TE/Prabhupada 0868 - మనము ఈ భయంకర పరిస్థితిని తప్పించుకుంటున్నాము. మీరు ఆనందమును తప్పించుకుంటున్నారు: Difference between revisions

 
m (Text replacement - "(<!-- (BEGIN|END) NAVIGATION (.*?) -->\s*){2,}" to "<!-- $2 NAVIGATION $3 -->")
 
Line 9: Line 9:
[[Category:Telugu Language]]
[[Category:Telugu Language]]
<!-- END CATEGORY LIST -->
<!-- END CATEGORY LIST -->
<!-- BEGIN NAVIGATION BAR -- TO CHANGE TO YOUR OWN LANGUAGE BELOW SEE THE PARAMETERS OR VIDEO -->
<!-- BEGIN NAVIGATION BAR -- DO NOT EDIT OR REMOVE -->
{{1080 videos navigation - All Languages|French|FR/Prabhupada 0867 - Nous sommes éternels et nous sommes responsables de nos activités. C'est la connaissance|0867|FR/Prabhupada 0869 - La population est pleine des insensé occupé . Donc nous créons les paresseux Intelligent|0869}}
{{1080 videos navigation - All Languages|Telugu|TE/Prabhupada 0867 - మనము శాశ్వతంగా ఉన్నాము మన కార్యక్రమాలకు బాధ్యత వహిస్తున్నాము. అది జ్ఞానం|0867|TE/Prabhupada 0869 - జనులు మూర్ఖంగా తీరిక లేకుండా ఉన్నారు. మనము సోమరి తెలివైన వారిని తయారు చేస్తున్నాము|0869}}
<!-- END NAVIGATION BAR -->
<!-- END NAVIGATION BAR -->
<!-- BEGIN ORIGINAL VANIQUOTES PAGE LINK-->
<!-- BEGIN ORIGINAL VANIQUOTES PAGE LINK-->
Line 20: Line 20:


<!-- BEGIN VIDEO LINK -->
<!-- BEGIN VIDEO LINK -->
{{youtube_right|hYSknEw-hrw|మనము ఈ భయంకర పరిస్థితిని తప్పించుకుంటున్నాము. మీరు ఆనందమును తప్పించుకుంటున్నారు  <br />- Prabhupāda 0868}}
{{youtube_right|bf1-LEyFrtk|మనము ఈ భయంకర పరిస్థితిని తప్పించుకుంటున్నాము. మీరు ఆనందమును తప్పించుకుంటున్నారు  <br />- Prabhupāda 0868}}
<!-- END VIDEO LINK -->
<!-- END VIDEO LINK -->



Latest revision as of 23:45, 1 October 2020



750629 - Morning Walk - Denver


మనము ఈ భయంకర పరిస్థితిని తప్పించుకుంటున్నాము. మీరు ఆనందమును తప్పించుకుంటున్నారు

ప్రభుపాద: మనము నిర్మించబోవటము లేదు. అది తప్పించుకోవటమా, లేదా అది తెలివా, మీరు కష్టపడి పనిచేసి, నాకు ఇవ్వండి, మేము ఆనందిస్తాము? ఇది బుద్ధి; అది పారిపోవడము కాదు. అది జరుగుతోంది. పెట్టుబడిదారులు, వారు కర్మాగారములో ఈ మూర్ఖులను, గాడిదలను నిమగ్నము చేస్తున్నారు, మరియు వారు జీవితమును ఆనందిస్తున్నారు. ఇది బుద్ధి. అది పారిపోవడము కాదు.

మీకు జింక మరియు నక్క యొక్క కథ తెలుసా? (నవ్వుతున్నారు) నక్క బావిలో నీటిలో పడిపోయింది. కాబట్టి దాని వల్ల కాలేదు..., బయటకు రావడం సాధ్యం కాలేదు. కాబట్టి ఒక జింక వచ్చింది. "ఏమిటి...?" ఓ, ఇది చాలా బాగుంది. నేను నృత్యం చేస్తున్నాను. మీరు చూడండి? ఇది చాలా బాగుంది. అందువలన అది కూడా పడిపోయింది. జింక పడిపోయిన వెంటనే, నక్క జింక తల పైకి ఎక్కి బయటకు వచ్చింది. కాబట్టి అది బుద్ధి, "ఈ మూర్ఖుడిని బాగా కష్టపడనివ్వండి మనకు ఒక చక్కని ఉద్యానవనం తయారు చేయనిద్దాము, మనము దాని ప్రయోజనము తీసుకుందాము. "ఇది బుద్ధి. దీనిని అజగర-వృత్తి అని అంటారు. Ajāgara-vṛtti. అజగర అంటే... గొప్ప పామును అజగర అని అంటారు. ఈ ఎలుక, అది రంధ్రం తయారు చేసి అక్కడ నివసించాలి అని అనుకుంటుంది. మరియు అది సౌకర్యవంతంగా జీవిస్తుంటుంది. అ సమయంలో, అజగర వస్తుంది. అది ఎలుకను తింటుంది మరియు సౌకర్యవంతంగా నివసిస్తుంది. కాబట్టి మన పని అజగర వృత్తి. మీరు రంధ్రం కోసం, సౌకర్యవంతంగా జీవించడానికి పని చేస్తారు, కానీ మేము ఇంటిని స్వాధీనము చేసుకొని సౌకర్యవంతముగా నివసిస్తాము. (విరామం) లాస్ ఏంజిల్స్, దుకాణదారులు, వారు మన వ్యక్తులను అడుగుతారు "మీరు పని చేయరు. మీరు చాలా సౌకర్యవంతంగా నివసిస్తున్నారు. చాలా కష్టపడి పని చేసినా మేము అంత సౌకర్యవంతంగా నివసించడము లేదు. " "మీరు వచ్చి, మాతో కలవండి" అని అడిగిన వెంటనే, "వారు రారు, మేము ఈ విధముగానే పని చేస్తాము." మనము ప్రతి ఒక్కరినీ అడుగుతున్నాము, "ఇక్కడకు రండి", కానీ వారు రారు. అంటే, వారు అసూయతో ఉన్నారు. అందువల్ల వారు అంటున్నారు తప్పించుకుంటున్నారు అని, "వారు ఇతరుల ధనముతో చాలా సౌకర్యముగా జీవిస్తున్నారు." అది వారి అసూయ. వారు చూస్తున్నారు, "వారికి చాలా కార్లు ఉన్నాయి, వారి ముఖం ప్రకాశవంతముగా ఉన్నది, వారు చక్కగా తింటున్నారు, వారికి ఎటువంటి సమస్య లేదు. "కాబట్టి వారు అసూయతో ఉన్నారు.

హరికేస్సా: వారు ఎలా చేస్తారో తెలుసుకుంటే వారు వెంటనే చేస్తారు.

ప్రభుపాద: ఎహ్?

హరికేస్సా: వారికి ఎలా చేయాలో తెలిస్తే, వెంటనే వారు కూడా చేస్తారు.

ప్రభుపాద: లేదు, మనము వారిని ఆహ్వానిస్తున్నాము, "ఇక్కడకు రండి." ఎందుకు వారు రావటము లేదు? ఇది వారికి కష్టం. హరే కృష్ణ కీర్తన చేయడము మరియు నృత్యం చేయడము, ఓ, వారికి ఇది చాలా పెద్ద, భారీ పని. వారు రారు. అత్యంత కష్టమైన విషయము ఏమిటంటే, వారు ఇక్కడకు వచ్చిన వెంటనే, వారికీ తెలుసు ఇక్కడ టీ ఉండదు అని ఏ మద్యము ఉండదు, ఏ మాంసము ఉండదు, ఏ సిగరెట్ ఉండదు, ", చాలా ఉండవు? ఓ." ఆ డ్రాఫ్ట్ మాన్ అన్నాడు? ఒక డ్రాఫ్ట్ మాన్ వచ్చి విచారణ చేసాడు అబ్బాయిలలో కొందరు, డ్రాఫ్ట్ మాన్ పని నుండి తప్పించుకోవడానికి, వారు ఈ హరే కృష్ణ ఉద్యమంలో చేరారు. అక్కడ సౌకర్యము ఏమి ఉంది? వారు చేరినారు అక్కడకు వెళ్ళే బదులు... అందువలన అధ్యయనం చేసినప్పుడు ఆయన మాంసం లేదని ఏ మద్యం లేదని, ధూమపానం లేదని, అక్కడ జూదం లేదని, అందువలన ఆయన చెప్పాడు, "ఇది మరింత కష్టం, అయినప్పటికీ, వారు వచ్చారు." ఇది వెళ్ళి పోరాడటము కంటే మరింత కష్టం. కాబట్టి ఇది ఎలా అద్భుతమైనది. వాస్తవానికి, కర్మిలకు ఇది చాలా కష్టమైన పని. ప్రభువు జెట్లాండ్ కూడా చెప్పాడు, ఆయన ఇలా అన్నాడు," దీన్ని చేయటం సాధ్యం కాదు." వాస్తవానికి, ఇది అసాధ్యం. ఇది...డాక్టర్ ప్రొఫెసర్ జుడా యొక్క ఆరాధన, ఈ మాదక ద్రవ్య బానిస పిల్లలు, వారు ఎలా కృష్ణ చైతన్య వ్యక్తులు అయ్యారు అని? అది ఆయనకు అద్భుతమైన విషయము. మనము ఈ భయంకర పరిస్థితిని తప్పించుకుంటున్నాము అని చెప్పవచ్చు: మాంసం తినడం, మద్యపానం మరియు మత్తును. మనము తప్పించుకుంటున్నాము, ఈ విషయములను, సంతోషాన్ని తప్పించు కోవడము లేదు. మీరు ఆనందాన్ని తప్పించుకుంటున్నారు. హరే రామా హరే రామా...

సత్స్వరూపా: మానసిక నిపుణుడు చెప్పుతున్నారు వాస్తవమైన బాధ్యత మైథున జీవితాన్ని ఆస్వాదించడమేనని, ఆ విధముగా, మనము...

ప్రభుపాద: కానీ ఆ పంది కూడా ఆనందిస్తుంది. అప్పుడు మీకు పందికి మధ్య ఉన్న తేడా ఏమిటి? పంది అపరిమితంగా ఆనందిస్తుంది. పిల్లులు మరియు కుక్కలు కూడా ఆనందిస్తాయి. కాబట్టి మానవుడు, నాగరిక వ్యక్తి కావడము వలన ప్రయోజనము ఏమిటి? ఆ ఆనందం పంది జీవితములో మెరుగైన మార్గంలో ఉంది. మీరు కొంత వివక్ష కలిగి ఉన్నారు, "ఇక్కడ నా సోదరి, ఇక్కడ నా తల్లి, ఇక్కడ నా కూతురు ఉంది అని" కానీ అటువంటి వ్యత్యాసం లేదు. మీరు జీవితం ఆనందించండి మరియు ఒక పందిగా మారండి, అది మీ కోసం వేచి ఉంది, తదుపరి జీవితం.