TE/Prabhupada 0585 - ఇతరులు బాధపడుటను చూడడం ద్వారా వైష్ణవులు బాధపడుతారు

Revision as of 14:32, 16 October 2017 by Kamalakar (talk | contribs) (Created page with "<!-- BEGIN CATEGORY LIST --> Category:1080 Telugu Pages with Videos Category:Prabhupada 0585 - in all Languages Category:TE-Quotes - 1972 Category:TE-Quotes - Le...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


Lecture on BG 2.20 -- Hyderabad, November 25, 1972


కాబట్టి అక్కడ సూర్యుని లోకములో జీవులు లేరని అనుకునే ప్రశ్నే లేదు. అక్కడ జీవులు ఉన్నారు ఆ లోకమునకు తగ్గట్లుగా మనము బ్రహ్మ సంహిత నుండి తెలుసుకున్నాము, అది koṭiṣu vasudhādi-vibhūti-bhinnam. వసుధ. వసుధ అంటే లోకము. ప్రతి విశ్వంలో అసంఖ్యాకమైన గ్రహాలు ఉన్నాయి. Yasya prabhā prabhavato jagad-aṇḍa-koṭi-koṭiṣv aśeṣa-vasudhādi-vibhūti-bhinnam (Bs. 5.40). ఇది కేవలం ఒక విశ్వం. మిలియన్ల సంఖ్యలో విశ్వాలు కూడా ఉన్నాయి. ఎప్పుడైతే చైతన్య మహాప్రభు, భగవంతుడు చైతన్య భక్తునిచే వేడుకొనబడినప్పుడు, "నా ప్రియమైన ప్రభు, మీరు వచ్చారు. దయచేసి ఈ బద్ధ జీవులందరినీ మీరు తీసుకెళ్లండి . వారు భయంకరమైన పాపులు , వారిని విముక్తుల్ని చేయలేము అని మీరు అనుకుంటే అప్పుడు మీరు నాకు అన్ని పాపాలను బదిలీ చేయండి. నేను బాధపడుతాను. మీరు వారిని తీసుకెళ్లండి." ఇది వైష్ణవ తత్వము. వైష్ణవ తత్వము అనగా పర- దుఃఖః - దుఃఖిః . వాస్తవంగా, ఇతరులు బాధపడుటను చూడడం ద్వారా వైష్ణవులు బాధపడుతారు. వ్యక్తిగతంగా, ఆయనకి ఏ బాధలేదు. ఎందుకనగా ఆయన కృష్ణుడితో సంబంధం కలిగి ఉన్నాడు, ఆయన ఎలా బాధగా ఉంటాడు? వ్యక్తిగతంగా, ఆయనకి దుఃఖము లేదు. కానీ ఆయన బద్ధ జీవులు దుఃఖముగా ఉండుట చూడటం ద్వారా దుఃఖిస్తాడు. పర దుఃఖః దుఃఖిః. అందువలన, వాసుదేవ ఘోష, ఆయన భగవంతుడు చైతన్య మహాప్రభును కోరారు మీరు ఈ దుఃఖముతో ఉన్న బద్ధాత్మలనందరిని విముక్తుల్ని చేయండి. వారు పాపాత్ములు, వారిని విముక్తుల్ని చేయలేము అని మీరు అనుకుంటే అప్పుడు ఈ ప్రజలందరి పాపాలను నాకు బదిలీ చేయండి. నేను బాధపడతాను, మీరు వారిని తీసుకువెళ్ళండి." అందువల్ల చైతన్య మహాప్రభు అతని ప్రతిపాదన చేత ఎంతో సంతోషించబడ్డాడు మరియు ఆయన నవ్వాడు. ఆయన ఇలా చెప్పాడు, "ఈ బ్రహ్మాండం, ఈ విశ్వం, ఆవ గింజల సంచిలో కేవలం ఒక ఆవ గింజ లాంటిది మాత్రమే. మా అభిప్రాయం చాలా విశ్వాలు ఉన్నాయి. పోల్చి చూసుకోండి. మీరు ఆవ గింజల సంచి తీసుకొని ఒక గింజ తీయండి. ఆవ గింజల మూటతో పోలిస్తే ఈ ఒక్క గింజ యొక్క విలువ ఏమిటి? అదేవిధముగా, ఈ విశ్వం ఆ విధముగా ఉంటుంది. చాలా విశ్వాలు ఉన్నాయి. ఆధునిక శాస్త్రవేత్తలు, వారు ఇతర లోకములు వెళ్ళడానికి ప్రయత్నిస్తున్నారు. వారు వెళ్ళినా కూడా, దానికి కీర్తి ఏమి ఉంది? అక్కడ koṭiṣu vasudhādi-vibhūti-bhinnam. ఉన్నాయి. ఏ ఒక్కరు చాలా లోకములకు వెళ్ళలేరు. వారి గణన ప్రకారం, వారు బ్రహ్మలోకం అని పిలువబడే అతి దూరాన ఉన్న (అన్నిటికిని పైనున్న) గ్రహానికి వెళ్ళాలనుకుంటే, అది కాంతి-సంవత్సర గణనలో నలభై వేల సంవత్సరాలు తీసుకుంటుంది.

కాబట్టి భగవంతుని సృష్టిలో ప్రతిదీ అపరిమితమైంది. మన కున్న జ్ఞానం యొక్క దృక్కోణంతో ఇది పరిమితం కాదు. కాబట్టి అనేక, అసంఖ్యాకమైన విశ్వాలు ఉన్నాయి, అసంఖ్యాకంగా గ్రహాలు మరియు అక్కడ అసంఖ్యాకంగా జీవులు ఉన్నాయి. వారి కర్మ ప్రకారం వారు భ్రమణం చెందుతారు. జన్మ మరణం అంటే ఒక శరీరం నుండి మరొక దానిలోకి మారడము. నేను ఈ జీవితంలో ఒక ప్రణాళికను తయారు చేసాను మరియు.... .... ఎందుకంటే ప్రతిఒక్కరూ ప్రత్యక్షంగా శరీర భావనలో ఉంటారు. కాబట్టి ఎంత కాలము నేను శరీర భావనలో ఉంటానో... నేను బ్రాహ్మణుడ్ని, "నేను క్షత్రియుడ్ని ," "నేను వైశ్యుడ్ని ," "నేను శూద్రుడ్ని ," నేను భారతీయుడిని, "నేను అమెరికన్," "నేను అలా ఉన్నాను." ఇవన్నీ శారీరక భావనలో జీవితపు గుర్తింపులు. కాబట్టి ఎంత కాలముగా నేను శరీర భావనలో ఉంటానో, నేను అనుకుంటున్నాను నేను ఈ బాధ్యతను నిర్వర్తించాలి. బ్రాహ్మణుని వలె , నేను ఎన్నో పనులు చేయాల్సి ఉంది. ఒక అమెరికన్ గా, నేను చాలా పనులను చేయవలసి ఉంది. కావున ఎంత కాలము ఈ చైతన్యము కొనసాగుతుందో, అప్పటివరకు మనము మరొక శరీరం అంగీకరించాల్సి ఉంటుంది. ఇది ప్రకృతి యొక్క పద్ధతి. ఎంతో కాలము.