TE/Prabhupada 0785 - సర్వాధిపత్యము మంచిది, అయితే సర్వాధికారి అత్యంత ఆధ్యాత్మికంగా అర్హత కలిగి ఉండాలి: Difference between revisions

(Created page with "<!-- BEGIN CATEGORY LIST --> Category:1080 Telugu Pages with Videos Category:Prabhupada 0785 - in all Languages Category:TE-Quotes - 1975 Category:TE-Quotes - In...")
 
m (Text replacement - "(<!-- (BEGIN|END) NAVIGATION (.*?) -->\s*){2,}" to "<!-- $2 NAVIGATION $3 -->")
 
Line 7: Line 7:
[[Category:TE-Quotes - in USA, Dallas]]
[[Category:TE-Quotes - in USA, Dallas]]
<!-- END CATEGORY LIST -->
<!-- END CATEGORY LIST -->
<!-- BEGIN NAVIGATION BAR -- TO CHANGE TO YOUR OWN LANGUAGE BELOW SEE THE PARAMETERS OR VIDEO -->
<!-- BEGIN NAVIGATION BAR -- DO NOT EDIT OR REMOVE -->
{{1080 videos navigation - All Languages|French|FR/Prabhupada 0784 - Si on n'agit pas dans une plateforme divine, alors on doit être en train d'agir sur la prise de maya|0784|FR/Prabhupada 0786 - En attendant le châtiment de Yamaraja|0786}}
{{1080 videos navigation - All Languages|Telugu|TE/Prabhupada 0784 - దైవిక పరిస్థితిలో మనం పనిచేయకపోతే, మనం మాయ యొక్క కోరలలో పని చేస్తుండాలి|0784|TE/Prabhupada 0786 - అతడు యమరాజ శిక్ష కోసం ఎదురుచూస్తున్నాడు|0786}}
<!-- END NAVIGATION BAR -->
<!-- END NAVIGATION BAR -->
<!-- BEGIN ORIGINAL VANIQUOTES PAGE LINK-->
<!-- BEGIN ORIGINAL VANIQUOTES PAGE LINK-->
Line 18: Line 18:


<!-- BEGIN VIDEO LINK -->
<!-- BEGIN VIDEO LINK -->
{{youtube_right|2DLnk7Dxc4I|సర్వాధిపత్యము మంచిది, అయితే సర్వాధికారి అత్యంత ఆధ్యాత్మికంగా అర్హత కలిగి ఉండాలి  <br/>- Prabhupāda 0785}}
{{youtube_right|BvxDadY_43M|సర్వాధిపత్యము మంచిది, అయితే సర్వాధికారి అత్యంత ఆధ్యాత్మికంగా అర్హత కలిగి ఉండాలి  <br/>- Prabhupāda 0785}}
<!-- END VIDEO LINK -->
<!-- END VIDEO LINK -->



Latest revision as of 23:37, 1 October 2020



Press Conference at Airport -- July 28, 1975, Dallas


ప్రభుపాద: మీరు వీలైనంతవరకూ భౌతికగా ఉన్నత స్థానముకు ఎదిగి ఉండవచ్చు, కానీ మీరు భగవంతుని చైతన్యము లేదా కృష్ణ చైతన్యమును తీసుకోకపోతే, అప్పుడు ఈ భౌతిక అంశాల అభివృద్ది విలువ సున్నాకి సమానంగా ఉంటుంది. ఎవరూ సంతృప్తి చెందరు. కావున ఈ కృష్ణ చైతన్య ఉద్యమమును చాలా తీవ్రంగా తీసుకోవాలి. ఇది భౌతిక సుఖాల యొక్క అమెరికన్ పురోగతి యొక్క ముగింపు దశ. అప్పుడు ప్రజలు చాలా ఆనందంగా ఉంటారు. అమెరికా ఇప్పటికే ప్రపంచ నాయకుడు. వారు మొదటి తరగతి నాయకులుగా ఉంటారు. ప్రపంచం ప్రయోజనము పొందుతుంది, మీరు ప్రయోజనము పొందుతారు, నా ప్రయత్నం కూడా విజయవంతమౌతుంది. మిమ్మల్ని మీరే సున్నాలో ఉంచుకోవద్దు. ఒకటిని తీసుకోండి. అప్పుడు ఇది చాలా బాగుంటుంది. ఉదాహరణకు... మీరు చాలా సులభంగా అర్థం చేసుకోవచ్చు. ఈ జీవితం, చాలా ముఖ్యమైన వ్యక్తి, కానీ ఆత్మ లేకపోతే, ఇది సున్నా. దీనికి విలువ లేదు. ఏది ఏమయినప్పటికీ ఒక ముఖ్యమైన వ్యక్తి కావచ్చు, ఎప్పుడైతే ఆత్మ శరీరంలో నుంచి బయటకు వెళ్లినప్పుడు, ఇది భౌతికము యొక్క ముద్ద; దానికి విలువ లేదు. మీరు ఏదైనా తీసుకోండి - ఈ యంత్రం, ఆ యంత్రం, ఏదైనా యంత్రం- ఎవరైనా, ఎవరైనా ఆధ్యాత్మిక జీవి, ఎవరైనా జీవి ఆ సాధనాన్ని చూసుకోకపోతే దాని విలువ ఏమిటి? ఏ విలువ లేదు. అందువలన, ప్రతిచోటా ఈ ఆధ్యాత్మిక చైతన్యం తప్పనిసరిగా ఉండాలి. లేకపోతే అది సున్నా.

మహిళా విలేఖరి: నాకు ఒక ప్రశ్న ఉంది. మీరు ఇప్పుడు భారతదేశంలో రాజకీయ పరిస్థితిపై వ్యాఖ్యానిస్తారా? శ్రీమతి గాంధీ గురించి ... మీరు ఏమి ఆలోచిస్తారు?

ప్రభుపాద: చూడండి, మేము రాజకీయ పరిస్థితిని ఎన్నడూ పరిగణించము. కానీ మా ప్రతిపాదన రాజకీయ, సాంఘిక, ఆర్థిక లేదా తాత్విక ఏదైనా సరే, కృష్ణుడు లేకుండా, ఇది అంతా సున్నా. శ్రీమతి గాంధీ గురించి అయితే, ఆమెకు కొంత ఆధ్యాత్మిక అవగాహన ఉంది. కావున వాస్తవంగా ఆమె చాలా ఆధ్యాత్మికంగా ఉన్నత స్థానములోకి వస్తే, అప్పుడు ఈ అత్యవసర పరిస్థితి మెరుగుపడుతుంది. లేకపోతే... ఇది ప్రజాస్వామ్యానికి వ్యతిరేకంగా ప్రజల అభిప్రాయం. కాబట్టి ప్రజాస్వామ్యం వలన పెద్దగా ప్రయోజనము లేదు. ఎక్కడైనా మరియు ప్రతిచోటా ... మీ దేశంలో కూడా, మీరు నిక్సన్ ను ఎన్నుకున్నారు, ప్రజాస్వామ్యం, కానీ మీరు ఆయనతో సంతృప్తి చెందలేదు. దాని అర్థం ప్రజాస్వామ్యం, సాధారణ వ్యక్తులు వారు ఎవరినైనా ఎంపిక చేయవచ్చు, మళ్ళీ వారు ఆయనని క్రింద తీసుకురావడానికి ప్రయత్నిస్తారు. ఎందుకు? ఆయనను ఎంపిక చేసినప్పుడు, అది తప్పు అని అర్థం.

కాబట్టి వేదముల నాగరికత ప్రకారం, ప్రజాస్వామ్యము అనేది ఏదీ లేదు. అది రాచరిక ప్రభుత్వం, కానీ రాచరిక ప్రభుత్వం అంటే రాజు చాలా ఆధ్యాత్మికంగా పురోగమించినవారని అర్థం. రాజు రాజర్షి అని పిలవబడ్డాడు, అదే సమయంలో సాధువ్యక్తి. మరొక ఉదాహరణ ఉంది. మా దేశంలో - గాంధీ, ఆయన రాజకీయ నాయకుడిగా ఉన్నప్పుడు, ఆయన ఆచరణాత్మకంగా సర్వాధికారి, కానీ ఆయన చాలా ఉన్నత నైతిక స్వభావం ఉన్న వ్యక్తి, ప్రజలు ఆయనని తీసుకున్నారు, ఆయనని సర్వాధికారిగా అంగీకరించారు. కాబట్టి సర్వాధిపత్యము మంచిది, అయితే సర్వాధికారి అత్యంత ఆధ్యాత్మికంగా అర్హత కలిగి ఉండాలి. అది వేదముల తీర్పు. కురుక్షేత్ర యుద్ధం జరిగింది ఎందుకంటే భగవంతుడు కృష్ణుడు కోరుకున్నారు రాజర్షి, యుధిష్టర, సింహాసనముపై ఉండాలి. కాబట్టి రాజు భగవంతుని ప్రతినిధిగా భావించబడతాడు. కాబట్టి ఆయన దైవిక వ్యక్తిగా ఉండాలి. అప్పుడు అది విజయవంతమవుతుంది