TE/Prabhupada 0950 - మన పొరుగు వారు ఆకలితో అలమటించవచ్చు, కానీ మనము దాని గురించి పట్టించుకోము

Revision as of 23:46, 1 October 2020 by Elad (talk | contribs) (Text replacement - "(<!-- (BEGIN|END) NAVIGATION (.*?) -->\s*){2,}" to "<!-- $2 NAVIGATION $3 -->")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


720902 - Lecture Festival Sri Vyasa-puja - New Vrindaban, USA


మన పొరుగు వారు ఆకలితో అలమటించవచ్చు, కానీ మనము దాని గురించి పట్టించుకోము లేడీస్ అండ్ జెంటిల్ మెన్, ఈ వేడుక... అయితే, నా విద్యార్ధులకు, ఈ వేడుక ఏమిటో వారికి తెలుసు. సందర్శకులకు, వారి సమాచారం కోసం, నేను ఈ వేడుక గురించి మీకు కొంత తెలియజేస్తాను. లేకపోతే, అది కాకపోవచ్చు... తప్పుగా అర్థము చేసుకోవచ్చు. బయటివారు దానిని ఇలాచూడవచ్చు, "ఎందుకు ఒక వ్యక్తిని భగవంతునిలా పూజిస్తున్నారు?" కొంత సందేహం ఉండవచ్చు. కాబట్టి ఈ మర్యాద ఉంది. ఈ వేడుకను వ్యాస-పూజ అని పిలుస్తారు. వ్యాసుడు. వ్యాస అంటే వేద సాహిత్యం యొక్క వాస్తవ రచయిత. ఆయన నారాయణుడి యొక్క అవతారం. ఆయన మనకు వేదముల జ్ఞానాన్ని అంతటిని ఇచ్చినారు. ఆయన నారదుని నుండి జ్ఞానం పొందారు. నారదునికి బ్రహ్మ నుండి జ్ఞానం లభించింది. బ్రహ్మకు కృష్ణుడి నుండి జ్ఞానం లభించింది. ఈ విధముగా, గురు శిష్య పరంపర ద్వారా, మనం ఆధ్యాత్మికత జ్ఞానం పొందుతాము.

కావున వ్యాసదేవుడు... పూర్వం, వ్యాసదేవునికి ముందు, ఐదు వేల సంవత్సరాల క్రితం, ఆ సమయమునకు పూర్వము లిఖిత సాహిత్యం అవసరం లేదు. ప్రజల జ్ఞాపక శక్తి చాలా పదునైనది, వారి ఆధ్యాత్మిక గురువు నుండి వారు ఏది విన్నారో వారు జీవితాంతం గుర్తుంచుకుంటారు. జ్ఞాపక శక్తి చాలా పదునుగా ఉండేది. కానీ ఈ యుగంలో - దీనిని కలి-యుగం అని పిలుస్తారు - మనము మన శారీరక బలాన్ని, మన జ్ఞాపకశక్తి, గుర్తు ఉంచుకుండే జ్ఞాపక శక్తిని తగ్గించుకుంటాము, ఇతరుల మీద సానుభూతి, కరుణ, వయస్సు, జీవిత కాలము, మతపరమైన ప్రవృత్తులు. ఈ విధముగా, ఈ యుగములో మనము ప్రతిదీ తగ్గించుకుంటున్నాము. మీరు ప్రతి ఒక్కరూ చాలా సులభంగా అర్థం చేసుకోవచ్చు. ఇంతకు ముందు ఎవరైనా ఒకరి మీద దాడి చేస్తే, చాలామంది ఆయనకు సహాయం చేయటానికి వచ్చేవారు: "ఎందుకు ఈ మనిషి దాడి చేయబడ్డాడు?" కానీ ప్రస్తుతం ఒక వ్యక్తి మీద దాడి చేస్తే, బాటసారులను పట్టించుకోరు, ఎందుకంటే ఇతరుల మీద వారి సానుభూతి లేదా కనికరం కోల్పోయారు. మన పొరుగువాడు ఆకలితో మరణించవచ్చు, కానీ మనము దాని గురించి శ్రద్ధ తీసుకోకపోవచ్చు. కానీ గతంలో ఇతర జీవుల మీద సానుభూతి, ఒక చీమ మీద కూడా... ఉదాహరణకు మహారాజ పరీక్షిత్ వలె, ఆయన తన రాజ్యంలో పర్యటన చేస్తున్నప్పుడు, ఆయన ఒక మనిషి ఒక ఆవును చంపడానికి ప్రయత్నిస్తున్నట్లు చూసినారు. పరీక్షిత్ మహారాజు చూశారు. వెంటనే ఆయన తన కత్తి తీసుకున్నారు నీవెవరు? నీవు నా రాజ్యంలో ఒక ఆవును చంపుతున్నావా? ఎందుకంటే రాజు లేదా ప్రభుత్వం ప్రతి ఒక్కరికీ రక్షణ కల్పించవలసి ఉంది, ప్రభుత్వము మనుషులకు భద్రత కల్పించడం కోసం మాత్రమే, జంతువులకు కాదు. అని కాదు ఎందుకంటే కలి యుగములో, ప్రభుత్వం రెండు జాతుల మధ్య విచక్షణ చూపుతుంది. జాతీయత అంటే ఆ భూమిలో జన్మించిన వ్యక్తి. ఇది జాతీయతగా పిలువబడుతుంది. అంటే... మీ అందరికీ తెలుసు. కాబట్టి చెట్లు, అవి కూడా ఈ భూమిలో జన్మించబడుతున్నాయి, నీటిలో నివసించుచున్న జీవులు కూడా ఈ భూమిలోనే జన్మించినవి ఈగలు, సరీసృపాలు, పాములు, పక్షులు, మృగములు, మనుష్యులు అందరూ ఆ దేశంలో జన్మించారు. ఉదాహరణకు మీ భూమి, అమెరికా, యునైటెడ్ స్టేట్స్ అని అనుకుందాము... ప్రభుత్వము ఎందుకు ఒకరకమైన జీవులకు రక్షణ కల్పించాలి, ఇతరులను ఎందుకు తిరస్కరిస్తుంది? దీని అర్థం వారు ఇతరుల పట్ల తమ సానుభూతిని కోల్పోయారు. ఇది కలి యుగం. పూర్వం, కలి యుగానికి ముందు, అనవసరంగా ఒక చీమ కూడా చంపబడేది కాదు. ఒక చీమ కూడా. ఒక వేటగాడు జంతువులను చంపి ప్రయోజనమును పొందుతున్న చాలా ఉదాహరణలు ఉన్నాయి, కానీ ఆయన ఒక భక్తుడు అయినప్పుడు ఆయన ఒక చీమను కూడా చంపటానికి సిద్ధంగా లేడు