TE/Prabhupada 0743 - మీరు మీ ఆనందం కొరకు పధకాన్ని తయారు చేసుకుంటే ,అప్పుడు మీరు శిక్షింపబడతారు

Revision as of 12:22, 26 February 2018 by Kamalakar (talk | contribs) (Created page with "<!-- BEGIN CATEGORY LIST --> Category:1080 Telugu Pages with Videos Category:Prabhupada 0743 - in all Languages Category:TE-Quotes - 1975 Category:TE-Quotes - Le...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


Morning Walk -- April 7, 1975, Mayapur


రామేశ్వర, జనులు ఆనందంగా ఉన్నారు, కానీ ఆయన మన స్నేహితుడు అయితే....

ప్రభుపాద: ఆనందం పొందటానికి మరియు దెబ్బలు తినటానికి కూడా. మీరు చూడండి? పిల్లలు ఆనందిస్తున్నప్పుడు, కొన్నిసార్లు తండ్రి కొడతాడు. ఎందుకు?

పుష్ట కృష్ణ: అవిధేయత. వారు తమకు తాము లేదా ఇతరులకు హాని కలిగించేలా ఏదైనా చేస్తారు.

ప్రభుపాద: తద్వారా తండ్రి నిర్దేశించినట్లు మీరు జీవితాన్ని, భౌతిక జీవితాన్ని ఆనందించవచ్చు. కాబట్టి అది భక్తియుక్త సేవ. అప్పుడు మీరు ఆనందిస్తారు. లేకపోతే మీరు దెబ్బలు తింటారు,

త్రివిక్రమ: ఆనందం అని పిలువబడేది.

ప్రభుపాద: అవును. మీరు తండ్రి దర్శకత్వం ప్రకారం ఆనందిస్తే, అప్పుడు మీరు సంతోషంగా ఉంటారు. మీరు మీ ఆనందం కొరకు పధకాన్ని తయారు చేసుకుంటే ,అప్పుడు మీరు శిక్షింపబడతారు. ఇది..... కృష్ణుడు చెప్పారు, "జీవితం ఆనందించండి. పర్వాలేదు. మన్-మనా భవ మద్భక్తో మద్యాజి. శాంతిగా జీవించండి. ఎల్లప్పుడూ నా గురించి ఆలోచించండి. నన్ను ఆరాధించండి.” దాన్ని మేము ఆజ్ఞాపించాము "ఇక్కడికి వచ్చి కృష్ణుని గురించి స్మరించండి." అది ఆనందించటం. కాబట్టి వారికి ఇష్టం లేదు. వారికి మద్యం కావాలి. వారికి అక్రమ సంపర్కం కావాలి. వారికి మాంసం కావాలి. కాబట్టి వారిని దండించాలి. వాస్తవానికి ఈ విశ్వం మొత్తం మీ ఆనందం కోసం తయారు చేయబడింది, కానీ ఆయన ఆజ్ఞ ప్రకారం ఆనందించండి. అప్పుడు మీరు ఆనందిస్తారు. అది రాక్షసుడు, దేవుని మధ్య వ్యత్యాసం. రాక్షసుడు తన సొంత విధానాన్ని తయారు చేసుకొని, ఆనందించాలని కోరుకుంటున్నాడు. ఇక దేవతలు, వారు రాక్షసుల కంటే ఎక్కువ ఆనందాన్ని అనుభవిస్తారు ఎందుకు అంటే భగవంతుని ఆజ్ఞ మేరకు. జగదీశ: కృష్ణుడు ఎందుకు జనులకు ఈ పాప భరితమైన ఆనందాలు ఇస్తారు? కృష్ణుడు ఈ జీవులకు పాప భరితమైన ఆనందాలను అందిస్తారు?

ప్రభుపాద: సాధారణ ఆనందాలు?

జగదీశ: పాపభరిత ఆనందాలు, మత్తులో ఉండుట వలె...

ప్రభుపాద: కృష్ణుడు అందించడు. పాపభరితమైనవి మీరు సృష్టిస్తారు. కృష్ణుడు ఎప్పుడూ చెప్పరు “మీరు మాంసం తినండి,” కానీ మీరు కబెళా తెరుస్తారు, కాబట్టి మీరు బాధపడతారు.

బ్రహ్మానంద: కానీ ఒక ఆనందం ఉంది, ఈ పాపకార్యముల నుండి ఒక ప్రత్యేక ఆనందం వస్తుంది.

ప్రభుపాద: ఆ ఆనందం ఏమిటి? (నవ్వు) బ్రహ్మానంద: కొందరు ఇష్టపడతారు... వారు మత్తు నుండి ఆనందం పొందుతారు, వారు ఆనందం పొందుతారు...

ప్రభుపాద: అవును. అందువల్ల వారు తర్వాత- ప్రభావాల వలన బాధపడతారు. అది అజ్ఞానం, వెంటనే మీరు కొంత ఇంద్రియ ఆనందాన్ని పొందుతారు, కానీ ఫలితం చాలా చెడ్డది. అది పాపము.

రామేశ్వర: మీరు నాలుగవ స్కంధములో చెప్పారు మనము యవ్వనంలో ఉన్నప్పుడు చాలా ఎక్కువ ఇంద్రియ భోగము చేస్తే మనము వృద్ధాప్యంలో దానికి సంబంధించిన వ్యాధిని పొందుతాము.

ప్రభుపాద: అవును. ఇక్కడ భౌతిక జీవితం అంటే, మీరు నియమ నిబంధనలను ఉల్లంఘించిన వెంటనే, మీరు బాధను అనుభవిస్తారు. కాబట్టి వర్ణాశ్రమ ధర్మం అనేది భౌతిక జీవితంలో పరిపూర్ణము యొక్క ఆరంభం. ఇది ప్రారంభం. చాతుర్ వర్ణ్యామ్ మయా శ్రిష్టమ్ ( BG 4.31) భగవంతుడు దీనిని సృష్టించాడు. మీరు ఈ వర్ణాశ్రమ ధర్మం యొక్క సంస్థను అనుసరిస్తే, మీ జీవితము యొక్క పరిపూర్ణము ప్రారంభమవుతుంది.