TE/Prabhupada 0576 - పద్ధతి ఈ ప్రవృత్తులను ఎలా సున్నా చేయాలి

Revision as of 23:38, 1 October 2020 by Elad (talk | contribs) (Text replacement - "(<!-- (BEGIN|END) NAVIGATION (.*?) -->\s*){2,}" to "<!-- $2 NAVIGATION $3 -->")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


Lecture on BG 2.19 -- London, August 25, 1973


కావున loke vyavāya āmiṣa mada-sevā nityas tu jantuḥ. ఇది ప్రవృత్తి. భౌతిక జీవితము అంటే ప్రతి జీవి ఈ ప్రవృత్తులను కలిగి ఉంటాడు. కానీ వాటిని పరిమితం చేయాలి. ప్రవృత్తిః ఈశ భూతానామ్. ఇది సహజ స్వభావం. కానీ మీరు వాటిని ఆపగలిగితే, అది మీ గొప్పతనము. అది తపస్య అని పిలువబడుతుంది. నేను సహజంగా కొన్ని ప్రవృత్తులను కలిగి ఉన్నాను, కానీ ఇది మంచిది కాదు. ఈ కోణం మంచిది కాదు, మనము ఆ ప్రవృత్తిని కొనసాగిస్తే, అప్పుడు మనము ఈ భౌతిక శరీరాన్ని అంగీకరించాలి. ఇది ప్రకృతి చట్టం. ఒక శ్లోకము ఉంది, ప్రమత్థః. అది పిలవబడే, ఆ...? ఇప్పుడు నేను దానిని మర్చిపోతున్నాను. ప్రతిఒక్కరూ పిచ్చివాడు, ఇంద్రియ తృప్తి కొరకు పిచ్చి వారు అవుతున్నారు. Na sādhu manye yata ātmano 'yam asann api kleśada āsa dehaḥ ( SB 5.5.4) ఎంత కాలము మనము ఈ ఆనందించే ప్రవృత్తిని మనము కొనసాగిస్తామో, మీరు శరీరాన్ని అంగీకరించాలి. అది జన్మ మరియు మరణం. చాలా కాలము అందువల్ల, పద్ధతి ఈ ప్రవృత్తులను ఎలా సున్నా చేయాలి . అది పరిపూర్ణత. దానిని పెంచడము కాదు. Nūnaṁ pramattaḥ kurute vikarma yad indriya-prītaya āpṛṇoti ( SB 5.5.4) Nūnam, అయితే, నిజానికి, ప్రమత్తా, ఈ పిచ్చివాళ్ళు. వారు పిచ్చిగా, వారు ఈ ప్రవృత్తులకు , vyavāya āmiṣa mada-sevā, మైథున సుఖము, నిషా మాంసం తినడం. వారు అందరు పిచ్చివాళ్ళు. ప్రమత్తః. Nūnaṁ pramattaḥ kurute vikarma ( SB 5.5.4) Vikarma అనగా నిషేధించబడిన కర్మలు. మనం ఈ మూడు విషయాల కోసం చూస్తాము, āmiṣa-mada-sevayā, మైథునజీవితం కోసం, మాంసం తినడము, త్రాగడము, ప్రజలు పని చేస్తున్నారు. పని చేయడమే కాదు, కపటముతో పని చేయడము. డబ్బు ఎలా సంపాదించాలో, నగదు, నల్ల మార్కెట్, తెల్ల మార్కెట్, ఈ విధముగా, ఈ మూడు విషయాల కొరకు మాత్రమే: āmiṣa-mada-sevā. [...]

కాబట్టి, nūnaṁ pramattaḥ kurute vikarma yad indriya-prītaya āpṛṇoti ( SB 5.5.4) ఇది ఋషభదేవుడు తన కుమారులకు ఇచిన సూచన. నా ప్రియమైన కుమారుల్లారా, మోసగించ బడవద్దు. ఈ మూర్ఖుపు పిచ్చివారు, వారు ఈ విషయాల కొరకు పిచ్చివారు అయినారు. మాంసం తినటం, మత్తుపదార్థాలు లైంగిక జీవితం కోసము న సాధు మన్యే,, "ఇది అంత మంచిది కాదు." న సాధు మన్యే. నేను అనుమతించడము లేదు, అది చాలా మంచిదని నేను చెప్పను. ఇది అంత మంచిది కాదు. న సాధు మన్యే. "ఇది ఎందుకు మంచిది కాదు? మనము జీవితాన్ని ఆనందిస్తున్నాము." అవును, మీరు ఇప్పుడు ఆనందిస్తున్నారు, కానీ yata ātmano 'yam asann api kleśada āsa dehaḥ ( SB 5.5.4) మీరు ఎంత కాలము ఈ విషయాలను కొనసాగిస్తారో, మీరు శరీరమును అంగీకరించవలసి ఉంటుంది, మీరు శరీరాన్ని అంగీకరించినప్పుడు, జన్మ ఉండాలి, మరణం ఉండాలి, అక్కడ వ్యాధి ఉండాలి, వృద్ధాప్యము అని పిలవబడేది ఉండాలి. మీరు బాధపడతారు. మీరు బాధపడతారు. కానీ మీ యదార్ధ పరిస్థితి న జాయతే. మీరు జన్మ తీసుకోవలసిన అవసరం లేదు, మీరు జన్మ తీసుకోరు, కానీ మీకు మీరుగా జన్మ తీసుకోవడానికి అలవాటు బడినారు. వాస్తవమునకు, మీ పరిస్థితి జన్మించడము కాదు, శాశ్వత జీవితము. కృష్ణుడు శాశ్వతమైనవాడు, అదేవిధముగా మనలో ప్రతి ఒక్కరు శాశ్వతమైవారు కృష్ణునిలో భాగము కనుక- అదే లక్షణములు కలిగి ఉన్నాము.