TE/Prabhupada 0961 - మన పరిస్థితి మనము నియంత్రించబడువారము. భగవంతుడు నియంత్రించువాడు

Revision as of 23:39, 1 October 2020 by Elad (talk | contribs) (Text replacement - "(<!-- (BEGIN|END) NAVIGATION (.*?) -->\s*){2,}" to "<!-- $2 NAVIGATION $3 -->")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


740707 - Lecture Festival Ratha-yatra - San Francisco


మన పరిస్థితి మనము నియంత్రించబడువారము. భగవంతుడు నియంత్రించువాడు. ఈ ఉద్యమం 500 సంవత్సరముల క్రింద చైతన్య మహాప్రభువు చేత ప్రారంభించబడినది (వినబడటము లేదు) ....అంతకుముందు శ్రీకృష్ణభగవానుడు ఐదువేల సంవత్సరాల క్రింద. కురుక్షేత్ర యుద్ధ భూమిలో ఆయన గొప్ప భగవద్గీత చెప్పారు. మీలో చాలామంది, మీరు ఆ పేరును విన్నారు ఇంకా (అస్పష్టంగా) మనము "భగవద్గీత యథాతథము" కూడా ప్రచురించాము". ఈ కృష్ణచైతన్య ఉద్యమం యొక్క ఆధారం "భగవద్గీత యథాతథము". భగవద్గీత.... భగవద్గీత యొక్క ఉద్దేశ్యం గుర్తు చేయడము మీ అందరూ... మీరు అంటే జీవులందరూ, మనుషులేకాదు, మనుషులు కాక ఇతరులు. జంతువులు, వృక్షములు, పక్షులు, జలచరాలు. ఎక్కడా మీకు జీవశక్తి కనబడుతుందో, అది భగవంతునిలో భాగము మరియు అంశ. భగవంతుడు కూడా జీవి, కానీ వేదాలలో వివరించబడినట్లు, ప్రధాన జీవి. కఠోపనిషత్తులో చెప్పబడింది, నిత్యో నిత్యానాం చేతనా చేతనానాం. భగవంతుడు కూడా మనందరిలాగే జీవి, మనలాగే కానీ భగవంతునికి మనకు మధ్య వ్యత్యాసం ఇది : Eko yo bahunam vidadhati kaman. ఆ ఒక జీవి అన్ని జీవులను పోషిస్తున్నాడు, కాపాడుతున్నాడు. కాబట్టి మన పరిస్థితి భగవంతుని చేత నిర్వహించబడుతుంది ఇంకా భగవంతుడు సంరక్షకుడు. మన పరిస్థితి మనము నియంత్రించ బడువారము. భగవంతుడు నియంత్రించువాడు. కాబట్టి, ఈ భౌతిక ప్రపంచంలో, జీవి, భగవంతుడిలా కావాలని కోరుకునే జీవులు... (బ్రేక్).

కాబట్టి మానవ జీవితము ఒక అవకాశం జనన మరణ, వ్యాధి వృద్ధాప్య చక్రం నుండి విముక్తిని పొందటానికి. ఇంకా ఈ కృష్ణచైతన్య ఉద్యమం ప్రజలకు ఈ గొప్ప శాస్త్రమును భోదించడానికి ఉద్దేశించ బడినది. కాబట్టి ఇప్పటికే మేము ఇరవై పుస్తకాలను ప్రచురించాము, నాలుగు వందల పేజీలు ఒక్కొక్కటి, కృష్ణ చైతన్యము యొక్క విజ్ఞానాన్ని వివరించడానికి. తద్వారా శాస్త్రవేత్తలు, తత్వవేత్తలు, వారు కూడా మన పుస్తకాలను చదివి అర్థం చేసుకోవచ్చు. ఇంకా మరిన్ని పుస్తకాలు వస్తాయి