TE/Prabhupada 0588 - మీకేదైనా కావాలంటే -కృష్ణుడు మీకు ఇస్తాడు

Revision as of 10:59, 15 December 2017 by Kamalakar (talk | contribs) (Created page with "<!-- BEGIN CATEGORY LIST --> Category:1080 Telugu Pages with Videos Category:Prabhupada 0588 - in all Languages Category:TE-Quotes - 1972 Category:TE-Quotes - Le...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


Lecture on BG 2.20 -- Hyderabad, November 25, 1972


ఎంత కాలము అయితే చిటికెడు కోరిక ఉంటుందో నేను బ్రహ్మ వలె, లేదా రాజు వలె లేదా జవహర్లాల్ నెహ్రూ లా ఉంటే అప్పుడు నేను ఒక శరీరం అంగీకరించాల్సి ఉంటుంది. ఈ కోరిక. కృష్ణుడు ఉదారంగా, దయగా ఉంటాడు. మనకేదైనా కావాలంటే - ye yatha mam prapadyante ( BG 4.11) - కృష్ణుడు మీకు ఇస్తాడు. కృష్ణుని నుండి ఏదైనా తీసుకోవాలంటే...... క్రైస్తవులు ప్రార్థించినట్లుగా “ ఓ దేవా, మాకు మా రోజు వారీ రొట్టె ఇవ్వండి”. మనకు ఇవ్వటం కృష్ణునికి కష్టమైన కార్యమా..... ఆయన ఇప్పటికే ఇస్తున్నాడు. ఆయన ప్రతి ఒక్కరికీ రోజువారీ రొట్టె ఇస్తున్నాడు. కాబట్టి ఇది ప్రార్థన యొక్క విధానం కాదు. వారి ప్రార్థన యొక్క విధానం..... చైతన్య మహాప్రభువు చెప్పినట్లుగా, mama janmani janmanisvare bhavatad bhaktir ahaituki tvayi ( cc. Antya 20.29 siksastaka 4) ఇది ప్రార్థన. మనం అడగటానికి ఏమీ లేదు. కృష్ణుడు, భగవంతుడు, మన నిర్వహణ కొరకు తగినంత ఏర్పాటు చేసాడు. Pūrṇasya pūrṇam ādāya pūrṇam evāvaśiṣyate (Īśo Invocation). కానీ మనం పాపులము అయినప్పుడు అది ప్రకృతి చేత నిషేదించబడుతుంది. మనం నాస్తికులం అవుతాము. మనము రాక్షసులం అవుతాము. అప్పుడు సరఫరా పరిమితం చేయబడుతుంది. అప్పుడు మనం ఏడుస్తాము. “ఓ, వర్షము లేదు. ఇది లేదు, లేదు...." అది ప్రకృతి యొక్క పరిమితి. కానీ దేవుని అమరిక ప్రకారం ప్రతి ఒక్కరికీ తగినంత ఆహారం ఉంది. Eko bahunam vidadhakti kaman. ఆయన అందరికీ సరఫరా చేస్తున్నాడు.

కాబట్టి ఎంతకాలం మన పథకం అమలు చేసుకోవడానికి మనకు చిటికెడు భౌతిక కోరిక ఉంటుందో, అప్పుడు మనము భౌతిక శరీరాన్ని అంగీకరించాలి, అది జన్మ అంటారు. లేకపోతే, జీవికి జననము మరియు మరణము లేదు. ఇప్పుడు, ఈ జన్మ మరియు మృత్యువు..... జీవులు, వారిని కణముతో పోలుస్తారు, దేవాది దేవుడిని గొప్ప అగ్ని వలె. కాబట్టి, పెద్ద అగ్ని, అది పోలిక. ఇంక  చిన్న కణములు, రెండూ కూడా అగ్నియే.  కానీ కొన్నిసార్లు అగ్ని కణములు గొప్ప అగ్ని నుండి పడిపోతాయి. అది మన పతనం. పతనము అంటే అర్థం మనము ఈ భౌతిక ప్రపంచం లోకి రావటం. ఎందుకు? కేవలము ఆనందించటానికి, కృష్ణున్ని అనుకరించటానికి. కృష్ణుడు దేవాదిదేవుడు. మనం సేవకులము. కొన్నిసార్లు..... ఇది సహజము. సేవకుడు కోరుకుంటాడు “నేను యజమాని వలే ఆనందించ గలిగితే.....” కాబట్టి ఈ ప్రతిపాదన వచ్చినప్పుడు, దీనిని మాయ అని పిలుస్తారు. ఎందుకంటే మనం ఆనందంగా ఉండలేము. ఇది మిధ్య. నేను ఆనందించగలను అని నేను ఆలోచిస్తే, ఈ భౌతిక ప్రపంచంలో కూడా, అని పిలువబడే..... వారు, ప్రతి ఒక్కరూ ఆనందించటానికి ప్రయత్నిస్తున్నారు. ఆనందం యొక్క చివరి వల అంటే, "ఇప్పుడు నేను భగవంతుని అవుతాను" అని ఆలోచిస్తారు. ఇది చివరి వల. అన్నింటిలో మొదటగా నేను నిర్వాహకుడిగా లేదా యజమానిగా ఉండాలనుకుంటున్నాను. తరువాత ప్రధానమంత్రి. అప్పుడు ఇది మరియు అది. ఇది ప్రతిదీ అడ్డుపడినప్పుడు, అప్పుడు " నేను ఇప్పుడు భగవంతుడిని అవుతారు అని ఆలోచిస్తారు". గురువుగా మారడం, కృష్ణున్ని అనుకరించటం అదే ప్రవృత్తి జరుగుతుంది