TE/Prabhupada 0853 - మనము కేవలం ఈ లోకమునకు మాత్రమే వచ్చామని కాదు . మనము అనేక ఇతర లోకములలో ప్రయాణించాము

Revision as of 02:35, 22 November 2017 by Kamalakar (talk | contribs) (Created page with "<!-- BEGIN CATEGORY LIST --> Category:1080 Telugu Pages with Videos Category:Telugu Pages - 207 Live Videos Category:Prabhupada 0853 - in all Languages Category:...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


750306 - Lecture SB 02.02.06 - New York


మనము కేవలం ఈ లోకమునకు మాత్రమే వచ్చామని కాదు . మనము అనేక ఇతర లోకములలో ప్రయాణించాము కావున వాస్తవానికి అది సత్యం. మనము విశ్వం అంతా ప్రయాణిస్తున్నాము. మనము కేవలం ఈ లోకమునకు మాత్రమే వచ్చామని కాదు. మనము అనేక ఇతర లోకములలో ప్రయాణించాము. లేకపోతే, ఎలా కృష్ణుడు భ్రామయాన్ అని చెబుతాడు, తిరుగుతూన్నాము; సర్వ-భూతాని, అన్ని జీవులలో - ఉన్నత లోకములలో లేదా ఈ అధమ లోకములలో? అతను ఎలా ప్రయాణిస్తున్నాడు? Yantrārūḍhāni. ఈ యంత్రం, ఈ శరీరం. ఆయనకు ఈ శరీరం ఇవబడింది. ఇప్పుడు నేను చంద్ర లోకమునకు లేదా ఇతర ఉన్నత లోకములకు వెళ్లాలనుకుంటే , అవును, మీరు పొందుతారు. కానీ ఈ యంత్రం కాదు, మీ అతిచిన్న స్పుత్నిక్ అని పిలవబడే దానితో, కాదు మీరు కృష్ణుని నుండి యంత్రం కారు, వాహనం, వాహనం తీసుకోవాలి. మీరు కావాలనుకుంటే ఆయన మీకు ఇస్తాడు, మీరు తీవ్రముగా ఉంటే, మీరు చంద్రలోకము వెళ్లాలనుకుంటే, అప్పుడు మీరు కృష్ణుడిని ప్రార్థించండి, "నాకు ఒక యంత్ర లేదా ఒక యంత్రం ఇవ్వండి, నేను చంద్రుని గ్రహానికి వెళ్ళటానికి." అప్పుడు మీరు వెళ్ళవచ్చు. లేకపోతే మీరు అనవసరంగా డబ్బు ఖర్చు చేస్తారు, ఎక్కడికో వెళ్ళటానికి ప్రయత్నించి కొంత మట్టి దుమ్ము తీసుకు వస్తారు, మరియు మీరు చెప్తారు "ఇప్పుడు నేను... మనము విజయవంతం అయ్యాము." అంతే. కానీ మీరు తీవ్రంగా అక్కడకు వెళ్లాలనుకుంటే, అప్పుడు మీరు ఈ జీవితంలో మిమ్మల్ని సిద్ధం చేసుకోవాలి. ఈ చంద్రుడు మరియు సూర్యుడు మరియు ఇతర ఈ లోకములను సృష్టించిన దేవాదిదేవుడిని ప్రార్థించండి, అతడు మిమ్మల్ని యోగ్యముగా చేస్తాడు, వెళ్లడానికి అర్హత పొందేటట్లు చేస్తాడు. మీరు సూర్య గ్రహానికి వెళ్ళలేరు. ఇది చాలా చాలా వేడిగా ఉంటుంది. అధిక ఉష్ణోగ్రతతో ఉంటుంది అదేవిధముగా, చంద్ర లోకములో చాలా చాలా చల్లగా ఉంటుంది. మీరు ఈ శరీరం తో ఎలా వెళ్తారు? ఈ శరీరం అంటే ఈ యంత్రం అని అర్థం.

అప్పుడు మీరు మరొక యంత్రాన్ని అంగీకరించాలి. అది పద్ధతి. అది పద్ధతి. అది భగవద్గీతలో చెప్పబడింది:

yānti deva-vratā devān
pitṟn yānti pitṛ-vratāḥ
bhūtejyā yānti bhūtāni
mad-yājino 'pi yānti mām
(BG 9.25)

ప్రతిదీ స్పష్టంగా అక్కడ పేర్కొనబడింది, మీరు ఉన్నత లోకాలకు వెళ్లాలనుకుంటే లేదా ఉన్నత గ్రహాల వ్యవస్థలోకి, అవి మీ ముందు ఉన్నాయి. మీరు వారిని చూడగలరు, సూర్యుని లోకము అక్కడ ఉందని; కానీ మీరు ఎంతో అనర్హులుగా ఉన్నారు, అక్కడికి వెళ్ళలేరు. కానీ విషయం అక్కడ ఉంది. ఇది కల్పితం కాదు. అక్కడ ఉష్ణోగ్రత ఉంది, శాస్త్రము యొక్క వివరణ, yac-cakṣur eṣa savitā sakala-grahāṇāṁ (Bs. 5.52). సవితా అంటే సూర్యుడు. ఆయన అన్ని లోకముల యొక్క కన్ను, ఎందుకంటే సూర్యరశ్మి లేకుండా మీరు చూడలేరు. మీరు మీ కళ్ళ వలన చాలా గర్వముగా ఉన్నారు, కానీ సూర్యుడు లేనప్పుడు, మీరు గుడ్డివారు. అందువల్ల, yac-cakṣur eṣa savitā sakala-grahāṇāṁ. అన్ని లోకములలో, సూర్యకాంతి ఉంటే తప్ప మీరు చూడలేరు. మరియు సూర్యుని లోకము మీ ముందు ఉంది. ప్రతి ఉదయం మీరు సూర్యరశ్మిని పొందుతున్నారు. ఎందుకు మీరు అక్కడకు వెళ్లరు? అహ్? వెళ్ళండి. మీకు మంచి 747 ఉంది. (నవ్వు) అది మీరు చేయలేరు. అప్పుడు మీరు ప్రార్థన చేయాలి. ఈశ్వర, కృష్ణుడు, నీ హృదయంలోనే ఉన్నాడు, మీరు తీవ్రంగా ప్రార్థిస్తే ఆయన చాలా దయ కలిగిన వాడు. అందువలన ఆయన మీకు వివిధ రకాల వాహనాలను ఇస్తాడు. Bhrāmayan sarva-bhūtāni yantrārūḍhāni māyayā ( BG 18.61) భ్రామయన్ అనగా ప్రతి లోకము లో, అన్ని ప్రాణులలో అతనిని తిరుగుతూ ఉండేటట్లు చేయడం. సర్వ-భూతాని: అన్ని ప్రాణులలో. విభిన్న రకాల పక్షులు, వివిధ రకాల జంతువులు, వివిధ రకాల మానవులు ఉన్నారు. ఇది విచిత్ర అని పిలవబడుతుంది రకాలు, భగవంతుని సృష్టిలో రకాలు.

కాబట్టి మీరు ఈ భౌతిక ప్రపంచంలో ఎక్కడికైనా వెళ్లాలనుకుంటే లేదా ఈ భౌతిక ప్రపంచం దాటి, ఈ భౌతిక ప్రపంచం దాటి: paras tasmāt tu bhāvo 'nyo 'vyakto 'vyaktāt sanātanaḥ ( BG 8.20) కృష్ణుడు మీకు సమాచారాన్ని అందింస్తున్నారు, అది మరొక భౌతిక ప్రకృతి ఉందని కాదు. అది ఆధ్యాత్మిక ప్రకృతి. ఉదాహరణకు మనకు ఈ అనుభవము ఉన్నట్లు, మనము వేరే ఎక్కడికైనా వెళ్ళలేము అయినప్పటికీ, కానీ మనము చూస్తున్నాము, భూగోళశాస్త్రం అధ్యయనం చేస్తూ, అనేక, వందల, వేలాది, లక్షల లోకములు ఉన్నాయని తెలుసుకుంటున్నాము. అదేవిధముగా, మరొక ప్రకృతి ఉంది. అలాగే, అక్కడ కూడా ఉన్నాయి. ఒకే విధముగా - ఒకే విధముగా కాదు; అది ఈ భౌతిక ప్రపంచంలో కంటే మూడు రెట్లు ఎక్కువ. ఇది భగవంతుని సృష్టిలో ఒక్క భాగం మాత్రమే.

atha vā bahunaitena
kiṁ jñātena tavārjuna
viṣṭabhyāham idaṁ kṛtsnam
ekāṁśena sthito jagat
(BG 10.42)