TE/Prabhupada 0909 - నా గురు మహా రాజు యొక్క ఉత్తర్వుని నెరవేర్చడానికి నేను ఈ స్థానానికి తీసుకు రాబడ్డాను: Difference between revisions

 
m (Text replacement - "(<!-- (BEGIN|END) NAVIGATION (.*?) -->\s*){2,}" to "<!-- $2 NAVIGATION $3 -->")
 
Line 9: Line 9:
[[Category:Telugu Language]]
[[Category:Telugu Language]]
<!-- END CATEGORY LIST -->
<!-- END CATEGORY LIST -->
<!-- BEGIN NAVIGATION BAR -- TO CHANGE TO YOUR OWN LANGUAGE BELOW SEE THE PARAMETERS OR VIDEO -->
<!-- BEGIN NAVIGATION BAR -- DO NOT EDIT OR REMOVE -->
{{1080 videos navigation - All Languages|French|FR/Prabhupada 0908 - Je peux essayer de devenir heureux, mais si Krishna ne sanctionne pas, je ne serai jamais heureux|0908|FR/Prabhupada 0910 - Nous essayerons toujours d'être dominés par Krishna. C'est la réussite de la vie|0910}}
{{1080 videos navigation - All Languages|Telugu|TE/Prabhupada 0908 - నేను సంతోషంగా ఉండటానికి ప్రయత్నించవచ్చు కృష్ణుడు మంజూరు చేయకపోతే సంతోషంగా ఉండలేను|0908|TE/Prabhupada 0910 - ఎల్లప్పుడూ కృష్ణుని నిర్దేశమును పాటించడానికి ప్రయత్నించవలెను. అది విజయవంతమైన జీవితం|0910}}
<!-- END NAVIGATION BAR -->
<!-- END NAVIGATION BAR -->
<!-- BEGIN ORIGINAL VANIQUOTES PAGE LINK-->
<!-- BEGIN ORIGINAL VANIQUOTES PAGE LINK-->
Line 20: Line 20:


<!-- BEGIN VIDEO LINK -->
<!-- BEGIN VIDEO LINK -->
{{youtube_right|UhCsX7Lphuc|నా గురు మహా రాజు యొక్క ఉత్తర్వుని నెరవేర్చడానికి నేను ఈ స్థానానికి తీసుకు రాబడ్డాను  <br/>- Prabhupāda 0909}}
{{youtube_right|zOijsVHNOO4|నా గురు మహా రాజు యొక్క ఉత్తర్వుని నెరవేర్చడానికి నేను ఈ స్థానానికి తీసుకు రాబడ్డాను  <br/>- Prabhupāda 0909}}
<!-- END VIDEO LINK -->
<!-- END VIDEO LINK -->



Latest revision as of 23:46, 1 October 2020



Lecture on SB 1.8.27 -- Los Angeles, April 19, 1973


నా గురు మహా రాజు యొక్క ఉత్తర్వుని నెరవేర్చడానికి నేను ఈ స్థానానికి బలవంతముగా తీసుకు రాబడ్డాను

ప్రభుపాద: కృష్ణుడు ఈ విధముగా అంటున్నారు: "నన్ను చేరుకోనడానికి ప్రయత్నిస్తున్నవారు ఎవరైనా కృష్ణ చైతన్య వంతులు కావాలని, అదే సమయంలో, అతడు భౌతికంగా సంతోషంగా ఉండాలని కోరుకుంటే, ఆతడు చాలా తెలివైనవాడు కాదు. "అంటే ఆయన తన సమయాన్ని వృధా చేసుకుంటున్నాడు. మన ప్రధాన కర్తవ్యము కృష్ణ చైతన్య వంతులుగా ఎలా మారాలి. ఇది మానవ జీవితం యొక్క ప్రధాన కర్తవ్యము. కానీ మనము మన సమయమును భౌతిక మెరుగుదల కోసం వృధా చేసుకుంటే, కీర్తన చేయడము, జపము చేయడము మర్చిపోయి, అప్పుడు అది నష్టం, గొప్ప నష్టం. అలాంటి మనస్తత్వం, కృష్ణుడు చెప్తున్నాడు: āmi vijña tare keno viṣaya diba. కాబట్టి ఈ మూర్ఖుడు భక్తి యుక్త సేవలను చేయడం ద్వారా నా నుండి కొంత భౌతిక అభివృద్ధిని కోరుతున్నాడు. నేను ఆయనకి ఎందుకు భౌతిక శ్రేయస్సును ఇవ్వాలి? అందుకు భిన్నముగా అతడి దగ్గర ఉన్నది ఏదైనా నేను దానిని తీసివేస్తాను. "(నవ్వు) అవును. ఇది నవ్వటము కాదు. అది తీసివేయబడినప్పుడు, మనము చాలా నిరాశ చెందుతాము. కానీ అదే పరీక్ష. ఇది కృష్ణుడిచే చెప్పబడింది యుధిష్ఠిర మహారాజకు : yasyāham anugṛhṇāmi hariṣye tad dhanaṁ śanaiḥ ( SB 10.88)

యుధిష్టర మహారాజు పరోక్షంగా కృష్ణుడిని ప్రశ్నించాడు: మేము మీ మీద పూర్తిగా ఆధారపడి ఉన్నాము, అయినప్పటికీ మేము భౌతికముగా ఎంతో బాధపడుతున్నాము, మా రాజ్యము తీసేసుకున్నారు, మా భార్యను అవమాన పరిచారు, మమ్మల్ని ఇంట్లో కాల్చడానికి ప్రయత్నించారు. " కాబట్టి కృష్ణుడు ఇలా అన్నాడు: "అవును అది నా మొదటి పని." Yasyāham anugṛhṇāmi hariṣye tad dhanaṁ śanaiḥ. నేను ప్రత్యేకంగా ఎవరినైనా అనుగ్రహిస్తే, అప్పుడు ఆయన ఆదాయ వనరులను నేను తీసివేస్తాను. చాలా ప్రమాదకరమైనది. అవును. నాకు ఈ సంబంధములో నేను ఆచరణాత్మక అనుభావన్ని కలిగి వున్నాను. అవును. ఇది కృష్ణుడి యొక్క ప్రత్యేకమైన కరుణ. నేను వివరించదలచుకోవడము లేదు, కానీ అది వాస్తవం. (నవ్వు) ఇది వాస్తవం. నేను ఇరవై అయిదు సంవత్సరాల వయస్సులో ఉన్నప్పుడు నా గురు మహా రాజు నాకు ఆదేశించారు: "మీరు వెళ్ళి ప్రచారము చేయండి." కానీ నేను ఇలా అనుకున్నాను: "మొదట, నేను ధనవంతుడను అవుతాను, ప్రచారము కోసము నేను ఆ డబ్బుని ఉపయోగిస్తాను. "

కాబట్టి అది సుదీర్ఘ చరిత్ర. వ్యాపారములో చాలా ధనవంతునిగా మారడానికి నాకు మంచి అవకాశం ఉన్నది. ఎవరో జ్యోతిష్కుడు నాతో ఇలా చెప్పాడు: "మీరు బిర్లా మాదిరి అవవలసి ఉన్నది." కాబట్టి కొన్ని అవకాశాలు చాలా మంచి అవకాశాలు ఉన్నాయి. నేను ఒక గొప్ప రసాయన కర్మాగారంలో మేనేజర్ ను. నేను నా సొంత కర్మాగారాన్ని ప్రారంభించాను, నా వ్యాపారము చాలా విజయవంతమయింది. కానీ ప్రతిదీ విచ్ఛిన్నమైంది. నా గురు మహా రాజ యొక్క నా ఆజ్ఞని అమలు చేయడానికి నేను ఈ స్థితిలోకి రావలసి వచ్చింది.

భక్తులు: జయ, హరిబోల్...

ప్రభుపాద: Akiñcana-vittāya. అంతా పూర్తయినప్పుడు, నేను కృష్ణుడిని తీసుకున్నాను, "నీవు మాత్రమే..." అందుచేత కృష్ణుడు అకించన-విత్త. ఒక వ్యక్తి తన భౌతిక సంపదలను అన్నిటిని పోగొట్టుకుంటే... ఇప్పుడు నేను కోల్పోలేదని అర్థము చేసుకుంటున్నాను, నేను లాభపడ్డాను. నేను లాభపడ్డాను. అది నిజం. కాబట్టి, కృష్ణుని కోసము భౌతిక ఐశ్వర్యమును కోల్పోవడము నష్టమేమీ కాదు, ఇది గొప్ప లాభం. అందువలన ఇది చెప్పబడింది: అకించన-విత్త. ఒకరు అకించన అయితే, తన దగ్గర ఏమీ లేకుండా, అంతా పోగొట్టుకొని, అప్పుడు కృష్ణుడు మాత్రమే ధనము అవుతాడు అలాంటి వ్యక్తికి. ఎందుకంటే అతను భక్తుడు. ఉదాహరణకు నరోత్తమ దాస ఠాకురా చెప్పినట్లుగా:

hā hā prabhu nanda-suta, vṛṣabhānu-sutā-juta
karuṇā karaha ei-bāra
narottama-dāsa koy, nā ṭheliha rāṅgā pāy
tomā bine ke āche āmāra.

ఈ స్థానం, ఆ: "కృష్ణా, నీవు కాకుండా, నాకు కోరుకోవడానికి ఏమీ లేదు. నాకు ఏమీ లేదు, ఏ సంపదను, ఏమి కలిగి లేను. కనుక నీవు నన్ను నిర్లక్ష్యం చేయవద్దు, ఎందుకంటే నిన్ను మాత్రమే నేను కలిగి ఉన్నాను. " ఈ స్థితి చాలా బాగుంది. ఏదైనా భౌతిక వస్తువు మీద ఆధారపడి ఉండకపోతే, కేవలం కృష్ణుడిపై ఆధారపడి ఉంటే. ఇది కృష్ణ చైతన్యము యొక్క మొదటి-తరగతి స్థానం. అందువల్ల కృష్ణుడిని సంభోధించారు: అకించన- విత్తాయా. ఒక వ్యక్తి భౌతికముగా పేదవాడు అయినప్పుడు, నీవు మాత్రమే సంపద. Akiñcana-vittāya. Namaḥ akiñcana-vitta, nivṛtta-guṇa-vṛttaye. దీని ఫలితమేమిటంటే ఒకరు నిన్ను మాత్రమే తన సంపదగా తీసుకుంటే, వెంటనే అతను ఈ భౌతిక ప్రకృతి యొక్క కార్యకలాపాలు నుండి విముక్తుడు అవుతాడు. " అంటే వెంటనే ఆయన పరమ సత్యము యొక్క ఆధ్యాత్మిక స్థానములో ఉంచబడుతాడు Akiñcana-vittāya nivṛtta-guṇa-vṛttaye, ātmārāmāya ( SB 1.8.27) ఆ సమయంలో, అతను మీతో సంతోషంగా ఉంటాడు,E209 మీరు కృష్ణుడి వలె, మీరు మీతో సంతోషముగా ఉన్నట్లుగా