TE/Prabhupada 0921 - మహోన్నతమైన నిక్సన్ తో మీరు సాంగత్యము చేస్తుంటే మీరు చాలా గర్వంగా భావించరా

Revision as of 15:49, 21 October 2017 by Kamalakar (talk | contribs) (Created page with "<!-- BEGIN CATEGORY LIST --> Category:1080 Telugu Pages with Videos Category:Telugu Pages - 207 Live Videos Category:Prabhupada 0921 - in all Languages Category:...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


730422 - Lecture SB 01.08.30 - Los Angeles


అధ్యక్షుడు నిక్సన్తో మీరు సాంగత్యము చెస్తూంటె మీరు చాలా గర్వపడరా? మీరు ఒక వైపు మాత్రమే వ్యవహరిస్తే... అది పరిపూర్ణముగా కాకుండా. మీరు మరింత గొప్పదానిని తయారు చేయవచ్చని అనుకుందాము. నేను ఆధునిక యుగములో వారు అతి గొప్ప దానిని తయారు చేశారని నేను భావించడం లేదు. మనము భాగవతము నుండి సమాచారాన్ని తీసుకుంటున్నాము. కపిలదేవుని తండ్రి కర్దమ ముని, ఆయన ఒక విమానం తయారు చేశాడు, ఒక గొప్ప నగరాన్ని. ఒక గొప్ప నగరం, సరస్సులతో, ఉద్యానవనాలతో, గొప్ప గొప్ప గృహాలతో, వీధులతో. మొత్తం నగరం విశ్వమంతా ఎగురుతూ ఉంది. కర్దమ ముని తన భార్యకు, అన్ని లోకములు, అన్ని లోకములు చూపించినాడు. ఆయన ఒక గొప్ప యోగి, ఆయన భార్య, దేవహుతి, వైవస్వత మనువు యొక్క కుమార్తె, చాలా గొప్ప రాజు కుమార్తె. కావున కర్దమ ముని పెళ్లి చేసుకోవాలని కోరుకున్నాడు. కావున వెంటనే వైవస్వత మనువు... ఆయన కుమార్తె, దేవహుతి, ఆమె కూడా ఇలా చెప్పింది: "నా ప్రియమైన తండ్రి, నేను ఆ ఋషిని వివాహం చేసుకోవాలనుకుంటున్నాను." అందువలన ఆయన కుమార్తెను తీసుకువచ్చారు: "అయ్యా, ఇక్కడ నా కుమార్తె ఉంది. మీరు ఆమెను మీ భార్యగా అంగీకరించండి. " ఆమె రాజు కుమార్తె, చాలా సంపన్నమైనది, కానీ ఆమె భర్త దగ్గరకు వస్తున్నది, ఆమె చాలా సేవ చేయవలసి ఉంది, ఆమె సన్నగా బక్కచిక్కినది, తగినంత ఆహారం లేకుండా మరియు పగలు మరియు రాత్రి పని చేస్తూ ఉండేది.

కాబట్టి కర్దమ ముని కొంచము జాలి పడ్డాడు: ఈ స్త్రీ నా దగ్గరకు వచ్చింది. ఆమె రాజు కుమార్తె, నా రక్షణ లో ఆమె ఏ సౌకర్యం పొందడం లేదు. నేను ఆమెకు కొంత సౌకర్యమును ఇస్తాను ఆయన భార్యను అడిగాడు: "మీరు ఎలా సౌకర్యవంతంగా ఉంటారు?" కాబట్టి స్త్రీ స్వభావం ఒక మంచి ఇల్లు, మంచి ఆహారం, మంచి దుస్తులు, మంచి పిల్లలు, మంచి భర్త. ఇది మహిళల యొక్క కోరిక లక్ష్యము. అందువల్ల ఆమె అత్యుత్తమ భర్తను పొందినది అని నిరూపించుకున్నాడు. అందువల్ల ఆయన మొదటగా ఆమెకు అన్ని సంపదలు, గొప్ప, గొప్ప ఇల్లు, పరిచారికలు, ఐశ్వర్యము ఇచ్చాడు. ఆ తరువాత ఈ విమానం ఆయన తన యోగ పద్ధతి ద్వారా తయారు చేసినాడు. కర్దమ ముని, అతడు మానవుడు. ఆయన యోగ పద్ధతి ద్వారా అటువంటి అద్భుత పనిని చేయగలిగితే... కృష్ణుడు యోగేశ్వరుడు, అన్ని యోగ మార్మిక శక్తులకు యజమాని. కృష్ణడు. కృష్ణుని భగవద్గీతలో యోగేశ్వరుని గా సంభోదించారు. ఒక చిన్న యోగ శక్తి, మనకు వచ్చినప్పుడు, మనము గొప్ప, ముఖ్యమైన వ్యక్తిగా మారుతాము. ఇప్పుడు ఆయన అన్ని యోగ మార్మిక శక్తుల యొక్క యజమాని. Yatra yogeśvaro hariḥ ( BG 18.78) భగవద్గీతలో చెప్పబడినది యోగేశ్వరో-హరి, కృష్ణుడు, దేవాదిదేవుడు, అన్ని యోగ శక్తుల యొక్క యజమాని, అక్కడ ఉన్నాడు మరియు ఎక్కడ ధనుర్ధర అర్జునుడు,పార్థ, అక్కడ ప్రతిదీ ఉంటుంది. అంతా ఉంటుంది.

మనం దీనిని గుర్తుంచుకోవాలి. కృష్ణుని మీరు ఎల్లప్పుడూ మీతో ఉంచుకోగలిగితే, అప్పుడు అంతా పరిపూర్ణముగా ఉంటుంది యత్ర యోగేశ్వరో హరిః. అక్కడ అంతా పరిపూర్ణముగా ఉంటుంది. ఈ యుగంలో ముఖ్యంగా కృష్ణుడు అంగీకరించారు. Nāma-rūpe kali-kāle kṛṣṇa-avatāra, కృష్ణుడు ఈ యుగములో పవిత్ర నామ రూపంతో అవతరించారు. అందువల్ల చైతన్య మహా ప్రభు చెప్పినారు: "నా ప్రియమైన ప్రభు, నీవు చాలా దయ కలిగి ఉన్నావు నీ పవిత్ర నామము రూపములో నీవు నాకు సాంగత్యము ఇస్తున్నావు. " Nāmnām akāri bahudhā nija-sarva-śaktis tatrārpitā niyamitaḥ smaraṇe na kālaḥ ( CC Antya 20.16 Śikṣāṣṭaka 2) ఈ పవిత్ర నామము ఏ పరిస్థితిలోనైనా జపము చేయవచ్చు. ఎటువంటి కఠినమైన నియమములు లేవు.ఎక్కడైనా హరే కృష్ణని మీరు కీర్తించవచ్చు.

ఉదాహరణకు ఈ పిల్లల వలె. వారు కూడా కీర్తన చేస్తున్నారు, వారు నృత్యం కూడా చేస్తున్నారు. ఇది చాలా కష్టము కాదు.మన విద్యార్థుల వలె నడుస్తున్నప్పుడూ, వారు జపము చేస్తున్నారు వారు సముద్రతీరంలో నడుస్తున్నారు, ఇప్పటికీ జపము చేస్తున్నారు. నష్టం ఎక్కడ ఉంది? కానీ లాభం చాలా గొప్పది, మనము కృష్ణుడితో వ్యక్తిగతంగా సాంగత్యము చేస్తున్నాము. లాభం చాలా ఉంది. మీరు చాలా గర్వంగా భావిస్తే... మీరు అధ్యక్షుడు నిక్సన్తో వ్యక్తిగతంగా సాంగత్యము చేయటానికి గర్వముగా భావిస్తే, మీకు ఎంత గర్వముగా ఉండాలి? ఓ, నేను అధ్యక్షుడు నిక్సన్ వద్ద ఉన్నాను. మహోన్నతమైన నిక్సన్ తో మీరు సాంగత్యము చేస్తే మీరు చాలా గర్వంగా భావించరా? (నవ్వు) లక్షలాది నిక్సన్స్ ను సృష్టించగలడు?

కాబట్టి ఇది మీ అవకాశం. అందువల్ల చైతన్య మహా ప్రభు చెప్పినాడు: etādṛśī tava kṛpā bhagavan mamāpi ( CC Antya 20.16 Śikṣāṣṭaka 2) నా ప్రియమైన ప్రభు, నీవు నా మీద చాలా దయతో ఉన్నారు మీరు నిరంతరముగా, ఎల్లప్పుడూ మీ సాంగత్యమును ఇస్తున్నారు. మీరు సిద్ధమయ్యారు. మీరు ఇస్తున్నారు. Durdaivam īdṛśam ihājani nānurāgaḥ. కానీ నేను చాలా దురదృష్టమైన వాడిని. నేను దాని ప్రయోజనమును తీసుకోవటము లేదు. " దుర్ధైవ. దురదృష్టం. మా, ఈ కృష్ణ చైతన్య ఉద్యమం ప్రజలను కేవలం అభ్యర్థిస్తోంది: "హరే కృష్ణ కీర్తన చేయండి."