతోషంగా ఉండలేరు. ఇప్పుడు సైన్స్ చాలా విషయాలను కనుగొంది. కేవలము, భారతదేశం నుండి విమానం. మీ దేశానికి చేరుకోవడానికి నెలల సమయం పట్టేది, విమానం ద్వారా ఒక రాత్రిలో మనము ఇక్కడకు రావచ్చు. ఈ ప్రయోజనములు ఉన్నాయి. కానీ ఈ ప్రయోజనములతో పాటు, చాలా నష్టాలు ఉన్నాయి. మీరు ఆకాశంలో విమానంలో ఉన్నప్పుడు, మీరు ఎడారి మధ్యలో ఉన్నారని మీకు తెలుసు.... ప్రమాదములో. ఏ సమయంలోనైనా మీరు సముద్రంలో పడవచ్చు, మీరు ఎక్కడైనా పడవచ్చు. అందువల్ల ఇది సురక్షితం కాదు. అదే విధముగా, మనము తయారుచేసిన ఏ పద్ధతైనా, మనం కనుగొనిన, భౌతిక ప్రకృతి చట్టాలపై జయించడానికి, ఇది మరి కొన్ని ప్రమాదకరమైన విషయాలచే మద్దతు ఇవ్వబడింది. అది ప్రకృతి ధర్మము. జీవితపు భౌతిక బాధలనుండి బయటపడటానికి ఇది మార్గం కాదు.

వాస్తవిక మార్గం బద్ధ జీవితము యొక్క నాలుగు విధులు ఆపటం. బద్ద జీవితము యొక్క నాలుగు విధులు అంటే జన్మ, మరణము, వృద్ధాప్యము, మరియు వ్యాధి. వాస్తవమునకు, నేను ఆత్మను. ఇది భగవద్గీత ప్రారంభంలో వివరించబడినది, ఆత్మ జన్మించనే లేదు లేదా చనిపోలేదు. అతడు ఈ ప్రత్యేక శరీరం విధ్వంసం తరువాత కూడా తన జీవితాన్ని కొనసాగిస్తాడు. ఈ శరీరం కేవలం ఒక మెరుపు, కొన్ని సంవత్సరాలు మాత్రమే. అది పూర్తి అవుతుంది. ఇది డిగ్రీలచే పూర్తి చేయబడుతుంది. నేను 73 సంవత్సరాల వృద్ధుడి వలె. నేను ఎనభై సంవత్సరాలు లేదా వంద సంవత్సరాలు జీవించాను అని అనుకుందాం, ఈ 73 సంవత్సరాలు నేను ఇప్పటికే మరణించాను అది ముగిసింది. ఇప్పుడు కొన్ని సంవత్సరాలు నేను ఉండవచ్చు. కాబట్టి మనము మన జన్మించే సమయము నుండి చనిపోతున్నాము. అది సత్యము. అందువల్ల భగవద్గీత ఈ నాలుగు సమస్యలకు పరిష్కారం ఇస్తుంది. ఇక్కడ కృష్ణుడు సూచిస్తున్నారు, మయ్యాసక్తా - మనాః పార్థ యోగం యుంజన్ మద్- ఆశ్రయః మీరు కృష్ణుడి ఆశ్రయిస్తే మీరు కృష్ణుడి గురించి ఎల్లప్పుడూ ఆలోచిస్తే, మీ చైతన్యము ఎల్లప్పుడూ కృష్ణుని ఆలోచనలతో నిండిపోతుంది, అప్పుడు కృష్ణుడు చెప్తారు ఫలితము ఇలా ఉంటుంది, అసంశయం సమగ్రం మాం యథా జ్ఞాస్యసి తచ్ చృణు ( BG 7.1) అప్పుడు నీవు నన్ను సంపూర్ణంగా అర్థం చేసుకుంటావు, ఎటువంటి సందేహం లేకుండా.