TE/Prabhupada 0592 - మీరు కేవలం కృష్ణుని గురించి ఆలోచించే స్థాయికి రావాలి.అది పరిపూర్ణము

Revision as of 05:23, 14 April 2018 by Kamalakar (talk | contribs) (Created page with "<!-- BEGIN CATEGORY LIST --> Category:1080 Telugu Pages with Videos Category:Prabhupada 0592 - in all Languages Category:TE-Quotes - 1972 Category:TE-Quotes - Le...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


Lecture on BG 2.20 -- Hyderabad, November 25, 1972


ప్రభుపాద: కాబట్టి ఆది పద్ధతి. మీరు కేవలం కృష్ణుని గురించి ఆలోచించే స్థాయికి రావాలి. అది పరిపూర్ణము. మీరు చాలా విషయాలతో కలత చెందుతు ఉంటే, అప్పుడు ఒక పిల్లి, కుక్క, జింక, లేదా దేవత, ఏదైనా అయ్యే ప్రమాదం ఉంది.

భారతీయ: మహారాజా, ఎందుకు నీవు?

ప్రభుపాద: Yaṁ yaṁ vāpi smaran loke tyajaty ante kalevaram ( BG 8.6) నీవు, మరణం సమయంలో, మీరు కోరుకుంటున్నది ఏదైనా, మీరు తదుపరి శరీరం పొందుతారు. అది ప్రకృతి యొక్క చట్టము. (విరామం) ... మాస్కోలో, రష్యాలో ఉంది, అనేకమంది యువకులు ఉన్నారు, ఈ కృష్ణ చైతన్యము ఉద్యమములో చేరడానికి చాలా ఆత్రుతగా ఉన్నారు వారిలో కొందరికి నేను దీక్షను ఇచ్చాను. వారు ఆచరిస్తున్నారు ఉదాహరణకు ఈ అబ్బాయులు ఆచరిస్తున్నట్లుగా .కావున ఇది... ఇప్పటివరకు నా అనుభవములో, నేను వెళ్ళిన ప్రతిచోటా, ప్రజలు ఒకే విధముగా ఉన్నారు. ఇది కృత్రిమమైనది, నేను చెప్పేది ఏమిటి అంటే, వారు కమ్యూనిస్ట్ మరియు ఇది మరియు అది అని పిలువ బడుచున్నారు. (విరామం) ... ప్రజలు, వారు అందరు ఒకే రకమైన వారు. కృష్ణ చైతన్యము గురించి మాట్లాడిన వెంటనే, వారు వెంటనే స్పందిస్తారు. ఇది నా అనుభవం. నిజానికి ఇది వాస్తవం. చైతన్య చరితామృత లో, ఇది చెప్పబడింది, nitya-siddha kṛṣṇa-prema sādhya kabhu naya, śravaṇādi-śuddha-citte karaye udaya ( CC Madhya 22.107) కృష్ణ చైతన్యము అందరి హృదయాలలో ఉంది. ఇది నిద్రాణమైనది. కానీ అది కలుషితమైనది భౌతిక మురికి విషయాలచే కప్పబడి ఉంది. కాబట్టి śravaṇādi, śuddha-citte. దీని అర్థం, మీరు వింటున్నట్లుగా... ఉదాహరణకు ఈ బాలుర వలె, ఈ అమెరికన్ యూరోపియన్ బాలలు, వారు మొదట, నా దగ్గర శ్రవణము చేయడానికి వచ్చారు. శ్రవణము చేయడము ద్వారా, శ్రవణము ద్వారా ఇప్పుడు వారి కృష్ణ చైతన్యము జాగృతం అయ్యింది, వారు కృష్ణ భక్తిని తీవ్రముగా తీసుకున్నారు, ప్రతి ఒక్కరి లోపల కృష్ణ చైతన్యము ఉంది. మన పద్ధతి, సంకీర్తన్ ఉద్యమం, ఆ చైతన్యమును మేల్కొపడమే. అంతే. ఉదాహరణకు ఒక వ్యక్తి నిద్రిస్తున్నట్లుగానే. అతనిని మేల్కొలపడానికి: "లేవండి లేవండి! Uttiṣṭhata jāgrata prāpya varān nibodhata. కాబట్టి ఇది మన పద్ధతి. కృత్రిమంగా మనం కొందరిని కృష్ణ చైతన్య వంతులుగా చేస్తున్నాము అని కాదు. కృష్ణ చైతన్యము ఇప్పటికే ఉంది. ఇది ప్రతి జీవి యొక్క జన్మహాక్కు. కృష్ణుడు చెప్తాడు, mamaivāṁśo jīva-bhūtaḥ ( BG 15.7) ఉదాహరణకు తండ్రి మరియు కొడుకు వలె. వారు విడిపోవడము అనేది ఉండదు కానీ కొన్నిసార్లు కొడుకు ఇంటి నుండి బయటకు వెళ్ళిపోతాడు అనుకోకుండా, లేదా చిన్నతనము వలన ఆయన తన తండ్రి ఎవరో మర్చిపోతాడు. అది వేరే విషయము కానీ తండ్రి మరియు కుమారుని మధ్య సంబంధం ఎప్పటికి విచ్ఛిన్నం కాదు.