TE/Prabhupada 0754 - చక్కని పాఠమును నేర్పుతుంది - నాస్తికుడు మరియు ఆస్తికుని మధ్య పోరాటం

Revision as of 23:46, 1 October 2020 by Elad (talk | contribs) (Text replacement - "(<!-- (BEGIN|END) NAVIGATION (.*?) -->\s*){2,}" to "<!-- $2 NAVIGATION $3 -->")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


Nrsimha-caturdasi Lord Nrsimhadeva's Appearance Day -- Bombay, May 5, 1974


నేడు భగవంతుడు నరసింహ స్వామి యొక్క అవతరణ దినము. దీనిని నరసింహ చతుర్దశి అని పిలుస్తారు. కాబట్టి నేను సంతోషముగా ఉన్నాను ఇంత తక్కువ సమయంలో, ఈ అబ్బాయిలతో, చాల చక్కగా నేర్చుకున్నారు ఎలా నటించాలో, ప్రత్యేకించి నేను మిస్టర్ హిరణ్యకశిపుకు ధన్యవాదాలు చెప్పాలి. (చప్పట్లు) మిస్టర్ హిరణ్యకశిపుడు తన పాత్రను చాలా చక్కగా నటించారు. కాబట్టి ఇది చాలా చక్కని పాఠమును నేర్పుతుంది - నాస్తికుడు మరియు ఆస్తికుని మధ్య పోరాటం. ప్రహ్లాద మహారాజ ఈ కథ శాశ్వతముగా సత్యము. ఎల్లప్పుడూ నాస్తికుడు మరియు ఆస్తికుని మధ్య పోరాటం ఉంది. ఒక వ్యక్తి భగవంతుని చైతన్యమును కలిగి ఉన్నట్లయితే, కృష్ణ చైతన్యములో ఉంటే , ఆయన అనేక శత్రువులను కనుగొంటాడు. ఎందుకంటే ప్రపంచము పూర్తిగా రాక్షసులతో ఉంది . కృష్ణ భక్తుల గురించి ఏమి మాట్లాడాలి, కృష్ణుని గురించి కూడా, ఆయన వ్యక్తిగతంగా వచ్చినప్పుడు, ఆయన చాలా మంది రాక్షసులను చంపవలసి వచ్చింది. ఆయన మామ, ఆయన తల్లి సోదరుడు చాలా దగ్గరి సంబంధం కలిగి ఉన్నాడు. అయినప్పటికీ, ఆయన కృష్ణుని చంపాలని కోరుకున్నాడు. వెంటనే ఏ కుమారుడు అయినా దేవకీకి జన్మించిన వెంటనే, ఆయన చంపేసేవాడు, ఎందుకనగా ఆయనకు ఎవరు కృష్ణుడు అవుతారో తెలియదు. ఆయన సోదరి యొక్క ఎనిమిదవ పిల్లవాడు కంసుని చంపుతాడు అని జోస్యం. అందువలన ఆయన పిల్లలు అందరినీ చంపడము ప్రారంభించాడు. చివరికి, కృష్ణుడు వచ్చాడు. కానీ ఆయన కృష్ణుడిని చంపలేకపోయాడు. ఆయన కృష్ణుడి చేత చంపబడ్డాడు.

కాబట్టి ఎవరూ భగవంతుని చంపలేరు. రాక్షసులు, దుష్ట సమాజం, వారు కేవలం భగవంతుణ్ణి చంపాలని కోరుకుంటారు. కానీ వాస్తవానికి, భగవంతుడు ఎన్నటికీ చంపబడడు, కానీ రాక్షసుడు భగవంతునిచే చంపబడతాడు. అది ప్రకృతి ధర్మము. ఇది ప్రహ్లాద మహారాజు జీవితము నుండి ఉపదేశము. భగవద్గీతలో చెప్పినట్లు, మనము అర్థం చేసుకోవచ్చు mṛtyuḥ sarva-haraś cāham ( BG 10.34) భగవద్గీతలో చెప్పబడినది "నేను కూడా మరణం రూపములో ప్రతిదీ తీసివేసుకుంటాను, మీ దగ్గర ఉన్నది ఏదైనా. " భౌతిక వస్తువులను, వస్తువులను కలిగి ఉండటము వలన మనము చాలా గర్వంగా ఉన్నాము, కానీ కృష్ణుడు వచ్చినప్పుడు... ప్రహ్లాద మహారాజా చూశాడు. ఆయన తండ్రి హిరణ్యకశిపుడు కూడా, ఆయన నరసింహ స్వామిని చూశాడు. భౌతిక వ్యక్తులు, శాస్త్రవేత్తల వలె, చాలా తెలివి గలవాడు ఈ హిరణ్యకశిపుడు తెలివిగా వారు చాలా విషయాలు కనిపెడుతున్నారు. ఆలోచన ఏమిటి? ఆలోచన ఏమిటంటే "మనము ఎప్పటికీ బ్రతికే ఉందాము మరింత ఇంద్రియ తృప్తి పొందుదాము." ఈ నాగరికతను నాస్తిక పురోగతి అంటారు. అందువల్ల హిరణ్యకశిపుడు విలక్షణమైన భౌతిక వ్యక్తి. హిరణ్య అంటే బంగారము, కశిపు అనగా మృదువైన మంచం, పరుపు. కాబట్టి భౌతిక వ్యక్తులు, వారు బంగారము మరియు మైథున సుఖము పట్ల చాల కోరిక కలిగి ఉంటారు. అది వారి కర్తవ్యము. అందువల్ల ఈ హిరణ్య కశిపుడిని భౌతిక వ్యక్తులలో విలక్షణమైన ఉదాహరణగా చెప్పవచ్చు. ప్రహ్లాద మహారాజ, prakṛṣṭa-rūpeṇa āhlāda. āhlāda. అంటే ఆధ్యాత్మిక ఆనందం. Ānanda-cinmaya-rasa-pratibhāvitābhiḥ (Bs. 5.37). జీవులు 'వాస్తవ గుర్తింపు ప్రహ్లాద, ఆనందము. కానీ భౌతిక సహవాసం కారణంగా, మనం జీవితములో దుర్భర స్థితిలో ఉన్నాము.