TE/Prabhupada 0575 - వారు అజ్ఞానంలో ఉంచబడినారు

Revision as of 08:47, 23 December 2017 by Kamalakar (talk | contribs) (Created page with "<!-- BEGIN CATEGORY LIST --> Category:1080 Telugu Pages with Videos Category:Prabhupada 0575 - in all Languages Category:TE-Quotes - 1973 Category:TE-Quotes - Le...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


Lecture on BG 2.19 -- London, August 25, 1973


కావున na jāyate na mriyate vā kadācit. Kadācit ఎప్పుడైనా అంటే, గతము, ప్రస్తుతము, భవిష్యత్తు, Kadācit. గతంలో, ఇది ఇప్పటికే వివరించబడింది, గతంలో మనము ఉన్నాము, అయితే వేరే శరీరముతో ఉన్నాము. ప్రస్తుతం, మనం జీవించి ఉన్నాము, భవిష్యత్తులో కూడా మనం జీవించి ఉంటాము, బహుశా వేరే శరీరముతో. బహుశా కాకపోవచ్చు. వాస్తవమునకు Tathā dehāntara-prāptiḥ ( BG 2.13) ఎందుకంటే ఈ శరీరాన్ని విడిచిపెట్టిన తర్వాత, మనము మరో శరీరాన్ని అంగీకరించాలి. కాబట్టి ఇది జరుగుతోంది తమో గుణము, ఆత్మ జ్ఞానం లేకుండా, మనము అజ్ఞానంలో ఉంచబడుతున్నాయి. విద్యాపద్ధతి అని పిలవబడేది, ప్రపంచమంతా, అలాంటి విద్య లేదు. వారు చీకటిలో అజ్ఞానంలో ఉంచబడినారు అయినప్పటికీ, చాలా డబ్బు వెచ్చించబడుతోంది, ప్రత్యేకించి పాశ్చాత్య దేశాలలో. వారికి డబ్బు ఉంది, పెద్ద, పెద్ద ఉన్నత పాఠశాలలు, కానీ ఉత్పత్తి ఏమిటి? అందరూ దుష్టులు మరియు మూర్ఖులు. అంతే. ఎందుకంటే వారికి తెలియదు. వారికి ఆత్మ అంటే ఏమిటో తెలియదు. ఈ జ్ఞానం లేకుండా... జ్ఞానము అంటే ఆత్మ సాక్షాత్కారము, నేను ఈ శరీరం కాదు, నేను ఆత్మను. అది జ్ఞానం. ఎలా తినాలి, ఎలా నిద్ర పోవాలి, ఎలా రక్షించుకోవాలి, ఎలా మైథునజీవితం ఆనందించాలి, ఈ విషయము మీద పుస్తకాలు చాల సంపుటములు ఉన్నాయి, కాని అవి జ్ఞానం కాదు. అది పిల్లులకు మరియు కుక్కలకు కూడా తెలుసు. పిల్లులు కుక్కలు ఫ్రూడ్ యొక్క తత్వశాస్త్రాన్ని ఎప్పుడూ చదవలేదు, కానీ వాటికి లైంగిక జీవితాన్ని ఎలా ఆస్వాదించాలో తెలుసు.

కాబట్టి ఈ కుక్క యొక్క తత్వము మీకు సహాయం చేయదు, "నేను ఈ శరీరాన్ని కలిగి ఉన్నాను, శరీర లైంగిక జీవితాన్ని ఎలా ఆనందిచాలి "ఈ కుక్క తత్వము ఉంది. మీ తత్వము లైంగిక జీవితమును ఎలా నిలిపివేయాలి. అది జ్ఞానం. Tapo divyam ( SB 5.5.1) తపస్య. ఈ మానవ జీవితం తపస్యా కోసం ఉద్దేశించబడింది, ఇంద్రియ తృప్తి నుండి దూరంగా ఉండటానికి. అది జ్ఞానం. అంతే కాని మైథునజీవితం లేదా ఇంద్రియాల సంతోషాన్ని ఎలా ఆనందించాలి అని కాదు. ఏ తత్వము లేకుండా, ఏ విద్య లేకుండా పిల్లులకు మరియు కుక్కలకు ఇది తెలుసు. ఈ తత్వము, pravṛttir eṣā bhūtānāṁ nivṛttis tu mahā-phalā. ప్రవృత్తి, ప్రతి జీవి ఈ ప్రవృత్తి కలిగి ఉంది అది ఏమిటి? ఇంద్రియ ఆనందం. Loke vyavāyāmiṣa-madya-sevā nityā hi jantor ( SB 11.5.11) Jantuḥ అంటే జీవి అని. నిత్య, ఎల్లప్పుడూ, ఆయన ప్రవృత్తిని కలిగి ఉన్నాడు, vyavāyāmiṣa-madya-sevā. Vyavāya. Vyavāya అంటే లైంగిక జీవితం, āmiṣa అంటే మాంసం తినడం అని అర్థం. Vyavāya āmiṣa, madya-sevā, మరియు, మత్తు. ఇవి అన్ని జీవుల యొక్క సహజ ప్రవృత్తులు, చీమలలో కూడా ఈ ప్రవృత్తులు ఉన్నాయి. ఎవరైతే చదివినారో వారు... చీమలు మత్తుగా ఉండడానికి చాలా ఇష్టపడతాయి అందువలన, అవి తీపి, చక్కెర కనుగొంటాయి. తీపి అనేది మత్తు. బహుశా మీకు, అందరికి తెలుసు. మద్యం చక్కెర నుండి తయారు చేయబడింది. చెక్కర సల్ఫరిక్ ఆమ్లంతో పులియబెట్టబడినది, తర్వాత అది వడ పోయబడినది. అది మద్యం. అందువలన చాలా తీపి తినడం నిషేధించబడింది