TE/Prabhupada 0686 - ఒకరు గాలిని బంధించలేరు చంచలమైన మనస్సును నియంత్రించడము అంత కంటే కష్టంగా ఉంటుంది: Difference between revisions

(Created page with "<!-- BEGIN CATEGORY LIST --> Category:1080 Telugu Pages with Videos Category:Prabhupada 0686 - in all Languages Category:TE-Quotes - 1969 Category:TE-Quotes - Le...")
 
m (Text replacement - "(<!-- (BEGIN|END) NAVIGATION (.*?) -->\s*){2,}" to "<!-- $2 NAVIGATION $3 -->")
 
Line 8: Line 8:
[[Category:Telugu Pages - Yoga System]]
[[Category:Telugu Pages - Yoga System]]
<!-- END CATEGORY LIST -->
<!-- END CATEGORY LIST -->
<!-- BEGIN NAVIGATION BAR -- TO CHANGE TO YOUR OWN LANGUAGE BELOW SEE THE PARAMETERS OR VIDEO -->
<!-- BEGIN NAVIGATION BAR -- DO NOT EDIT OR REMOVE -->
{{1080 videos navigation - All Languages|French|FR/Prabhupada 0685 - Le système bhakti-yoga - résultat rapide, réalisation de soi et libération dans cette vie même|0685|FR/Prabhupada 0687 - Concentrer le mental sur le vide, cela est très difficile|0687}}
{{1080 videos navigation - All Languages|Telugu|TE/Prabhupada 0685 - ఇది మాత్రమే యోగ పద్ధతి, భక్తి-యోగ పద్ధతి, ఇది శీఘ్ర ఫలితం కోసం సాధన చేయవచ్చు|0685|TE/Prabhupada 0687 - మనస్సును ఏదో శూన్యముపై కేంద్రీకరించుట. ఇది చాలా కష్టమైన పని|0687}}
<!-- END NAVIGATION BAR -->
<!-- END NAVIGATION BAR -->
<!-- BEGIN ORIGINAL VANIQUOTES PAGE LINK-->
<!-- BEGIN ORIGINAL VANIQUOTES PAGE LINK-->
Line 19: Line 19:


<!-- BEGIN VIDEO LINK -->
<!-- BEGIN VIDEO LINK -->
{{youtube_right|0ckuUImEe1U|ఒకరు గాలిని బంధించలేరు చంచలమైన మనస్సును నియంత్రించడము అంత కంటే కష్టంగా ఉంటుంది  <br />- Prabhupāda 0686}}
{{youtube_right|HktMTD8ihek|ఒకరు గాలిని బంధించలేరు చంచలమైన మనస్సును నియంత్రించడము అంత కంటే కష్టంగా ఉంటుంది  <br />- Prabhupāda 0686}}
<!-- END VIDEO LINK -->
<!-- END VIDEO LINK -->



Latest revision as of 23:37, 1 October 2020



Lecture on BG 6.30-34 -- Los Angeles, February 19, 1969


విష్ణు జన: శ్లోకము ముప్పై నాలుగు: "మనస్సు చంచలమును, కలత నొందించునదియును, ధృడమైనదిగాను మిక్కిలి బలవత్తరమగుటచే, ఓ కృష్ణా దీనిని నిగ్రహించుట, వాయువును నియంత్రించుట కంటే కష్టమని ( BG 6.34) నేను భావించు చున్నాను. "

ప్రభుపాద: అవును. మీరు గాలిని నియంత్రించగలిగితే... అది సాధ్యం కాదు, గాలిని ఎవరూ నియంత్రించలేరు. అయితే, మీరు గాలిని నియంత్రించవచ్చని సిద్ధాంతపరంగా అంగీకరించినా, కానీ మనస్సును నియంత్రించటం సాధ్యం కాదు. ఇది చాలా కష్టము. మనస్సు చంచలముగా మరియు కలత నొందించునదిగా ఉంది కొనసాగించు.

విష్ణుజన: భాష్యము: "మనస్సు చాలా మిక్కిలి బలవత్తరము, ధృడమైనది, కొన్నిసార్లు ఇది బుద్ధిని అతిక్రమించును ఆచరణాత్మక ప్రపంచంలో ఉన్న వ్యక్తికి చాలా ప్రత్యర్థి అంశాలతో పోరాడవలసి ఉంది, ఖచ్చితముగా మనస్సును నియంత్రించడము చాలా కష్టము. కృత్రిమముగా, ఎవరైనా శత్రుమిత్రుల పట్ల సమాన వైఖరిని ప్రదర్శింపవచ్చు కానీ చివరికి ఏ లౌకిక వ్యక్తి అలా ఎన్నటికీ చేయజాలడు, ఇది తీవ్రమైన గాలిని నియంత్రించుట కంటే కష్టము. వేదముల సాహిత్యాలలో ఇలా చెప్పబడింది: భౌతిక శరీరము అనే రథములో కారులో జీవుడు ప్రయాణీకుడు, బుద్ధి రథ చోదకుడు . మనస్సు రథమును నడుపునట్టి సాధనము , ఇంద్రియములు గుర్రాలు. ఈ విధముగా జీవుడు శరీరము మరియు ఇంద్రియాల సహచర్యమున ఆనందించే వానిగా లేదా దుఃఖపడే వానిగా భోక్త అవుచున్నాడు. కాబట్టి గొప్ప మునులు దీనిని అర్థం చేసుకున్నారు. ' బుద్ధి మనసును నిర్దేశింపవలసి ఉంది కానీ మనస్సు చాలా బలమైనది మరియు ధృడమైనది, అది ఒకరి సొంత బుద్ధిని కూడా అధిగమిస్తుంది, ఒక తీవ్రమైన అంటువ్యాధి ఔషధం యొక్క శక్తిని అధిగమించినట్లు. ఇటువంటి ధృడమైన మనస్సును యోగాభ్యాసం ద్వారా నియంత్రించవలసి ఉన్నది. అయితే అర్జునుడు వంటి లౌకిక వ్యక్తికి అటువంటి అభ్యాసం ఎప్పుడూ ఆచరణాత్మకమైనది కాదు. ఆధునిక మనిషి గురించి మనమేమి చెప్పగలము? కష్టము అనేది స్పష్టంగా వ్యక్తం చేయబడింది: 'ఒకరు తీవ్రముగా వీచుచున్న గాలిని బంధించలేరు .' చంచలమైన కలత నొందిన మనస్సును నియంత్రించడము అంత కంటే కష్టంగా ఉంటుంది."

ప్రభుపాద: అందుచే ఈ పద్ధతి, హరే కృష్ణ మంత్రమును కీర్తన చేయుట, వెంటనే మనస్సును నియంత్రిస్తుంది. కేవలము కీర్తన చేస్తే, "కృష్ణ", మీరు వింటే, సహజముగా మీ మనస్సు కృష్ణుడిలో స్థిరముగా ఉంటుంది. అంటే యోగ పద్ధతి వెంటనే సాధించ బడినది మొత్తం యోగ పద్ధతి మీ మనస్సును విష్ణు రూపంలో కేంద్రీకరించడము కనుక కృష్ణుడు విష్ణు రూపాల యొక్క విస్తరణ యొక్క మొదటి వ్యక్తి. కృష్ణుడు - ఉదాహరణకు ఇక్కడ ఒక దీపం ఉంది. ఇప్పుడు, ఈ దీపం నుండి, ఈ కొవ్వొత్తి నుండి, మరొక కొవ్వొత్తిని తీసుకొని రావచ్చు. మీరు వెలిగించ వచ్చు. తరువాత మరొకటి , మరొకటి, మరొకటి - వేల కొవ్వొత్తులను మీరు వెలిగించ వచ్చు. ప్రతి ఒక్క కొవ్వొత్తి ఈ కొవ్వొత్తి వలె శక్తివంతమై ఉంది. దానిలో ఎటువంటి సందేహం లేదు. కానీ ఈ కొవ్వొత్తిని వాస్తవ కొవ్వొత్తిగా తీసుకోవాలి. అదేవిధముగా , కృష్ణుడు మిలియన్ల విష్ణువు రూపాల్లో విస్తరిస్తున్నాడు. ప్రతి విష్ణువు రూపం కృష్ణుడి వలె ఉన్నది, అయితే కృష్ణుడు వాస్తవ కొవ్వొత్తి, ఎందుకంటే కృష్ణుడి నుండి ప్రతిదీ విస్తరిస్తుంది. కాబట్టి తన మనస్సును, ఏదో ఒక విధముగా కృష్ణుడి పై కేంద్రీకృతము చేసిన వ్యక్తి, ఆయన ఇప్పటికే యోగా యొక్క పరిపూర్ణమును సాధించాడు. ఇది కృష్ణ చైతన్యము ఉద్యమము యొక్క సారాంశము. కొనసాగించు. (ముగింపు)