TE/Prabhupada 0911 - మీరు భగవంతుణ్ణి నమ్మితే, మీరు అన్ని జీవుల పట్ల సమానముగా దయను కలిగి ఉండాలి

Revision as of 01:29, 4 November 2017 by Kamalakar (talk | contribs) (Created page with "<!-- BEGIN CATEGORY LIST --> Category:1080 Telugu Pages with Videos Category:Telugu Pages - 207 Live Videos Category:Prabhupada 0911 - in all Languages Category:...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


730420 - Lecture SB 01.08.28 - Los Angeles


మీరు భగవంతుణ్ణి నమ్మితే, మీరు అన్ని జీవుల పట్ల సమానముగా దయను కలిగి ఉండాలి అనువాదం: "నా ప్రభు, నేను మిమ్మల్ని అనంతమైన కాలముగా భావిస్తున్నాను, దివ్య నియామకునిగను, ఆద్యంతములు లేనివానిగను, సర్వవ్యాపిగను, మీ కరుణను పంచడము ద్వారా, మీరు నిష్పక్షపాతుడవై అందరికీ సమానముగా ఉన్నావు. జీవుల మధ్య విభేదాలు వారి పరస్పర సాంగత్యం చేతనే కలుగుచున్నవి. " ప్రభుపాద: భగవద్గీతలో కృష్ణుడు సరిగ్గా ఇదే మాట చెప్తున్నాడు. ఇది కుంతీదేవిచే వివరించబడింది, ఆమె ఒక భక్తురాలు అదే విషయమును భగవంతుడే తనకు తానుగా మాట్లాడినాడు. Samo 'haṁ sarva-bhūteṣu na me dveṣyo 'sti na priyaḥ, ye tu bhajanti māṁ bhaktyā teṣu te mayi ( BG 9.29) భగవంతుడు పక్షపాతమును కలిగి ఉండడు. అది సాధ్యం కాదు. ప్రతి ఒక్కరూ భగవంతుని కుమారులు. కాబట్టి భగవంతుడు ఒక కుమారునికి పక్షపాతము కలిగిన వానిగా ఎలా ఉంటాడు, ఇతర కొడుకు కంటే మెరుగుగా? అది సాధ్యం కాదు. అది మన పొరపాటు. మనము వ్రాస్తాము: "మనము భగవంతుని నమ్ముతాము" కానీ మనము వివక్షను చూపుతాము. మీరు భగవంతుణ్ణి నమ్మితే, మీరు అన్ని జీవుల పట్ల సమానముగా దయను మరియు కరుణను కలిగి ఉండాలి. అది భగవంతుని చైతన్యము అంటే. కాబట్టి కృష్ణుడు ఇలా అంటున్నాడు: "నాకు శత్రువులు లేరు మరియు నాకు స్నేహితులు లేరు." Na me dveṣyo 'sti na priyaḥ.

ద్వేష్య అంటే శత్రువు. మనము మన శత్రువుల పట్ల మనము అసూయపడతాము, మనము మన స్నేహితుల పట్ల స్నేహపూర్వకంగా ఉంటాము. కాబట్టి కృష్ణుడు సంపూర్ణుడు. ఆయన ఎవరైనా రాక్షసుల పట్ల కోపంగా ఉంటే, వాస్తవానికి అతనికి స్నేహితుడు. ఒక రాక్షసుని చంపినప్పుడు, అంటే వాడి రాక్షస కార్యక్రమాలు చంపబడ్డాయని అర్థం. అతను వెంటనే ఒక సాధువు అవుతాడు. లేకపోతే అతను వెంటనే బ్రహ్మజ్యోతికి ఎలా ఉద్ధరించబడతాడు? కృష్ణుడిచే చంపబడిన ఈ రాక్షసులు అందరూ, వారు వెంటనే బ్రహ్మజ్యోతి -నిర్విశేషలో విలీనం అవుతారు. ఏమైనప్పటికీ తేడా ఏమిటి అంటే బ్రహ్మజ్యోతి, పరమాత్మ మరియు భగవాన్. అవి ఒకటి. Vadanti tat tattva-vidas tattvam ( SB 1.2.11) అది ఒకటే సత్యము, సంపూర్ణ వాస్తవము, కేవలము వివిధ లక్షణాలలో ఉంది. Brahmeti paramātmeti bhagavān iti śabdyate ( SB 1.2.11) వాస్తవానికి భగవాన్ ఆయన సంపూర్ణమైన ప్రాతినిధ్యము. పరమాత్మ , ఎవరైతే ప్రతి ఒక్కరి హృదయంలో ఉన్నాడో. Īśvaraḥ sarva-bhūtānāṁ hṛd-deśe 'rjuna tiṣṭhati ( BG 18.61) సంపూర్ణమైన భాగము క్షీరోదకశాయి విష్ణువు, ఆయన ప్రతి ఒక్కరి హృదయంలో ఉన్నాడు. అది పరమాత్మ. బ్రహ్మణ్, పరమాత్మ మరియు భగవాన్. అంతిమ విషయము భగవంతుడు. కాబట్టి, ye yathā māṁ prapadyante ( BG 4.11) ఇప్పుడు ఆయన అందరికీ సమానము. మహోన్నతమైన పరమ సత్యాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తున్న భక్తులు లేదా వ్యక్తుల మీద ఇది ఆధారపడి ఉంది. వారి అవగాహనా సామర్థ్యం ప్రకారం, పరమ సత్యం, భగవంతుడు విశదీకరించబడును నిరాకార బ్రహ్మణ్ గా లేదా ప్రాంతీయ పరమాత్మ గా లేదా భగవంతునిగా. ఇది నా మీద ఆధారపడి ఉంది.

నేను అనేకసార్లు అదే ఉదాహరణను చెప్పినాను. మన గది నుండి కొన్నిసార్లు మనము కొండలను చూస్తాము. ఇక్కడ లాస్ ఏంజిల్స్ లో అనేక కొండలు ఉన్నాయి. కానీ అవి విభిన్నంగా లేవు. మీరు దూర ప్రాంతాల నుండి కొండలను చూస్తున్నప్పుడు, అది మసకమసకగా మబ్బు కమ్మినట్లు కనిపిస్తోంది. కానీ మీరు ఇంకా కొండ దగ్గరకు వెళ్తే, మీరు అక్కడ విభిన్నమైనది ఉన్నది అని కనుగొంటారు, కొండ ఉందని తెలుసుకుంటారు. మీరు కొండ సమీపమునకు వచ్చినట్లయితే, చాలా మంది వ్యక్తులు అక్కడ పని చేస్తున్నారు, చాలా ఇళ్ళు అక్కడ ఉన్నాయి అని కనుగొంటారు. వీధులు, మోటారు కార్లు, ప్రతిదీ, అన్ని రకాలు ఉన్నాయి. అదేవిధముగా, ఒక వ్యక్తి తన మనస్సు మనస్సు ద్వారా సంపూర్ణ వాస్తవమును తెలుసుకోవాలనుకున్నప్పుడు, సంపూర్ణ సత్యాన్ని తెలుసుకోవడానికి నేను పరిశోధన చేస్తాను, అప్పుడు మీరు అస్పష్టమైన భావనను కలిగి ఉంటారు, నిరాకార భావనను. మీరు ఒక ధ్యానము చేసేవారు అయితే, మీరు హృదయంలో భగవంతుడు ఉన్నాడని మీరు చూస్తారు. Dhyānāvasthita-tad-gatena manasā paśyanti yaṁ yoginaḥ ( SB 12.13.1) యోగులు, వాస్తవమైన యోగులు, వారు ధ్యానం ద్వారా, వారు హృదయంలో విష్ణుమూర్తిని చూస్తారు. భక్తులు, వారు భగవంతుని ప్రత్యక్షముగా చూస్తారు ఉదాహరణకు మనము ప్రత్యక్షముగా ఎదురెదురుగా సమావేశం అవుతున్నట్లు, ప్రత్యక్షముగా ఎదురెదురుగా మాట్లడుతారు, నేరుగా సేవ చేస్తారు. భగవంతుడు దానిని ఆజ్ఞాపిస్తున్నాడు: మీరు నాకు దీనిని సరఫరా చేయండి, మరియు ఆయన సరఫరా చేస్తాడు. ఇది వ్యత్యాసము.