TE/Prabhupada 0919 - కృష్ణుడికి శత్రువు లేడు. కృష్ణుడికి మిత్రుడు లేడు. ఆయన పూర్తిగా స్వతంత్రుడు: Difference between revisions

 
m (Text replacement - "(<!-- (BEGIN|END) NAVIGATION (.*?) -->\s*){2,}" to "<!-- $2 NAVIGATION $3 -->")
 
Line 9: Line 9:
[[Category:Telugu Language]]
[[Category:Telugu Language]]
<!-- END CATEGORY LIST -->
<!-- END CATEGORY LIST -->
<!-- BEGIN NAVIGATION BAR -- TO CHANGE TO YOUR OWN LANGUAGE BELOW SEE THE PARAMETERS OR VIDEO -->
<!-- BEGIN NAVIGATION BAR -- DO NOT EDIT OR REMOVE -->
{{1080 videos navigation - All Languages|French|FR/Prabhupada 0918 - Devenir ennemi de Krishna n'est pas très gratifiant. Mieux devenir ami|0918|FR/Prabhupada 0920 - Parce que la force vitale, l'âme est là, tout le corps travail|0920}}
{{1080 videos navigation - All Languages|Telugu|TE/Prabhupada 0918 - కృష్ణుడికి శత్రువు అవ్వడము చాలా లాభదాయకం కాదు. మంచి స్నేహితుడు అవ్వడము మంచిది|0918|TE/Prabhupada 0920 - కీలకమైన శక్తి, ఆత్మ ఉంది కనుక, మొత్తం శరీరం పని చేస్తుంది|0920}}
<!-- END NAVIGATION BAR -->
<!-- END NAVIGATION BAR -->
<!-- BEGIN ORIGINAL VANIQUOTES PAGE LINK-->
<!-- BEGIN ORIGINAL VANIQUOTES PAGE LINK-->
Line 20: Line 20:


<!-- BEGIN VIDEO LINK -->
<!-- BEGIN VIDEO LINK -->
{{youtube_right|t-SQFZVvWig|కృష్ణుడికి శత్రువు లేడు. కృష్ణుడికి మిత్రుడు లేడు. ఆయన పూర్తిగా స్వతంత్రుడు  <br/>- Prabhupāda 0919}}
{{youtube_right|wG-dZFjXbEU|కృష్ణుడికి శత్రువు లేడు. కృష్ణుడికి మిత్రుడు లేడు. ఆయన పూర్తిగా స్వతంత్రుడు  <br/>- Prabhupāda 0919}}
<!-- END VIDEO LINK -->
<!-- END VIDEO LINK -->



Latest revision as of 23:38, 1 October 2020



730421 - Lecture SB 01.08.29 - Los Angeles


కృష్ణుడికి శత్రువు లేడు. కృష్ణుడికి మిత్రుడు లేడు. ఆయన పూర్తిగా స్వతంత్రుడు. ప్రభుపాద: కాబట్టి కృష్ణుడికి అలాంటిదేమీ లేదు, మీరు కృష్ణుడిని కాముకుడిగా, అనుభవించేవాడిగా నిందిచవచ్చు.లేదు. ఆయన తన భక్తులందరి పైన అనుగ్రహం చూపించాడు. కృష్ణుడికి చాలా మంది భక్తులు ఉన్నారు. కొందరు భక్తులు తన భర్త కావాలని కృష్ణుడిని అడుగుతారు. కొందరు భక్తులు తన స్నేహితుడు కావాలని కృష్ణుడిని అడుగుతారు. కొందరు భక్తులు కృష్ణుడిని తన కుమారుడిగా అడుగుతారు. ఇంక కొందరు భక్తులు కృష్ణుడిని తన స్నేహితుడిగా కావాలని అడుగుతున్నారు. ఈ విధముగా, మిలియన్ల ట్రిలియన్ల భక్తులు విశ్వవ్యాప్తంగా ఉన్నారు. కృష్ణుడు వారందరినీ సంతృప్తి పరచాలి; ఆయనకు భక్తుల నుండి ఎటువంటి సహాయం అవసరం లేదు. కానీ, భక్తులు కోరుకుంటారు....కాబట్టి ఈ 16,000 మంది భక్తులు కృష్ణుడిని వారి భర్తగా కావాలని కోరుకున్నారు. కృష్ణుడు అంగీకరించారు.ఆ.... సాధారణ మనిషి వలె. కానీ భగవంతునిగా, ఆయన 16,000 రూపాల్లో తనను తాను విస్తరించుకున్నాడు.

కాబట్టి నారదుడు చూడటానికి వచ్చారు. “కృష్ణుడు 16,000 మంది భార్యలను వివాహం చేసుకున్నాడు, వారితో ఆయన ఎలా వ్యవహరిస్తున్నాడో చూద్దాం”. అందువల్ల, ఆయన ఇక్కడకు వచ్చినపుడు, 16,000 రాజ భవనాలలో ఆయన చూశాడు, కృష్ణుడు భిన్నంగా వ్యవహరిస్తున్నాడు. ఒక చోట ఆయన తన భార్యతో మాట్లాడుతున్నారు, ఇంకో చోట ఆయన తన పిల్లలతో ఆడుతున్నారు. మరో చోట ఆయన తన కుమారులు కుమార్తెల వివాహ వేడుక జరుపుతున్నారు. చాలా, 16,000 మార్గాల్లో ఆయన నిమగ్నమై ఉన్నారు. అది కృష్ణుడు. కృష్ణుడు, అయితే... ఆయన సాధారణ పిల్లవాడి వలె ఆడేవారు. కానీ తల్లి యశోద ఆయన మన్ను తిన్నాడా అని, ఆయన నోరు తెరిచి చూడాలని కోరుకున్నప్పుడు, ఆయన నోటిలో అన్ని విశ్వములను చూపించాడు. కాబట్టి ఇది కృష్ణుడు. ఆయన సాధారణ పిల్లవాడిలా ఆడుతున్నప్పటికీ, సాధారణ మానవునిలా, కానీ అవసరం ఉన్నప్పుడు, ఆయన తన దైవిక స్వభావాన్ని చూపిస్తారు.

అర్జుని వలె. ఆయన రథాన్ని నడుపుతున్నప్పుడు, కానీ అర్జునుడు ఆయన విశ్వరూపం చూడాలని కోరిన వెంటనే అతడు చూపించాడు. వేల మిలియన్ల తలలు మరియు ఆయుధాలు. ఇది కృష్ణుడు. కాబట్టి న యస్య కశ్చిత్. లేకపోతే కృష్ణుడికి శత్రువు లేడు. కృష్ణుడికి స్నేహితుడు లేడు. ఆయన పూర్తిగా స్వతంత్రుడు. శత్రువు పై ఆధారపడడు. కానీ ఆయన స్నేహితుడు అని పిలువబడే వారి శత్రువు అని పిలువబడే వారి ప్రయోజనం కోసం అలా నటిస్తారు. ఆయన కృష్ణుడు... అది కృష్ణుడు యొక్క సంపూర్ణ స్వభావం. కృష్ణుడు శత్రువుగా లేదా స్నేహితుడిగా ఉన్నప్పుడు, ఫలితం ఒకటే. కాబట్టి కృష్ణుడు సంపూర్ణుడు.

చాలా ధన్యవాదాలు..

భక్తులు: జయ ప్రభుపాద!