TE/Prabhupada 0682 - దేవుడు నా ఆజ్ఞ పాటించే వాడు కాదు

Revision as of 10:14, 8 October 2017 by Kamalakar (talk | contribs) (Created page with "<!-- BEGIN CATEGORY LIST --> Category:1080 Telugu Pages with Videos Category:Prabhupada 0682 - in all Languages Category:TE-Quotes - 1969 Category:TE-Quotes - Le...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


Lecture on BG 6.30-34 -- Los Angeles, February 19, 1969


విష్ణుజన: "ఆత్మ-సాక్షాత్కారము తరువాత దశలో, వ్యక్తి కృష్ణుడితో ఒక్కటి అవ్వుతాడు అంటే కృష్ణుడు భక్తుడికి ప్రతిదీ అవుతాడని, భక్తుడు కృష్ణుడిని ప్రేమించడములో సంపూర్ణమవుతాడు. భగవంతుడికి భక్తుడికి మధ్య ఒక సన్నిహిత సంబంధం అప్పుడు ఉంటుoది. ఆ దశలో జీవి నాశనం చేయబడటానికి అవకాశం లేదు, లేదా భక్తుని దృష్టి నుండి భగవంతుడు ఎప్పుడు దూరము అవ్వడు

ప్రభుపాద: ఆయన ఎలా భక్తుని దృష్టి నుండి దూరముగా వెళ్లుతాడు? ఆయన ప్రతిదానిలో కృష్ణుడిని చూస్తాడు మరియు కృష్ణుడిలో ప్రతిదీ చూస్తాడు. ప్రతిదానిలో కృష్ణుడిని మరియు కృష్ణుడిలో ప్రతిదీ. అప్పుడు ఆయన ఎలా కృష్ణుడి దృష్టిని కోల్పోతాడు? అవును.

విష్ణుజన: "కృష్ణుడిలో విలీనం అవ్వడము ఆధ్యాత్మిక వినాశనము, భక్తుడు అలాంటి ప్రమాదం తీసుకోడు. ఇది బ్రహ్మ-సంహితలో చెప్పబడింది: 'నేను ఆది దేవుడైన, గోవిందుడిని పూజిస్తాను, ఆయనను భక్తుడు ఎల్లప్పుడూ చూస్తున్నాడు. భక్తుని కళ్ళు ప్రేమ అనే అంజనంతో అద్దబడినవి. ఆయనను శాశ్వత రూపంలో, శ్యామ సుందరినిగా, భక్తుడు హృదయం లోపల చూస్తాడు."

ప్రభుపాద: శ్యామ సు౦దర, ఇది శ్యామ సు౦దర, కర్తమాసీ అని. Śyāmasundara.

premāñjana-cchurita-bhakti-vilocanena
santaḥ sadaiva hṛdayeṣu vilokayanti
yaṁ śyāmasundaram acintya-guṇa-svarūpaṁ
govindam ādi-puruṣaṁ tam ahaṁ bhajāmi.
(Bs 5.38)

కాబట్టి కృష్ణుడి మీద ప్రేమను పెంచుకున్న వాడు, ఆయన శ్యామసుందర, కర్తమాసీ, ఎల్లప్పుడూ తన హృదయము లోపల. అది యోగ యొక్క పరిపూర్ణము. కర్తమాసీ, నేను ఆ పేరును ఇచ్చాను. అయితే ఆయన శ్యామసుoదర, అవును. సరే తరువాత? తదుపరి పేరా.

విష్ణుజన: "ఈ దశలో, భక్తుడి దృష్టి నుండి భగవంతుడు కృష్ణుడు ఎప్పుడు అదృశ్యమవ్వడు, లేదా భక్తుడు భగవంతుని దృష్టిని కోల్పోడు హృదయంలో పరమాత్మగా భగవంతుడిని చూసే ఒక యోగి విషయములో, అది వర్తిస్తుంది. అలాంటి యోగి పవిత్రమైన భక్తుడిగా మారతాడు ఒక్క క్షణం కూడా తనలో భగవంతుడిని చూడకుండా అతడు జీవించలేడు. "

ప్రభుపాద: అంతే. దేవుడును చూసే పద్ధతి ఇది. (నవ్వుతూ) లేకపోతే, దేవుడు నా ఆజ్ఞ పాటించే వాడు కాదు, "దయచేసి వచ్చి చూడండి." మీరు దేవున్ని ఎలా చూడాలి అనే దానికి అర్హత పొందాలి , ప్రతి క్షణం, ప్రతిచోటా . ఈ అర్హత సులభం. ఇది చాలా కష్టము కాదు.

విష్ణుజన: "ఏ యోగికి తెలుసో నేను మరియు... యోగికి తెలుసు నేను మరియు జీవులు అందరిలో ఉన్న పరమాత్మ ఒక్కడినే అని నన్ను ఆరాధిస్తాడు మరియు అన్ని పరిస్థితులలోనూ నాలో ఎల్లప్పుడూ ఉంటాడు. "

ప్రభుపాద: భాష్యము ఉన్నది, చదవటము కొనసాగండి.

విష్ణుజన: భాష్యము: "తన లోపల ఉన్న పరమాత్మ మీద ధ్యానం సాధన చేస్తున్న ఒక యోగి, కృష్ణుడి యొక్క సంపూర్ణ భాగాన్ని విష్ణువుగా చూస్తాడు - నాలుగు చేతులతో, శంఖము, చక్రము, గద, కమల పువ్వును కలిగి ఉంటాడు. "

ప్రభుపాద: ఈ చిత్రం, విష్ణువు చిత్రం. ఇది ఏకాగ్రత కోసం యోగి యొక్క లక్ష్యం. అది వాస్తవమైన యోగ. ఈ విష్ణువు అవతారం కృష్ణుడి యొక్క సంపూర్ణ భాగము. బ్రహ్మ-సంహితలో ఇది

yaḥ kāraṇārṇava-jale bhajati sma yoga-
nidrām ananta-jagad-aṇḍa-saroma-kūpaḥ
viṣṇur mahān sa iha yasya kalā-viśeṣo
govindam ādi-puruṣaṁ tam ahaṁ bhajāmi
(Bs 5.47)

అని చెప్పబడినది

ఆది భగవంతుడు అయిన గోవిందుని నేను పూజిస్తాను. Govindam ādi-puruṣam. పురుషమ్ అంటే భగవంతుడు పురుషుడు, అనoదించే వాడు, ఆది, వాస్తవమైన, Govindam ādi-puruṣaṁ tam ahaṁ bhajāmi.. ఎవరా గోవిందా? ఎవరిలో అయితే ఒక్క సంపూర్ణ భాగము మహా-విష్ణువో. మహా-విష్ణువు యొక్క కర్తవ్యము ఏమిటి? Yasyaika-niśvasita-kālam athāvalambya jīvanti loma-vilajā jagad-aṇḍa-nāthāḥ (BS 5.48). ప్రతీ విశ్వంలో బ్రహ్మ అని పిలవబడే ముఖ్య జీవి ఉన్నాడు. బ్రహ్మ ప్రతి విశ్వంలో మొదటి వ్యక్తి. కాబట్టి బ్రహ్మ యొక్క జీవితం, లేదా విశ్వం యొక్క జీవితం, మహా-విష్ణువు యొక్క శ్వాస తీసుకునే సమయము మీద ఆధారపడి ఉన్నది. మహా-విష్ణువు కారణోదక సముద్రము మీద పడుకొని ఉన్నారు. ఆయన శ్వాస వదులుతూ ఉంటే, కోట్ల విశ్వములు బుడగల వలె వస్తున్నాయి. అవి మళ్లీ అభివృద్ధి చెందుతున్నాయి. ఆయన శ్వాస తీసుకుంటున్నప్పుడు, కోట్ల విశ్వములు ఆయనలోకి వెళ్ళుతున్నాయి. కాబట్టి అది భౌతిక ప్రపంచం యొక్క పరిస్థితి. ఇది బయటికి వస్తోంది మరల లోపలకు వెళ్ళుతుంది. bhūtvā pralīyate ( BG 8.19) భగవద్గీతలో కూడా చెప్పబడింది ఈ భౌతిక విశ్వములు సృష్టించబడినవి ఒక నిర్దిష్ట కాలానికి మళ్లీ నాశనం అవుతాయి. ఇప్పుడు ఈ సృష్టి మరియు వినాశనం మహా-విష్ణువు యొక్క శ్వాసను పీల్చడము మరియు వదలడము మీద ఆధారపడి ఉంటుంది. మహా-విష్ణువు యొక్క పరిమాణము ఏమిటో ఊహించoడి.

కాని ఆ మహా-విష్ణువు గురించి ఇక్కడ చెప్పబడింది: yasyaika-niśvasita-kālam athāvalambya jīvanti loma-vilajā jagad-aṇḍa-nāthāḥ viṣṇur mahān sa iha yasya kalā-viśeṣaḥ (BS 5.48). ఈ మహా-విష్ణువు కృష్ణుడి యొక్క సంపూర్ణమైన భాగం. కృష్ణుని యొక్క కళావిశేషము. కృష్ణుడు ప్రథమము. Govindam ādi-puruṣaṁ tam ahaṁ bhajāmi. కాబట్టి ఈ మహా-విష్ణువు ప్రతి విశ్వంలో మరల గర్భోదకశాయి విష్ణువు గా ప్రవేశిస్తాడు. గర్భోదకశాయి విష్ణువు నుండి క్షీరోదకశాయి విష్ణువు వస్తాడు. ప్రతి ఒక్క జీవి హృదయములో ఆ క్షీరోదకశాయి విష్ణువు ప్రవేశిస్తున్నాడు. ఈ విధముగా విష్ణువు వ్యక్తమవటము సృష్టి మొత్తములో ఉంది. ఈ విష్ణువు రూపంలో యోగి యొక్క ఏకాగ్రత గురించి, ఇక్కడ వివరించబడింది. ఆ విష్ణువు, అతడు మొత్తము వ్యాపించి ఉన్నాడు. ఎవరు īśvaraḥ sarva-bhūtānāṁ hṛd-deśe 'rjuna tiṣṭhati ( BG 18.61) భగవద్గీతలో మీరు చూస్తారు, ఆ మహా-విష్ణువు, ఆ క్షీరోదకశాయి విష్ణువు అందరి హృదయములో కూర్చోని ఉన్నాడు. ఇప్పుడు యోగి ఆయన ఎక్కడ కూర్చోని ఉన్నాడో కనుగొని, తన మనస్సు యొక్క దృష్టిని అక్కడ కేంద్రీకరించాలి. అది యోగ పద్ధతి. చదవటము కొనసాగించండి. యోగి తెలుసుకోవాలి, చదవటము కొనసాగించండి.

విష్ణుజన: "కృష్ణుడు విష్ణువు నుండి భిన్నమైన వాడు కాదని యోగి తెలుసుకోవాలి."

ప్రభుపాద: అవును