TE/Prabhupada 0738 - కృష్ణుడు మరియు బలరాముడు మళ్ళీ శ్రీ కృష్ణ చైతన్య-నిత్యానందుల వలె అవతరించారు

Revision as of 13:29, 12 October 2017 by Kamalakar (talk | contribs) (Created page with "<!-- BEGIN CATEGORY LIST --> Category:1080 Telugu Pages with Videos Category:Prabhupada 0738 - in all Languages Category:TE-Quotes - 1975 Category:TE-Quotes - Le...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


Lecture on CC Adi-lila 1.2 -- Mayapur, March 26, 1975


కాబట్టి ఇక్కడ కృష్ణ చైతన్య మరియు నిత్యానంద, వారు భగవంతుడు కృష్ణుడు మరియు బలరాముడు. ఇప్పుడు, కృష్ణుడి అవతారంలో, ఈ ఇద్దరు సోదరులు, గోప బాలురుగా నిమగ్నమైనారు గోపీకల స్నేహితులుగా, తల్లి యశోదా మరియు నంద మహారాజు కుమారులుగా. అది వృందావనములోని వాస్తవ జీవితం. కృష్ణుడు బలరాముడు, వారు గ్రామ గోప బాలురు. ఇది కృష్ణ-బలరాముల యొక్క చిన్ననాటి చరిత్ర. వారి మరొక కర్తవ్యము, వారు మధురకు వెళ్ళినప్పుడు, వారు కంసుని మరియు మల్లయోధులను చంపారు, తరువాత, వారు ద్వారకకు వెళ్లినప్పుడు వారు మరలా చాలా మంది రాక్షసులతో పోరాడవలసి వచ్చింది. కానీ వారి బాల్య జీవితం, పదహారు సంవత్సరముల వరకు, వారు వృందావనములో ఉన్నారు, జీవితం సంతోషముగా, కేవలం ప్రేమతో ఉంది. అది పరిత్రణాయ సాధునాం ( BG 4.8) సాధువులు, భక్తులు, వారు కృష్ణుడిని, బలరాముడిని, వారి సహచరులను చూడడానికి ఎల్లప్పుడూ ఆత్రుతగా ఉన్నారు. వారు వేరు అయినందువలన వారు ఎల్లప్పుడూ చాలా బాధ పడ్డారు. వారికి పునరుజ్జీవనం ఇవ్వాలని, కృష్ణ-బలరాములు వారి చిన్ననాటి రోజులు వృందావనములో ఆడుకున్నారు. వృందావనము బయట, మధుర నుండి ద్వారకా వరకు మరియు ఇతర ప్రదేశాలలో, వారి కర్తవ్యము వినాశాయ చ దుష్క్రుతమ్: చంపడము. కాబట్టి వారికి రెండు కర్తవ్యములు ఉన్నాయి భక్తులను రక్షించడము ఒకటి, మరొకటి రాక్షసులను చంపటం. అయితే, కృష్ణుడు మరియు బలరాముడు, వారు పరమ సత్యం. చంపడము మరియు ప్రేమించడము మధ్య తేడా లేదు. వారు... పరమ సత్యము. చంపబడినవారు, మీకు తెలుసా, వారు కూడా ఈ భౌతిక బంధనము నుండి విముక్తులు చేయబడ్డారు.

ఇప్పుడు ఈ ఇద్దరు సోదరులు మళ్ళీ శ్రీ కృష్ణ చైతన్య-నిత్యానందుల వలె అవతరించారు. సహోదితౌ: ఏకకాలంలో వారు అవతరించారు. అంతే కానీ ఒకరు అవతరించినప్పుడు మరొకరు లేకపోవటము కాదు. కాదు ఇద్దరు, సహోదితౌ . వారిని సూర్యుడు మరియు చంద్రుడితో పోల్చారు. సూర్యుడు మరియు చంద్రుని కర్తవ్యము చీకటిని పారద్రోలటము. పగటి సమయంలో సూర్యుడు ఉదయిస్తాడు, చంద్రుడు రాత్రిపూట ఉదయిస్తాడు. కానీ ఈ సూర్యుడు మరియు చంద్రుడు, అద్భుతమైన సూర్యుడు మరియు చంద్రుడు, citrau, వారు కలిసి అవతరించారు కానీ కర్తవ్యము ఒకటే, amo-nudau. మనము చీకటిలో ఉన్నందువల్ల, కర్తవ్యము చీకటిని పారద్రోలటము. మనము, ఈ భౌతిక ప్రపంచంలో ఉన్న ఎవరైనా, అతను చీకటిలో ఉన్నాడు. చీకటి అంటే అజ్ఞానం, జ్ఞానం కాదు. వారు అందరు దాదాపు జంతువులు. ఎందుకు వారు జంతువులు, చాలా సభ్యత తెలిసిన వ్యక్తులు, చక్కని దుస్తులు ధరించి, విశ్వవిద్యాలయ విద్య డిగ్రీలు కలిగి ఉన్నారు? ఎందుకు వారు చీకటిలో ఉన్నారు? "అవును, వారు చీకటిలో ఉన్నారు. రుజువు ఏమిటి? రుజువు ఏమిటి అంటే వారు కృష్ణ చైతన్యములో లేరు. ఇది రుజువు. అది వారి చీకటి. ఎవరినైనా అడగండి, ఒక అంశము తరువాత మరొక అంశము... అడగండి, మీకు కృష్ణుడి గురించి ఏమి తెలుసు? అందరూ అజ్ఞానములో ఉన్నారు, చీకటి. కాబట్టి అది రుజువు. ఇది ఎలా రుజువు అవుతుంది? ఇప్పుడు, కృష్ణుడు అన్నారు. మనము చెప్పలేదు; కృష్ణుడు చెప్తాడు. ఆయన ఎలా అన్నాడు? Na māṁ duṣkṛtino mūḍhāḥ prapadyante narādhamāḥ, māyayāpahṛta-jñānā ( BG 7.15) అపహృత జ్ఞాన అంటే చీకటి. వారు విశ్వవిద్యాలయ పట్టాలను పొందినప్పటికీ, మర్యాద తెలిసిన వారు,భౌతిక నాగరికతలో పురోగతి చెందినవారు, అని పిలువబడుతున్నప్పటికీ, కానీ మాయయాపహృత జ్ఞాన. వారి డిగ్రీలు... ఎందుకనగా వారికి కృష్ణుడు పూర్తిగా తెలియకపోవటము, అందువలన కృష్ణుడికి శరణాగతి పొందరు, ఇది కృష్ణుడు స్వయంగా ప్రచారము చేస్తున్నది: sarva-dharmān parityajya mām ekaṁ śaraṇaṁ vraja... ( BG 18.66) ఆయన వ్యక్తిగతంగా స్వయంగా ప్రచారం చేస్తున్నాడు. ఎందుకంటే ఈ మూర్ఖులు మరియు దుష్టులు, వారు చీకటిలో ఉన్నారు - వారికి జీవితం యొక్క లక్ష్యం ఏమిటో తెలియదు - కృష్ణుడు చాలా దయ గల వాడు అందుకే ఆయన ప్రచారము చేస్తున్నాడు: sarva-dharmān parityajya mām ekaṁ śaraṇaṁ vraja. ఇది తత్వము. అయినప్పటికీ వారు చేయడము లేదు. ఎందుకు? నరాధమః. ఎందుకంటే మానవాళిలో అత్యంత అధములు, నరాధమా. వారు నరాధమగా ఎలా అయ్యారు? ఇప్పుడు, దుష్క్రతిన, ఎల్లప్పుడూ పాపములు చేస్తున్నారు. పాపాత్మకమైన జీవితమేమిటి? అక్రమ లైంగిక సంబంధము కలిగి ఉండటము, మాంసం తినటం, మత్తు సేవించడము మరియు జూదము ఆడటము. వారు ఈ విషయాలకు అలవాటు పడి ఉన్నందున వారు దుష్క్రతిన మరియు నరాధమా మానవజాతిలో అత్యంత అల్పులు వారు విద్య అని పిలవబడే దాని ద్వారా వారు ఏ విధమైన జ్ఞానం పొందుతున్నారో, అది బూటకమైన జ్ఞానం. మాయయాపహృత-జ్ఞాన. ఇది పరిస్థితి