TE/Prabhupada 0770 - నేను ఆత్మను ప్రేమిస్తున్నాను. ఆత్మ తత్వ విత్. నేను ఆత్మను ఎందుకు ప్రేమిస్తున్నాను

Revision as of 02:12, 31 December 2017 by Kamalakar (talk | contribs) (Created page with "<!-- BEGIN CATEGORY LIST --> Category:1080 Telugu Pages with Videos Category:Prabhupada 0770 - in all Languages Category:TE-Quotes - 1974 Category:TE-Quotes - Le...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


Lecture on SB 2.1.1 -- Paris, June 9, 1974


ప్రభుపాద: మన కృష్ణ చైతన్యము ఉద్యమములో వలె మనము ప్రతి దాని గురించి మాట్లాడము. మనము కేవలం కృష్ణుడి గురించి మాట్లాడుతున్నాము. మనము కృష్ణుడి గురించి మాట్లాడినట్లయితే, కనీసం, వంద సంవత్సరాలు, ప్రస్తుత పరిస్థితిలో, ఇప్పటికీ, మన స్టాక్ పూర్తి కాదు. మనకు చాలా పుస్తకాలు ఉన్నాయి. నూరు సంవత్సరాలు అయితే , మనకు ఇప్పటికే ఉన్నది వంద సంవత్సరాల పాటు చదివినట్లయితే, శ్రీమద్-భాగవతం యొక్క ఒక పదాన్ని అర్థం చేసుకునేందుకు ప్రయత్నించండి, అది వంద సంవత్సరాలు పడుతుంది. మీరు అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తే, ఆ ఒక పదం janmādy asya yataḥ ( SB 1.1.1) మీరు దాన్ని వంద సంవత్సరాలు అర్థం చేసుకోలేరు. కావున ఇది చాలా బాగుంటుంది, శ్రీమద్-భాగవతం. ప్రతిరోజు చదువుతూ ఉండండి. మీరు కనుగొంటారు... శ్రీమద్-భాగవతం మరియు భగవద్గీత రెండునూ. ప్రతి రోజు, మీరు ఎంత ఎక్కువ గ్రహిస్తారో ఆత్మవిత్, అయితే, మీరు కొత్త అర్థం, కొత్త కాంతిని చూస్తారు. శ్రీమద్-భాగవతం చాలా బాగుంటుంది. కేవలము మీరు శ్రీమద్-భాగవతం చదివి ఉంటే... Vidyā bhāgavatāvadhiḥ. ఒకరు జ్ఞానము కలిగి ఉంటే ... అభ్యాస పరిమితి ఏమిటి? అది పరిమితి, నేర్చుకోవడములో, మీరు శ్రీమద్-భాగవతమును అర్థం చేసుకోవడమే పరిమితి. . పూర్తయ్యింది. ఎటువంటి జ్ఞానం అవసరం లేదు. అందువల్ల దీన్ని śrotavyādiṣu yah paraḥ ( SB 2.1.1) అని పిలుస్తారు. అంతిమమైనది, మొదటి తరగతి.

కానీ apaśyatām ātma-tattvaṁ gṛheṣu gṛha-medhinām ( SB 2.1.2) గృహమేధి, వారికి ఆత్మ ఉంది అని తెలియదు, ఆత్మ శాశ్వతమైనది. వాస్తవానికి, మనము ఆనందం కొరకు కాంక్షిస్తున్నాము. ఎవరి ఆనందం కోసం? ఇది ఆత్మ యొక్క ఆనందం. ఇది కృష్ణుని యొక్క సంతోషం. మనము, మనము ఈ శరీరమును రక్షించడానికి ప్రయత్నిస్తాము. మనకు ఈ శరీరము అంటే చాలా ఇష్టం. ఎందుకు? ఎందుకంటే ఆత్మ ఉంది కనుక. అందరికి ఇది తెలుసు. ఈ శరీరములో, ఏ ఆత్మ లేకపోతే వెంటనే, అది బయట పడ వేయబడుతుంది. వీధిలో దానిని దూరముగా పడేస్తారు. ఎవరూ దాని కోసం పట్టించుకోరు. ఉదాహరణకు ఒక అందమైన పురుషుడు, అందమైన అమ్మాయి, మృతదేహాలు వీధిలో పడి ఉన్నాయి ఎవరు వాటిని పట్టించుకుంటారు? కానీ, ఎంత కాలము ఆత్మ ఉంటుందో, "ఓ, ఎంత చక్కని, అందమైన అబ్బాయి, అమ్మాయి." అంటారు ఆత్మ ముఖ్యమైనది.

కాబట్టి నిజానికి, మనము ఈ శరీరమును ప్రేమించడము లేదు, అదే అందమైన శరీరం అక్కడ ఉంది కనుక ఎందుకు మీరు పట్టించుకోరు? ఎందుకంటే ఆత్మ లేదు... అందువలన నేను ఆత్మను ప్రేమిస్తున్నాను. ఇది సత్యము. దీనిని ఆత్మవిత్ , ఆత్మ తత్వ విత్ అంటారు. నేను ఆత్మను ఎందుకు ప్రేమిస్తున్నాను? నేను కృష్ణుడిని ప్రేమిస్తున్నాను కనుక. ఆత్మ అనేది కృష్ణుడి యొక్క భాగం మరియు అంశ. కావున, ఎందుకు నేను ఆత్మ ను ప్రేమించను? ఎందుకంటే ఇది కృష్ణునిలో భాగము కనుక. అందువలన అంతిమంగా, నేను కృష్ణుడిని ప్రేమిస్తున్నాను. ఇది ముగింపు. నేను కృష్ణుడిని ప్రేమించకపోతే అది నా అసాధారణ దశ. సాధారణ దశ నేను కృష్ణుడిని ప్రేమిస్తాను. కావున మనము కృష్ణ చైతన్యమును మేల్కొలుపుటకు ప్రయత్నిస్తున్నాము. కృష్ణ చైతన్యములో ఒకడు స్థిరముగా ఉంటే, కృష్ణుడిని ప్రేమించడం ప్రారంభించిన వెంటనే, అప్పుడు ఆయన ఎక్కువగా ఎవ్వరిని ఇష్టపడ వలసిన అవసరము లేదు. Svāmin kṛtārtho 'smi: "ఇప్పుడు నేను పూర్తిగా సంతృప్తిగా ఉన్నాను." కాబట్టి, లేకపోతే మనకు చాలా ప్రశ్నలు ఉంటాయి, చాలా సమాధానాలు ఉంటాయి, ఎంత కాలము మనం ఆత్మ సాక్షాత్కారమును పొందమో , మన సమయం వృధా అవుతుంది.

కాబట్టి, ఈ కృష్ణ -ప్రశ్న, కృష్ణుడి గురించి విచారణ, ఇది నిరంతరం కొనసాగాలి. మీరు భగవద్గీత మరియు శ్రీమద్-భాగవతములో తెలుసుకోవాలి అన్ని సమాధానాలను కనుగొంటారు కేవలం ప్రశ్నలు మరియు సమాధానముల వలన మీ జీవితం విజయవంత మవుతుంది.

చాలా ధన్యవాదాలు.

భక్తులు: జయ ప్రభుపాద.