TE/Prabhupada 0896 - మనము అమ్ముతున్నాము, అది కృష్ణ చైతన్యము: Difference between revisions

 
m (Text replacement - "(<!-- (BEGIN|END) NAVIGATION (.*?) -->\s*){2,}" to "<!-- $2 NAVIGATION $3 -->")
 
Line 9: Line 9:
[[Category:Telugu Language]]
[[Category:Telugu Language]]
<!-- END CATEGORY LIST -->
<!-- END CATEGORY LIST -->
<!-- BEGIN NAVIGATION BAR -- TO CHANGE TO YOUR OWN LANGUAGE BELOW SEE THE PARAMETERS OR VIDEO -->
<!-- BEGIN NAVIGATION BAR -- DO NOT EDIT OR REMOVE -->
{{1080 videos navigation - All Languages|French|FR/Prabhupada 0895 - Un dévot ne prend jamais une position dangereuse comme une position très calamiteux. il l'accueille|0895|FR/Prabhupada 0897 - Si vous restez dans la conscience de Krishna, c'est votre avantage|0897}}
{{1080 videos navigation - All Languages|Telugu|TE/Prabhupada 0895 - భక్తుడు చాలా ప్రమాదకరమైన స్థితిని దుఃఖకరమైన పరిస్థితిగా తీసుకోడు. ఆయన స్వాగతిస్తాడు|0895|TE/Prabhupada 0897 - మీరు కృష్ణ చైతన్యములో ఉంటే, అది మీ ప్రయోజనము|0897}}
<!-- END NAVIGATION BAR -->
<!-- END NAVIGATION BAR -->
<!-- BEGIN ORIGINAL VANIQUOTES PAGE LINK-->
<!-- BEGIN ORIGINAL VANIQUOTES PAGE LINK-->
Line 20: Line 20:


<!-- BEGIN VIDEO LINK -->
<!-- BEGIN VIDEO LINK -->
{{youtube_right|Zns-U_x5ETE|మనము అమ్ముతున్నాము, అది కృష్ణ చైతన్యము  <br />- Prabhupāda 0896}}
{{youtube_right|wWfaMwrVQYE|మనము అమ్ముతున్నాము, అది కృష్ణ చైతన్యము  <br />- Prabhupāda 0896}}
<!-- END VIDEO LINK -->
<!-- END VIDEO LINK -->



Latest revision as of 23:46, 1 October 2020



730417 - Lecture SB 01.08.25 - Los Angeles


మనము అమ్ముతున్నాము, అది కృష్ణ చైతన్యము Tyaktvā dehaṁ punar janma naiti mām eti kaunteya ( BG 4.9) మీరు కృష్ణ చైతన్యములో పురోగమిస్తే, అప్పుడు ఫలితం ఉంటుంది, ఈ శరీరాన్ని వదలి వేసిన తర్వాత... కృష్ణుడు చెప్పారు, tyaktvā deham, ఈ శరీరమును వదలి వేసిన తరువాత , punar janma naiti, మీరు ఈ భౌతిక ప్రపంచంలో తిరిగి జన్మించరు. అది కావలసినది. ప్రస్తుత క్షణం నేను చాలా సౌకర్యంగా ఉన్నాను అని అనుకుందాం. నా శరీరం చాలా సౌకర్యవంతమైన పరిస్థితిలో ఉంచబడింది, కానీ మరణం ఉంది, మరొక జన్మ ఉంది. ఈ శరీరం వదలి వేసిన తర్వాత, నేను ఒక పిల్లి మరియు కుక్క శరీరమును పొంది ఉంటే, ఈ సౌకర్యవంతమైన పరిస్థితి యొక్క అర్థం ఏమిటి? మరణం పరిపూర్ణంగా ఉంది కనుక , janmāntaṁ, tataḥ dehāntaram. dehāntaram ఇంకొక శరీరాన్ని మీరు అంగీకరించాలి. మీరు ఏ విధమైన శరీరాన్ని మీరు పొందబోతున్నారో మీకు తెలియక పోతే... మీరు తెలుసుకోవచ్చు. దానిని శాస్త్రములో పేర్కొన్నారు. మీరు ఎటువంటి మనస్తత్వమును కలిగి ఉంటారో, మీరు అటువంటి శరీరమును పొందుతారు కాబట్టి ఒక సౌకర్యవంతమైన పరిస్థితి లో, నేను కుక్క యొక్క మనస్తత్వమును నేను కలిగి ఉంటే, నేను కుక్కగా నా తదుపరి జీవితాన్ని పొందబోతున్నాను. అప్పుడు ఈ సౌకర్యవంతమైన పరిస్థితి యొక్క విలువ ఏమిటి? నేను ఇరవై సంవత్సరాలు, యాభై సంవత్సరాలు, లేదా వందల సంవత్సరాలుగా సౌకర్యవంతమైన స్థితిలో ఉండవచ్చు. ఆ సౌకర్యవంతమైన పరిస్థితి తర్వాత, నేను ఈ శరీరం వదలి వేసిన తరువాత, నా మనస్తత్వం కారణంగా, నేను పిల్లి కుక్క ఎలుక అయితే, ఈ సౌకర్యవంతమైన పరిస్థితి యొక్క ప్రయోజనము ఏమిటి?

ఈ వ్యక్తులకు అది తెలియదు. వారు ముఖ్యంగా ఈ యుగములో భావిస్తారు: నేను ఇప్పుడు సౌకర్యవంతమైన పరిస్థితిలో ఉన్నాను. నాకు తగినంత డబ్బు ఉంది. నాకు తగినంత ఎస్టేట్ ఉంది. నేను తగినంత సుఖాలు, తగినంత ఆహారం కలిగి వున్నాను. శరీరం ముగిసిన వెంటనే, నేను మళ్ళీ జన్మ తీసుకోవాలని అనుకోవడము లేదు. నేను జీవించి నంత కాలము, నేను జీవితాన్ని ఆస్వాదిస్తాను. " ఇది ఆధునిక తత్వము, హేడొనిజము. కానీ వాస్తవం కాదు. కుంతీ అందువలన ఆత్రుతగా ఉంది: apunar bhava-darśanam ( SB 1.8.25) Apunar bhava, తిరిగి చెప్పడము కాదు. మీరు ఎల్లప్పుడూ కృష్ణుని చూస్తే, అది కృష్ణ చైతన్యము. కృష్ణ చైతన్యము అంటే ఎల్లప్పుడూ కృష్ణుని గురించి ఆలోచించడము అని అర్థం. కృష్ణుడి ఆలోచనలో మీ చైతన్యం నిమగ్నమై ఉండాలి.

అందువల్ల వివిధ రకాలైన నిమగ్నమును కలిగి ఉన్నాము, కృష్ణ చైతన్యములో. మన శక్తిని మళ్ళించకూడదు. ఇప్పుడు మన పుస్తకాలను విక్రయిస్తున్నప్పుడు... ఇది కృష్ణ చైతన్యము; మనము పుస్తకం అమ్ముతున్నాము. కానీ పుస్తకాన్ని అమ్మే బదులు ఆభరణాలను విక్రయించాలని మనము భావిస్తే, ఇది చాలా మంచి ఆలోచన కాదు. ఇది మంచి ఆలోచన కాదు. అప్పుడు మనము మళ్ళీ స్వర్ణకారుడు అవుతాము. Punar mūṣika bhava. మళ్ళీ ఎలుకగా మారుతాము. మనము చాలా జాగ్రత్తగా ఉండాలి. మన కృష్ణ చైతన్యమును మళ్లించకూడదు. అప్పుడు మీరు నరకమునకు పోతారు. ప్రమాదం కూడా ఉంది, కృష్ణ చైతన్యము లో బాధ కూడా ఉంది, మనము సహించాలి. ఇదే ఆదేశం... అటువంటి ప్రమాదాన్ని మనము స్వాగతించాలి. కృష్ణుడిని ప్రార్థించాలి. ఆ ప్రయోజనము ఏమిటి? Tat te 'nukampāṁ su-samīkṣamāṇaḥ ( SB 10.14.8) నా ప్రియమైన ప్రభు, నేను ఈ అపాయకరమైన స్థితిలో పెట్టబడటము మీ యొక్క గొప్ప దయ. ఇది భక్తుల దృక్కోణం. ప్రమాదాన్ని అతడు ప్రమాదముగా తీసుకోడు. ఆయన తీసుకుంటాడు: "ఇది కృష్ణుని యొక్క దయ." ఏ రకమైన దయ? ఇప్పుడు bhuñjāna evātma-kṛtaṁ vipākam. నా గత కార్యక్రమాల కారణంగా, నేను చాలా బాధలు పడవలసి ఉంది. కానీ నీవు ఆ బాధను ఉపశమనం చేస్తున్నావు, నాకు కొంచము బాధను ఇస్తున్నావు. "