TE/Prabhupada 0766 - కేవలము శ్రీమద్భాగవతము చదవడం ద్వారా, మీరు సంతోషంగా ఉంటారు: Difference between revisions

(Created page with "<!-- BEGIN CATEGORY LIST --> Category:1080 Telugu Pages with Videos Category:Prabhupada 0766 - in all Languages Category:TE-Quotes - 1974 Category:TE-Quotes - Le...")
 
m (Text replacement - "(<!-- (BEGIN|END) NAVIGATION (.*?) -->\s*){2,}" to "<!-- $2 NAVIGATION $3 -->")
 
Line 6: Line 6:
[[Category:TE-Quotes - in Switzerland]]
[[Category:TE-Quotes - in Switzerland]]
<!-- END CATEGORY LIST -->
<!-- END CATEGORY LIST -->
<!-- BEGIN NAVIGATION BAR -- TO CHANGE TO YOUR OWN LANGUAGE BELOW SEE THE PARAMETERS OR VIDEO -->
<!-- BEGIN NAVIGATION BAR -- DO NOT EDIT OR REMOVE -->
{{1080 videos navigation - All Languages|French|FR/Prabhupada 0765 - Soyez complètement conscient du fait que "tout appartient à Krishna et rien est à nous"|0765|FR/Prabhupada 0767 - Tatah rucis. Alors goûtez. Vous ne pouvez pas vivre en dehors de ce champ. Le goût a changé|0767}}
{{1080 videos navigation - All Languages|Telugu|TE/Prabhupada 0765 - మీరు పూర్తిగా చైతన్యము కలిగి ఉండాలి, ప్రతీది కృష్ణుడికి చెందుతుంది మనది ఏదీ కాదు|0765|TE/Prabhupada 0767 - Tato niṣṭhā tataḥ rucis అప్పుడు రుచి మీరు ఈ శిబిరానికి బయట నివసించలేరు. రుచి మారినది|0767}}
<!-- END NAVIGATION BAR -->
<!-- END NAVIGATION BAR -->
<!-- BEGIN ORIGINAL VANIQUOTES PAGE LINK-->
<!-- BEGIN ORIGINAL VANIQUOTES PAGE LINK-->
Line 17: Line 17:


<!-- BEGIN VIDEO LINK -->
<!-- BEGIN VIDEO LINK -->
{{youtube_right|WsKuUQ711Zw|కేవలము శ్రీమద్భాగవతము చదవడం ద్వారా, మీరు సంతోషంగా ఉంటారు  <br/>- Prabhupāda 0766}}
{{youtube_right|6zVsF9prrlY|కేవలము శ్రీమద్భాగవతము చదవడం ద్వారా, మీరు సంతోషంగా ఉంటారు  <br/>- Prabhupāda 0766}}
<!-- END VIDEO LINK -->
<!-- END VIDEO LINK -->



Latest revision as of 23:38, 1 October 2020



Lecture on SB 1.13.12 -- Geneva, June 3, 1974


ప్రభుపాద: (చదువుతూ) “యుధిష్ఠిర మహారాజు బాధ్యతగా, తన పెదనాన్నను ఆదరించటం చాలా బాగుంది, కానీ అటువంటి దాతృత్వ ఆతిధ్యాన్ని ధృతరాష్ట్రుడు అంగీకరించటం సంతృప్తికరమైనది కాదు. ఇతర ప్రత్యామ్నాయం లేదని అతడు అనుకున్నాడు అందుకే ఆయన దీనిని అంగీకరించారు. విదురుడు కేవలం ధృతరాష్ట్రునికి కనువిప్పు కలిగించుటకే వచ్చాడు ఇంకా ఆధ్యాత్మిక జ్ఞానం యొక్క ఉన్నత హోదాను ఇచ్చుటకు వచ్చాడు. పతితులైన వారిని తరింపచేయడం పుణ్యాత్ముల యొక్క బాధ్యత, విదురుడు ఆ కారణంగానే వచ్చాడు. కానీ, ఆధ్యాత్మిక జ్ఞానోదయం యొక్క పలుకులు ఎంతో ఉపశమింపచేస్తాయి ధృతరాష్ట్రునికి ఉపదేశం ఇస్తుండగా, కుటుంబం యొక్క అందరి సభ్యుల దృష్టిని విదురుడు ఆకర్షించాడు, అందరూ ఓపికతో ఆనందంతో అతడిని విన్నారు. ఇది ఆధ్యాత్మిక సాక్షాత్కారమునకు మార్గం. సందేశం శ్రద్ధగా వినాలి, అదీ ఆత్మ సాక్షాత్కారం అయిన వారు మాట్లాడినట్లయితే, ఇది బద్ధ జీవి యొక్క నిద్రాణమైన హృదయము మీద పని చేస్తుంది. అలా నిరంతరం శ్రవణం చేయటం ద్వారా, ఆత్మ - సాక్షాత్కారము యొక్క ఖచ్చితమైన స్థితిని పొందవచ్చు."

కాబట్టి శ్రవణం చాలా అవసరం. శ్రవణం కీర్తనం విష్ణోః స్మరణం పాద - సేవనం ( SB 7.5.23) కాబట్టి మన అన్ని కేంద్రాలలో, ఈ పద్ధతిని అనుసరించాలి. మనకు ఇప్పుడు చాలా పుస్తకాలు వచ్చాయి. మనము కేవలము ఈ పుస్తకాలు చదివితే... మన యోగేశ్వర ప్రభు పుస్తకాలను చదవడానికి ఎంతో ఉత్సాహంగా ఉన్నారు. కాబట్టి ప్రతి ఒక్కరూ పుస్తకాలు చదవాలి ఇతరులు వినాలి. ఇది చాలా అవసరం, శ్రవణం. మరింత శ్రవణం చేస్తే.... మనకు చాలా పుస్తకాలు ఉన్నాయి. ఇప్పటికే ప్రచురించబడినవి. ప్రతిరోజూ ఒక శ్లోకాన్ని వివరిస్తున్నట్లుగా. కనీసం... ఇప్పటికే స్టాకులో చాలా శ్లోకాలు ఉన్నాయి, మీరు యాభై సంవత్సరాలు మాట్లాడుతూ వెళ్ళవచ్చు. ఇప్పటికే ప్రచురించబడిన ఈ పుస్తకాలు, మీరు కొనసాగించవచ్చు. స్టాక్ అవసరం ఉండదు. కాబట్టి, ఈ అభ్యాసం చేయాలి. సమయం వృధా చేయవద్దు. సాధ్యమైనంతవరకు, భాగవతము అనే దివ్యమైన అంశమును వినుటకు ప్రయత్నించండి. యద్ వైష్ణవానాం ప్రియం ( SB 12.13.18) ఇది చెప్పబడింది శ్రీ మద్భాగవతము వైష్ణవులకు చాలా, చాలా ప్రియమైనది, భక్తులకు. వృందావనములో, మీరు కనుగొంటారు, వారు ఎల్లప్పుడూ శ్రీమద్భాగవతమును చదువుతూ ఉంటారు. అది వారి జీవితం మరియు ఆత్మ. ఇప్పుడు మనకు ఇప్పటికే ఆరు భాగాలు కలిగి ఉన్నాము, తరువాత.... ఎన్ని? ఎనిమిది భాగాలు వస్తున్నాయి? కాబట్టి మనకు తగినంత స్టాకు ఉంటుంది. కాబట్టి మీరు చదవాలి. శ్రవణం కీర్తనం విష్ణోః ( SB 7.5.23) అది ప్రధాన కర్తవ్యం. అది శుద్ధమైన భక్తియుత సేవ. ఎందుకంటే మనము ఇరవై - నాలుగు గంటలు శ్రవణమునకు కీర్తనమునకు అంకితం చేయలేము; కాబట్టి మేము కార్యక్రమములను విస్తరించాము; కార్యక్రమములను చాలా విధాలుగా. లేకపోతే, శ్రీ మద్భాగవతము చాలా బాగుంది, మీరు ఎక్కడ అభ్యాసం చేసినా, ఏ పరిస్థితిలోనైనా, కేవలము శ్రీమద్భాగవతము చదవడం ద్వారా, మీరు సంతోషంగా ఉంటారు. కాబట్టి ఈ అభ్యాసాన్ని పాటించండి మీ ఆధ్యాత్మిక జీవితాన్ని మరింత పరిపూర్ణం చేసుకోండి

చాలా ధన్యవాదములు.

భక్తులు: జయ శ్రీల ప్రభుపాద.