TE/Prabhupada 0820 - గురువు అంటే ఆయన ఇచ్చే ఏ సూచన అయినా, మనము ఏ వాదన లేకుండా అంగీకరించాలి: Difference between revisions

(Created page with "<!-- BEGIN CATEGORY LIST --> Category:1080 Telugu Pages with Videos Category:Prabhupada 0820 - in all Languages Category:TE-Quotes - 1976 Category:TE-Quotes - Le...")
 
m (Text replacement - "(<!-- (BEGIN|END) NAVIGATION (.*?) -->\s*){2,}" to "<!-- $2 NAVIGATION $3 -->")
 
Line 7: Line 7:
[[Category:TE-Quotes - in India, Vrndavana]]
[[Category:TE-Quotes - in India, Vrndavana]]
<!-- END CATEGORY LIST -->
<!-- END CATEGORY LIST -->
<!-- BEGIN NAVIGATION BAR -- TO CHANGE TO YOUR OWN LANGUAGE BELOW SEE THE PARAMETERS OR VIDEO -->
<!-- BEGIN NAVIGATION BAR -- DO NOT EDIT OR REMOVE -->
{{1080 videos navigation - All Languages|French|FR/Prabhupada 0819 - Asrama veut dire une situation pour la culture de la spiritualité|0819|FR/Prabhupada 0821 - Pandita ne fait pas référence à quelqu'un qui possède un diplôme. Pandita veut dire sama-cittah|0821}}
{{1080 videos navigation - All Languages|Telugu|TE/Prabhupada 0819 - ఆశ్రమము అంటే ఆధ్యాత్మికతను అభివృద్ధి చేసుకునే స్థితి అని అర్థం|0819|TE/Prabhupada 0821 - పండితుడు అంటే డిగ్రీ పొందిన వ్యక్తి కాదు. పండితుడు అంటే సమ చిత్తాః. అది సమ- చిత్తాః|0821}}
<!-- END NAVIGATION BAR -->
<!-- END NAVIGATION BAR -->
<!-- BEGIN ORIGINAL VANIQUOTES PAGE LINK-->
<!-- BEGIN ORIGINAL VANIQUOTES PAGE LINK-->
Line 18: Line 18:


<!-- BEGIN VIDEO LINK -->
<!-- BEGIN VIDEO LINK -->
{{youtube_right|kQmj8Ey7-nc|గురువు అంటే ఆయన ఇచ్చే ఏ సూచన అయినా, మనము ఏ వాదన లేకుండా అంగీకరించాలి  <br/>- Prabhupāda 0820}}
{{youtube_right|ibo6-6WOwuQ|గురువు అంటే ఆయన ఇచ్చే ఏ సూచన అయినా, మనము ఏ వాదన లేకుండా అంగీకరించాలి  <br/>- Prabhupāda 0820}}
<!-- END VIDEO LINK -->
<!-- END VIDEO LINK -->



Latest revision as of 23:37, 1 October 2020



Lecture on SB 5.5.2 -- Vrndavana, October 24, 1976


మీరు వాస్తవమునకు తపస్సును అమలు చేయాలనుకుంటే, అప్పుడు మీరు ఒక వ్యక్తిని సంప్రదించాలి ఎవరైతే ఇప్పటికే తపస్యా, తపో దివ్యం ( SB 5.5.1) ను అమలు చేస్తారో. అప్పుడు మీరు విషయాలను పొందుతారు. మహత్- సేవమ్. అక్కడ మీరు మీ సేవలు చేయాలి. వినమ్రతతో, సేవ, సేవయా. మీరు మహాత్మాను ప్రశ్నించవచ్చు, కానీ సవాలు చేయడము కాదు , ప్రణిపాత మరియు సేవ చేయడము ద్వారా. లేకపోతే, మీకు ప్రశ్నించే హక్కు లేదు. ఉదాహరణకు ఈ మనిషి రూప గోస్వామి దగ్గరకు వెళ్ళినట్లుగానే. ఆయనకు సమయం వృధా చేసే హక్కు లేదు.

వాస్తవానికి ఈ చర్చ, సూచనలు, గురువు మరియు శిష్యుల మధ్య జరుగుతాయి, అక్కడ సమర్పణ ఉంది. లేకపోతే అవసరం లేదు. ఈ రోజుల్లో మనము కొన్ని సమావేశాలను ఏర్పాటు చేస్తాము. కొందరు సాధారణ ప్రజలు, వారు శ్రవణము చేయడానికి వస్తారు. కానీ ఆ రకమైన చర్చ చైతన్య మహాప్రభు ఎన్నడూ చేయలేదు. ఎప్పుడూ చేయలేదు. ఎందుకంటే ఈ బయటవారు, వారు విధేయులు కాదు. వారు సరదాగా చూడటానికి వస్తారు. వారు ఏదో నేర్చుకోవడానికి రారు. అందువల్ల చైతన్య మహాప్రభు ఎన్నడూ గొప్ప సమావేశాన్ని ఏర్పాటు చేయలేదు. గొప్ప సమావేశంలో అతడు ఉన్నాడు, కానీ కీర్తన, సంకీర్తన. జగన్నాథ ఆలయంలో నాలుగు గంటల పాటు సాయంత్రం ప్రతిరోజూ ఆయన గొప్ప సమావేశంలో ఉండేవారు, కానీ మొత్తం కాలము హరే కృష్ణ కీర్తనలో ఉపయోగించే వారు. కానీ సార్వాభౌమ భట్టాచార్య లేదా ప్రకాశ నంద సరస్వతి లేదా రామానంద రాయ వంటి వ్యక్తులు ఉన్నప్పుడు, అటు వంటి ఉన్నతమైన వ్యక్తి వలె, ఆయన చర్చించే వారు. లేకపోతే, ఆయన చర్చించడం లేదు. చర్చించవలసిన అవసరం లేదు, ఎందుకంటే వారు వినయంతో వచ్చే వారు కాదు. వారు అనుకుంటారు...ఉదాహరణకు కృష్ణుడు మరియు అర్జునుని వలె. ఎంత కాలము అర్జునుడు ఆలోచిస్తున్నాడో "కృష్ణుడు నా స్నేహితుడు. నేను ఆయకు సమానంగా ప్రత్యుత్తరం చేస్తాను, "అప్పుడు కృష్ణుడు చాలా గంభీరంగా చెప్పాడు. కానీ అర్జునుడు అర్థం చేసుకున్నప్పుడు "ఈ విధమైన మాట్లాడటం వలన ఎలాంటి ప్రయోజనము లేదు." అప్పుడు అతను ఆయన శిష్యుడయ్యాడు: śiṣyas te 'ham śādhi māṁ prapannam ( BG 2.7) ఇంక ఏ మాత్రము చర్చ లేదు. ఇప్పుడు నా గురువుగా నేను మిమ్మల్ని అంగీకరిస్తున్నాను.

గురువు అంటే ఆయన ఇచ్చే ఏ సూచన అయినా, మనము ఏ వాదన లేకుండా అంగీకరించాలి. వేదముల జ్ఞానం ఇలా ఉంటుంది. మీరు అర్థం చేసుకోలేరు. యథాతధముగా ఇది, మీరు అంగీకరించాలి. అదేవిధముగా గురువు యొక్క వచనమును కూడా మీరు అంగీకరించాలి. వాదన ఉండకూడదు. అది వేదముల జ్ఞానం. అది వేదముల పద్ధతి. ఈ ఉదాహరణ మనం చాలాసార్లు ఇచ్చాము: ఉదాహరణకు ఈ ఆవు పేడలాగే. ఆవు పేడ జంతువు యొక్క మలం. కాబట్టి ఒక జంతువు యొక్క మలం చాలా అపవిత్రమైన విషయము. మీరు ముట్టుకుంటే వెంటనే, మీ సొంత మలము అయినా... మీరు బాగా జ్ఞానము కలిగిన పండితుడు లేదా భక్తుడు కావచ్చు, కానీ మీరు మీ సొంత మలం తాకేతే పరిశుభ్రంగా ఉన్నారు అని కాదు. లేదు వెంటనే మీరు స్నానం చేయాలి. తన సొంతము అయినా, ఇతరుల గురించి ఏమి మాట్లాడాలి'. కానీ వేదముల సూచనలో మనం ఆవు పేడను చూస్తున్నాం, అది కూడా జంతువు యొక్క మలం, మనిషి కంటే తక్కువ జంతువు, అది పవిత్రమైనది, అది చెప్పబడింది. మీరు పవిత్రమైనది అని అంగీకరించాలి. "ఇటువంటి మలం అపవిత్రం. అని వాదన అవసరము లేదు నా ఆధ్యాత్మిక గురువు యొక్క మలం కూడా అపవిత్రమైనది. ఎలా ఆ జంతువుల ఆవు పేడ పవిత్రమైనది? " కానీ ఇది వేదాలలో ఉన్నందువల్ల ఇది స్వచ్ఛము అని చెప్పబడింది, మీరు అంగీకరించాలి. అదేవిధముగా, శంఖము, ఇది జంతువు యొక్క ఎముక. ఎముక, మీరు ఏ చనిపోయిన శరీరము యొక్క ఎముకను తాకినట్లయితే, తక్షణమే పవిత్రము అవ్వాలి. కానీ, ఈ ఎముక అర్చామూర్తి గదిలో ఉంచుతారు. మనము ప్రతి రోజూ శంఖమును ఊదుతాము-ఎందుకంటే వేదముల సూచన. కాబట్టి వాదన లేదు. మీరు వేదముల సూచనను అంగీకరించినట్లయితే, మీరు దానిని యథాతధముగా అంగీకరించాలి