TE/Prabhupada 0548 - మీరు హరి కోసం ప్రతి దానిని త్యాగం చేసే స్థాయికి వచ్చినట్లయితే

Revision as of 13:48, 12 April 2018 by Kamalakar (talk | contribs) (Created page with "<!-- BEGIN CATEGORY LIST --> Category:1080 Telugu Pages with Videos Category:Prabhupada 0548 - in all Languages Category:TE-Quotes - 1969 Category:TE-Quotes - Le...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


Lecture -- New York, April 17, 1969


కాబట్టి ārādhito yadi haris tapasā tataḥ kim (నారద పంచరాత్ర). మనము గోవిందం ఆది పురుషమ్ ను పూజిస్తున్నాం, హరి అని పిలవబడే దేవాది దేవుడిని వేదముల సాహిత్యము చెప్తుంది ārādhito yadi hariḥ. మీరు దేవాది దేవుడు హరిని పూజించే స్థాయికి వస్తే, tapasā tataḥ kim అయితే, అప్పుడు తపస్సు యోగా సాధన, అవసరం లేదు లేదా ఇది లేదా అది, చాలా యజ్ఞాలు, సంప్రదాయక... వాటితో ఇక పని లేదు మీరు హరి కోసం ప్రతి దానిని త్యాగం చేసే స్థాయికి వచ్చినట్లయితే, ఈ విషయాల కోసం మీరు ఇబ్బంది పడవలసిన అవసరం లేదు. Ārādhito yadi haris tapasā tataḥ kim. And nārādhito yadi haris tapasā tataḥ kim. మీరు చేసే తపస్సులు, త్యాగాలు, సంప్రదాయ వేడుక, ప్రతిదీ, కానీ హరి అంటే నాకు తెలియదు అంటే: ఇది అంత ఉపయోగము లేదు, నిష్ప్రయజ్ఞముమైనది. Nārādhito yadi hariḥ, nārādhitaḥ. మీరు హరిని పూజించే స్థాయికి రాకపోతే, అప్పుడు ఈ విషయాలు అన్ని ఎందుకు పనికిరావు. Tataḥ kim. Antarbahir yadi haris tapasā tataḥ kim. మీరు ఎల్లప్పుడూ మీ లోపల హరిని చూడగలిగితే హరిని ఎల్లప్పుడూ వెలుపల చూస్తే, లోపల మరియు వెలుపల చూస్తే... Tad vantike tad dūre tad... ఆ శ్లోకము అంటే ఏమిటి? Īśopaniṣad? Tad antare... Dūre tad antike sarvasya. హరి ప్రతిచోటా ఉన్నాడు, కాబట్టి హరిని చూసే వారు ఎవరైనా, సమీపంలో, ... లేదా సుదూర ప్రదేశములో నుండి, లోపల, బయట, ఆయన హరిని తప్ప ఏమీ చూడడు. ఎలా సాధ్యమవుతుంది? Premāñjana-cchurita-bhakti-vilocanena (Bs. 5.38). ఒక వ్యక్తి భగవంతుని ప్రేమలో విలీనమైనప్పుడు, ఆయన హరిని మినహా ప్రపంచంలోని దేన్నీ చూడడు. ఇది ఆయన దృష్టి. antarbahir yadi hari, లోపల వెలుపల, మీరు ఎల్లప్పుడూ హరిని, కృష్ణుడిని చూస్తే, tapasā tataḥ kim, అప్పుడు మీ ఇతర తపస్సులు వలన ఉపయోగం ఏమిటి? మీరు ఉన్నతమైన స్థాయిలో ఉన్నారు. అది కావలసినది. Nanta-bahir yadi haris tapasā tataḥ kim. మీరు హరి లోపల మరియు వెలుపల చూడనట్లయితే, మీ తపస్సుల వలన విలువ ఏమిటి? కావున ఉదయం మనం ఈ మంత్రాన్ని చదువుతాము, govindam ādi-puruṣam tam ahaṁ bhajāmi. మనకు వేరే కర్తవ్యము లేదు. కేవలం గోవిందుడిని దేవాది దేవుడిని కృష్ణుడిని మనము సంతృప్తి పరచాలి. అప్పుడు ప్రతిదీ పరిపూర్ణము . ఆయన పరిపూర్ణము ఆయన ఆరాధన పరిపూర్ణము, ఆయన భక్తుడు పరిపూర్ణము ప్రతీదీ పరిపూర్ణము.

చాలా ధన్యవాదాలు.