TE/Prabhupada 0763 - ప్రతి ఒక్కరు గురువు అవుతారు, ఆయన నిపుణుడైన శిష్యుడు అయినప్పుడు

Revision as of 00:01, 2 October 2020 by Elad (talk | contribs) (Text replacement - "(<!-- (BEGIN|END) NAVIGATION (.*?) -->\s*){2,}" to "<!-- $2 NAVIGATION $3 -->")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


Conversation -- May 30, 1976, Honolulu


ప్రభుపాద: గురువు అవ్వాలనే ధోరణి ఉంది. కానీ... ఏమైనప్పటికీ, మీరు ప్రతి ఒక్కరూ గురువు కావాలి. కానీ ఎదగకుండా ప్రయత్నం ఎందుకు? ఇది నా ప్రశ్న. ప్రతి ఒక్కరు గురువు అవుతారు, ఆయన నిపుణుడైన శిష్యుడు అయినప్పుడు, కానీ ఎందుకు ఈ అపరిపక్వ ప్రయత్నము ఎందుకు? గురువు అనేది ఒక అనుకరించే విషయము కాదు ఒకరు పరిపక్వమైనప్పుడు, ఆయన సహజముగా గురువు అవుతాడు. దీనికి సమాధానం ఏమిటి? గురువుగా మారడానికి కొన్ని ప్రయత్నాలు జరిగాయి. నేను భవిష్యత్తులో, మీరు గురువుగా ఉండటానికి మీ అందరికి శిక్షణ ఇస్తున్నాను. ఇప్పుడు కృష్ణ చైతన్య ఉద్యమం, ఆస్తులను, ప్రతిదీ, నేను నాతో తీసుకు పోను. అవి ఎక్కడ ఉన్నాయో అక్కడే ఉంటాయి. దీనికి చాలా పరిపక్వముగా వ్యవహరించడము అవసరం. కానీ వెంటనే గురువుగా మారడానికి కొంత ప్రయత్నం జరిగింది. నేను చెప్తున్నది నిజమేనా కాదా? హమ్? మనము కూడా గురువుగా వ్యవహరిస్తున్నాము. నా ఇతర గాడ్ బ్రదర్స్, వారు కూడా అది చేస్తున్నారు. కానీ నేను నా గురు మహారాజు జీవించి ఉన్నంత కాలము ఎన్నడూ ప్రయత్నించలేదు. ఇది మర్యాద కాదు. అపరిపక్వ ప్రయత్నం ఉంది. ఇది కృత్రిమ ప్రయత్నం ద్వారా ఒకరు గురువు అయ్యే విషయము కాదు. గురువు అంగీకరించబడతాడు (అస్పష్టముగా ఉంది), కృత్రిమ ప్రయత్నం ద్వారా కాదు. Āmāra ājñāya guru hañā ( CC Madhya 7.128) నా ఆజ్ఞను అనుసరించండి మరియు గురువు అవ్వండి. అంతే కాని మీరు గురువు కావద్దు.

āmāra ājñāya guru hañā tāra' ei deśa
yāre dekha, tāre kaha "kṛṣṇa"-upadeśa
(CC Madhya 7.128)

అయ్యో? మీరు పరంపర పద్ధతిని అనుసరించాలి. అది గురువు అంటే. నేను గురువుగా ప్రకటించుకోవడము కాదు. కాదు అది గురువు కాదు. ఆధ్యాత్మిక గురువు అంటే ఆయన ఆధ్యాత్మిక గురువు ఆజ్ఞను ఖచ్చితముగా అనుసరించినవాడు గురువు. ఆయన గురువు కావచ్చు. లేకపోతే అది చెడిపోతుంది. కృత్రిమ ప్రయత్నం మంచిది కాదు