TE/Prabhupada 0898 - నేను భక్తునిగా అయినందు వల్ల, ఎటువంటి ప్రమాదం ఉండదు. ఏ బాధా లేదు. కాదు: Difference between revisions

 
m (Text replacement - "(<!-- (BEGIN|END) NAVIGATION (.*?) -->\s*){2,}" to "<!-- $2 NAVIGATION $3 -->")
 
Line 9: Line 9:
[[Category:Telugu Language]]
[[Category:Telugu Language]]
<!-- END CATEGORY LIST -->
<!-- END CATEGORY LIST -->
<!-- BEGIN NAVIGATION BAR -- TO CHANGE TO YOUR OWN LANGUAGE BELOW SEE THE PARAMETERS OR VIDEO -->
<!-- BEGIN NAVIGATION BAR -- DO NOT EDIT OR REMOVE -->
{{1080 videos navigation - All Languages|French|FR/Prabhupada 0897 - Si vous restez dans la conscience de Krishna, c'est votre avantage|0897|FR/Prabhupada 0899 - Dieu signifie sans concours: Un. Dieu est Un. Personne n'est plus grand que lui|0899}}
{{1080 videos navigation - All Languages|Telugu|TE/Prabhupada 0897 - మీరు కృష్ణ చైతన్యములో ఉంటే, అది మీ ప్రయోజనము|0897|TE/Prabhupada 0899 - భగవంతుడు అంటే పోటీ లేకుండా : ఒకరే. భగవంతుడు ఒకడే. ఎవరూ ఆయన కంటే గొప్పవారు కాదు|0899}}
<!-- END NAVIGATION BAR -->
<!-- END NAVIGATION BAR -->
<!-- BEGIN ORIGINAL VANIQUOTES PAGE LINK-->
<!-- BEGIN ORIGINAL VANIQUOTES PAGE LINK-->
Line 20: Line 20:


<!-- BEGIN VIDEO LINK -->
<!-- BEGIN VIDEO LINK -->
{{youtube_right|Ylc5T4Yb610|నేను భక్తునిగా అయినందు వల్ల, ఎటువంటి ప్రమాదం ఉండదు. ఏ బాధా లేదు. కాదు  <br />- Prabhupāda 0898}}
{{youtube_right|MlWuBYtRJEk|నేను భక్తునిగా అయినందు వల్ల, ఎటువంటి ప్రమాదం ఉండదు. ఏ బాధా లేదు. కాదు  <br />- Prabhupāda 0898}}
<!-- END VIDEO LINK -->
<!-- END VIDEO LINK -->



Latest revision as of 23:45, 1 October 2020



730417 - Lecture SB 01.08.25 - Los Angeles


నేను భక్తునిగా అయినందు వల్ల, ఎటువంటి ప్రమాదం ఉండదు. ఏ బాధా లేదు. కాదు. ప్రభుపాద: కృష్ణ చైతన్యము ఏ పరిస్థితులలోను కలవరపడకూడదు. చాలా బాధ వున్నప్పుడు కూడా. ఇది కుంతీదేవి ఉపదేశము. కుంతీదేవి యొక్క స్వాగతం, స్వాగతించే: vipadah santu tah tatra ta.... ఉండనిమ్ము... ఎందుకంటే కురుక్షేత్ర యుద్ధం గెలిచే ముందు, ఈ పాండవులందరూ చాలా ప్రమాదకరమైన పరిస్థితులలో ఉంచబడ్డారు. ఇది ఇప్పటికే మునపటి శ్లోకాల్లో వివరించబడినది. కొన్నిసార్లు వారికి విషం ఇవ్వబడింది, కొన్నిసార్లు లక్క ఇంట్లో ఉంచబడ్డారు, డానికి నిప్పంటించారు. కొన్నిసార్లు గొప్ప, గొప్ప రాక్షసులు, మనిషిని తినేవారు, ఇంకా గొప్ప గొప్ప యోధులు ప్రతిసారీ.... వారు తమ రాజ్యాన్ని కోల్పోయారు, వారి భార్యను కోల్పోయారు, వారి గౌరవాన్ని కోల్పోయారు. వారిని అడవిలో ఉంచారు, పూర్తిగా ప్రమాదాలలో కానీ ఆ ప్రమాదాలన్నిటిలో, కృష్ణుడు ఉన్నాడు, అన్ని ప్రమాదాలలో ద్రౌపది ని నగ్నంగా ఉంచాలనుకున్నపుడు, కృష్ణుడు వస్త్రం సరఫరా చేస్తున్నాడు.కృష్ణుడు ఎల్లప్పుడూ ఉంటాడు.

అందువల్ల భీష్మదేవుడు ఆయన మరణిస్తున్న సమయంలో.... ఆయన పాండవులకు తాత. అందువల్ల పాండవులు అతడు మరణశయ్య పైన ఉన్నప్పుడు చూడటానికి వచ్చాక, అందువలన ఆయన బాధపడుతూ: "ఈ అబ్బాయిలు, నా మనుమలు, వారందరు చాలా పవిత్రత కలిగిన వారు. యుదిష్ఠర మహారాజు, అత్యుత్తమ పవిత్ర వ్యక్తి. అతడి పేరు ధర్మరాజు, ధర్మమునకు రాజు. అతడు మొదటి సోదరుడు. భీముడు అర్జునుడు వారు భక్తులు, అందువలన గొప్ప నాయకుడు. వారు వేలాది మందిని చంపగలరు. వారు చాలా శక్తివంతులు. కాబట్టి యుదిష్ఠర, యుదిష్ఠర ఉన్నాడు, భీముడు ఉన్నాడు. అర్జునుడు ఉన్నాడు, ఇంక ద్రౌపది సాక్షాత్తు లక్ష్మీదేవి. శాస్త్రంలో ఉంది ఎక్కడైతే ద్రౌపది ఉంటుందో, ఆహారపు కొరత ఉండదు. ఈ విధముగా, కలయిక చాలా బాగుంది ఇంకా వీటన్నింటికీ పైన కృష్ణుడు ఎల్లప్పుడూ వారితో వున్నాడు, ఇంకా వారు బాధపడుతున్నారు.అందువల్ల ఆయన బాధపడుతున్నాడు: "కృష్ణుని యొక్క అమరిక ఏమిటి అని నాకు తెలియదు. అటువంటి పవిత్రమైన వారు, అటువంటి భక్తులు, వారు కూడా బాధపడుతున్నారు”.

కాబట్టి అలా భావించవద్దు: “నేను భక్తుడిని అయ్యాను కాబట్టి నాకు ఎటువంటి ప్రమాదం ఉండదు, బాధ ఉండదు”. ప్రహ్లాద మహారాజు చాలా బాధలు పడ్డాడు. పాండవులు చాలా బాధలు పడ్డారు. హరి దాస ఠాకురా చాలా బాధలు పడ్డాడు. కానీ ఆ బాధల వల్ల మనము కలవరపడకూడదు. మనకు దృఢమైన విశ్వాసము ఉండాలి, దృఢమైన నమ్మకాన్ని కలిగి ఉండాలి: "కృష్ణుడు ఉన్నాడు. నాకు రక్షణ ఇస్తాడు". Kaunteya pratijanihi na me bhaktah pranasyati ( BG 9.31) కృష్ణుడి కంటే వేరే ఇతర ఆశ్రయము పొందటానికి ప్రయత్నించవద్దు. ఎల్లప్పుడూ కృష్ణుడిని తీసుకోండి.

కృష్ణుడు చెప్పారు: Kaunteya pratijanihi na me bhaktah pranasyati. నా ప్రియమైన అర్జునా, నా భక్తుడెన్నడునూ నశింపడని ధైర్యముగా ప్రకటింపుము. అర్జునుడికి ప్రకటన చేయమని ఎందుకు సలహా ఇచ్చారు! ఎందుకు అంటే ఆయన స్వయంగా ప్రకటించలేదు? ఏదో విషయం ఉంది. ఎందుకంటే ఈ ప్రకటన, కృష్ణుడు చేస్తే, ఉల్లంఘన ఉండవచ్చు ఎందుకంటే ఆయన కొన్నిసార్లు తన వాగ్దానాన్ని ఉల్లంఘించాడు. కానీ ఆయన భక్తుడు వాగ్దానం చేస్తే, అది ఎప్పుడూ ఉల్లంఘించబడదు. అది కృష్ణుడి కర్తవ్యము. ఓ, ఈ నా భక్తుడు ప్రకటించాడు. అది తప్పక అమలు చేయబడుట నేను చూడాలి. ఇది కృష్ణుడి స్థితి. ఆయన ఆ భక్తుని పట్ల ఎంతో ప్రేమను కలిగి ఉంటాడు. అందుకే ఆయన చెప్పాడు: “నీవు ప్రకటించు. నేను ప్రకటించినట్లయితే, జనులు దీనిని విశ్వసించరు. కానీ నీవు ప్రకటించినట్లయితే, వారు దీన్ని విశ్వసిస్తారు. ఎందుకంటే నీవు భక్తుడవు. నీ ప్రకటన ఎప్పటికీ.....

Yasya prasadad bhagavat - prasadah. కృష్ణుడు దానిని చూడాలని కోరుకుంటున్నాడు: “నా భక్తుని వాగ్దానం నెరవేరింది. నా వాగ్దానం నెరవేరకపోవచ్చు, విరిగిపోవచ్చు”. కాబట్టి ఇది కృష్ణ చైతన్యము. మనం కృష్ణ చైతన్యమును ఎప్పుడూ అంటిపెట్టుకుని ఉండాలి, అన్ని పరిస్థితులలోను, చాలా ప్రమాదకర పరిస్థితిలో అయినా కూడా. కృష్ణుని పాద పద్మముల పై మనము విశ్వాసమును ఉంచాలి, ఎటువంటి ప్రమాదము ఉండదు.

చాలా ధన్యవాదములు.

భక్తుడు: జయ శ్రీల ప్రభుపాద!