TE/Prabhupada 0721 - మీరు భగవంతుణ్ణి ఊహించుకోలేరు. అది మూర్ఖత్వం

Revision as of 06:29, 31 October 2017 by Kamalakar (talk | contribs) (Created page with "<!-- BEGIN CATEGORY LIST --> Category:1080 Telugu Pages with Videos Category:Prabhupada 0721 - in all Languages Category:TE-Quotes - 1975 Category:TE-Quotes - Ar...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


Arrival Address -- Los Angeles, February 9, 1975


జ్ఞానం ద్వారా, యోగ ద్వారా, ఇతర పద్దతి ద్వారా మీరు కృష్ణుడిని అర్థం చేసుకోలేరు, తపస్య ద్వారా, కర్మ ద్వారా, యజ్ఞము ద్వారా, దానముల ద్వారా. మీరు అర్థం చేసుకోలేరు. సులభముగా కృష్ణుడు చెప్పినారు, భక్త్యా మామ్ అభిజానాతి. మీరు కృష్ణుడిని తెలుసుకోవాలంటే, అప్పుడు మీరు ఈ పద్ధతిని తీసుకోవాలి, చాలా సులభమైన పద్ధతి, man-manā bhava mad-bhakto mad-yājī māṁ namaskuru ( BG 18.65) ఎల్లప్పుడూ నన్ను గురించి ఆలోచించండి, నా భక్తులు కండి, నన్ను పూజించండి, మీ గౌరవప్రదమైన ప్రణామములు సమర్పించండి. నాలుగు విషయాలు. అది ఇక్కడ ఉంది. హరే కృష్ణ కీర్తన చేయండి. అది కృష్ణుడి గురించి ఆలోచించడం, మన్మనా. ఒకవేళ మీరు భక్తుడు కాకపోతే, మీరు ఆ విధముగా మీ సమయాన్ని వినియోగించు కోలేరు. అప్పుడు మీరు హరే కృష్ణ మహా మంత్రాన్ని జపము చేస్తే, సహజముగా మీరు భక్తుడు అవుతారు. అప్పుడు మీరు భగవంతుని శ్రీవిగ్రహాన్ని పూజిస్తారు. మీరు భక్తుడు కాకపోతే, మీరు కృష్ణుడిని పూజించలేరు.

నాస్తికుడు ఇలా అంటాడు, "వారు ఏదో విగ్రహాన్ని పూజిస్తున్నారు." కాదు అది వాస్తవం కాదు. వారికి తెలియదు ఇక్కడ కృష్ణుడు వ్యక్తిగతంగా ఉన్నాడని; ఆయన భక్తుల సేవను అంగీకరిస్తున్నారు ప్రస్తుతం మనం ఏ విధముగానైనా ఆయనను సేవించినా. కృష్ణుడు నీకు విరాట్-రూపం చూపినట్లయితే, అప్పుడు మీరు ఆయనను సేవించలేరు. ఎక్కడ నుండి మీరు విరాట్-రూపమునకు దుస్తులు తీసుకు వస్తారు? మొత్తం ప్రపంచములోని వస్త్ర కర్మాగారాలు మిమ్మల్ని విఫలము చేస్తాయి.(నవ్వు) అందుచేత కృష్ణుడు, నాలుగు అడుగుల చిన్న శ్రీవిగ్రహ రూపాన్ని అంగీకరించారు, కాబట్టి మీరు మీ శక్తి కొలది కృష్ణుడికి దుస్తులను తీసుకు రావచ్చు. మీ శక్తి కొలది మీరు కృష్ణుడిని ఉంచవచ్చు. అది కృష్ణుడి యొక్క దయ. అందువల్ల అది నిషేధించబడింది, arcye viṣṇu śilā-dhīḥ (Padyāvalī 115). ఎవరైనా దుష్టుడు మూర్ఖుడు విష్ణు రూపములో ఉన్నదానిని రాయిలా చెక్కగా భావిస్తే; vaiṣṇave jāti-buddhiḥ, భక్తులు కొన్ని దేశాలకు, కులాలకు చెందినవారని భావిస్తే - ఇవన్నీ నారకీ-బుద్ది. (విరామం) ఇది చేయకూడదు. ఇది నిజం ఇక్కడ కృష్ణుడు ఉన్నాడు. చాలా దయతో, కేవలం నన్ను అనుగ్రహించడానికి, ఆయన ఈ రూపంలో వచ్చాడు. కానీ ఆయన కృష్ణుడు; ఆయన రాయి కాదు. ఇది రాయి అయినా కూడా, అది కూడా కృష్ణుడు ఎందుకనగా ఏదైనా కృష్ణుడు, కృష్ణుడు లేకుండా ఏదీ లేదు. కృష్ణుడు లేకుండా, దేనికీ ఉనికి లేదు. Sarvaṁ khalv idam brahma (Chāndogya Upaniṣad 3.14.1). కృష్ణుడికి శక్తి ఉంది, రాతి ఆకారంలో ఉన్నా కూడా, ఆయన మీ సేవను అంగీకరించగలడు. ఇది కృష్ణుడు.

కావున మీరు ఈ విషయాలను అర్థం చేసుకోవాలి, కృష్ణుడు అంటే ఏమిటి అన్నది మీరు సరిగ్గా అర్థం చేసుకున్నట్లయితే, ఈ ఒక్క అర్హత ఈ జీవితంలోనే మిమ్మల్ని విముక్తి పొందేలా చేస్తుంది.

janma karma me divyaṁ
yo jānāti tattvataḥ
tyaktvā dehaṁ punar janma
naiti mām eti kaunteya
(BG 4.9)

ఇది అంతా అక్కడ పేర్కొనబడింది. కాబట్టి కృష్ణుడిని భక్తి యుక్త సేవ ద్వారా మాత్రమే అర్థం చేసుకోగలము, వేరొక విధముగా కాదు. మీరు ఊహించలేరు, "కృష్ణుడు ఈ విధముగా ఉండవచ్చు." మాయావాదుల వలె, వారు ఊహించుకుంటారు. ఊహించుకోవటము మీకు సహాయం చేయదు. మీరు భగవంతుణ్ణి ఊహించుకోలేరు. అది మూర్ఖత్వం. భగవంతుడు మీ ఊహకు తగినట్లుగా ఉండడు. అప్పుడు ఆయన భగవంతుడు కాదు. ఎందుకు ఆయన మీ ఊహాగానాలకు తగినట్లుగా ఉండాలి?

కాబట్టి ఈ విషయాలు సరిగ్గా అర్థం చేసుకోవాలి, అతను పవిత్రమైన భక్తుడు అయినప్పుడు సరిగా అర్థంచేసుకుంటాడు లేకపోతే లేదు. Nāhaṁ prakāśaḥ sarvasya yoga-māyā-samāvṛtāḥ ( BG 7.25) నేను అందరికీ అర్థము కాను. ఎందుకు ఆయన అందరికీ అర్థము కావాలి? ఆయన సంతోషించినప్పుడు, ఆయన మీకు తనకు తానుగా వెల్లడిచేయును. Sevonmukhe hi jihvādau svayam eva sphuraty adaḥ (Brs. 1.2.234). మీరు సూర్యుడిని వెంటనే కనిపించమని అడగలేరు. ఆయన సంతృప్తి చెందినప్పుడు, ఆయన ఉదయాన్నే ఉదయిస్తాడు. అదేవిధముగా, మీరు కృష్ణుడిని సంతృప్తి పరిస్తే, తద్వారా ఆయన మీ ముందు కనిపిస్తాడు, మరియు మీతో మాట్లాడుతాడు మిమ్మల్ని దీవిస్తాడు.

చాలా ధన్యవాదాలు.

భక్తులు: జయ! కీర్తి అంతా పరమ పూజ్యశ్రీ ప్రభుపాదుల వారికి.