TE/Prabhupada 0963 - కృష్ణుడి భక్తుడు, ఆయనతో అనుబంధం కలిగి ఉన్నవాడు మాత్రమే భగవద్గీతను అర్థము చేసుకోగలడు

Revision as of 07:32, 29 October 2017 by Kamalakar (talk | contribs) (Created page with "<!-- BEGIN CATEGORY LIST --> Category:1080 Telugu Pages with Videos Category:Telugu Pages - 207 Live Videos Category:Prabhupada 0963 - in all Languages Category:...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


720000 - Lecture BG Introduction - Los Angeles


కృష్ణుడి భక్తుడు, ఆయనతో అనుబంధం కలిగి ఉన్నవాడు మాత్రమే భగవద్గీతను అర్థము చేసుకోగలడు కాబట్టి, మనము భగవద్గీతను యొక్క ఉపోద్ఘాతమును ఇచ్చాము ఎవరైనా భగవద్గీతను, భగవద్గీతలో నిర్దేశించిన విధముగా అర్థం చేసుకోవలసి ఉంటుంది. నిర్దేశము ఉంది. భగవద్గీతను ఎలా చదివాలి. నిర్దేశము తీసుకోకుండా ప్రజలు భగవద్గీత చదువుతున్నారు. ఇది మేము వివరించాము. మీరు ఏదైనా ఔషధం తీసుకుంటే, సీసా మీద కొంత నిర్దేశము ఉంటుంది, అది ఈ మోతాదు అని. మీరు ఎన్ని సార్లు ఎన్ని చుక్కలు తీసుకోవాలో. అది నిర్దేశము. అదేవిధముగా, భగవద్గీతా-జ్ఞానం అర్థం చేసుకోవడానికి, మీరు ఆ నిర్దేశమును అంగీకరించాలి రచయిత అయిన కృష్ణుడు స్వయముగా ఇచ్చినట్లుగా. ఆయన చెప్పాడు, ఎంతో కాలము క్రితం, నలభై మిలియన్ల సంవత్సరాల క్రితం, ఆయన మొదట ఈ భగవద్గీతను సూర్య-దేవునికి చెప్పాడు. సూర్య-భగవంతుడు తన కుమారుడైన మనువుకు జ్ఞానాన్ని బదిలీ చేశాడు. మనువు తన కుమారుడు ఇక్ష్వాకుకు జ్ఞానాన్ని బదిలీ చేశాడు.

imaṁ vivasvate yogaṁ
proktavān aham avyayam
vivasvān manave prāha
manur ikṣvākave 'bravīt
(BG 4.1)

కాబట్టి, రాజార్షులు, వారు అందరూ రాజులు. మనువు రాజు, మహారాజా ఇక్ష్వాకు కూడా రాజు, సూర్య-భగవంతుడు వివస్వాన్, ఆయన కూడా రాజు. ఆయన సూర్య లోకము యొక్క రాజు. ఆయన మనవడు ఇక్ష్వాకు ఈ లోకము యొక్క రాజు అయ్యాడు.మహారాజా ఇక్ష్వాకు ఈ రాజవంశంలో, రఘు-వంశము అని పిలువబడేది, దానిలో రామచంద్రుడు అవతరించారు. ఇది చాలా పాత రాచరిక కుటుంబం. ఇక్ష్వాకు వంశము, రఘు వంశము. వంశము అంటే కుటుంబం. గతంలో, రాజులు, పరిపాలన యంత్రాంగము యొక్క అధికారి, వారు భగవంతుడు ఇచ్చిన నిర్దేశము లేదా ఉత్తర్వును నేర్చుకుంటారు. కాబట్టి భగవద్గీత ప్రకారం, కృష్ణ భక్తుడు మాత్రమే, కృష్ణుడితో సన్నిహిత సంబంధం కలిగిన వ్యక్తి, ఆయన భగవద్గీత అంటే ఏమిటో అర్థం చేసుకోగలడు. కృష్ణుడు ... అర్జునుడు, కృష్ణుడినుండి భగవద్గీత విన్న తరువాత, ఆయనను ఇలా సంభోదించాడు:

paraṁ brahma paraṁ dhāma
pavitraṁ paramaṁ bhavān
puruṣaṁ śāśvataṁ divyam
ādi-devam ajaṁ vibhum
(BG 10.12)

ఆయన కృష్ణుడిని పరమ్ బ్రహ్మణ్ గా అర్థం చేసుకున్నాడు. పరమ్ బ్రహ్మణ్ అంటే మహోన్నతమైన సత్యము. పరమ సత్యము, పరమ్బ్రహ్మణ్ బ్రహ్మణ్, జీవులు, వారు కూడా బ్రహ్మణ్ అని అంటారు, కానీ జీవులు పరమ్ బ్రహ్మణ్ కాదు. పరమ్ బ్రహ్మణ్ అంటే మహోన్నతమైన అని అర్థము. అందువల్ల అర్జునుడు ఆయనను పరమ్ బ్రహ్మణ్ మరియు పరంధామన్ అని పిలిచాడు. పరంధామన్ అంటే ప్రతిదీ ఆధారపడి ఉండే ప్రదేశము. ప్రతిదీ దేవాదిదేవుడు యొక్క శక్తి మీద ఆధారపడి ఉంటుంది. అందువలన ఆయనను పరంధామన్ అని అంటారు. ఉదాహరణకు ఈ లోకములు అన్నీ సూర్యరశ్మి మీద ఆధారపడి ఉన్నట్లుగా. సూర్య కాంతి అనేది సూర్య భూగోళము యొక్క శక్తి. అదేవిధముగా, ఈ భౌతిక శక్తి కృష్ణుడి శక్తి. ప్రతిదీ, భౌతికము లేదా ఆధ్యాత్మికము, ప్రతిదీ కృష్ణుడి శక్తి మీద ఆధారపడి ఉంది. ఆధారము కృష్ణుడి శక్తి. మరొక ప్రదేశంలో, కృష్ణుడు ఇలా చెప్పాడు:

mayā tatam idaṁ sarvaṁ
jagad avyakta-mūrtinā
mat-sthāni sarva-bhūtāni
na cāhaṁ teṣv avasthitaḥ
(BG 9.4)

కృష్ణుడు ఇలా అంటాడు, "నా నిరాకార లక్షణంలో, నేను ప్రతిచోటా వ్యాపించి వున్నాను." అన్నిచోట్లా వ్యాపించి వున్నాను. భగవంతుడు తన నిరాకార లక్షణం వలన వ్యాపించి వున్నారు, అనగా తన శక్తి ద్వారా. ఉదాహరణకు, వేడి అగ్ని యొక్క శక్తి. అగ్ని తన యొక్క వేడిని మరియు కాంతిని వ్యాప్తి చేస్తుంది. అగ్ని ఒక ప్రదేశములో ఉంటుంది, కానీ వేడి మరియు కాంతి వ్యాప్తి చెందుతోంది. అదేవిధముగా, కృష్ణుడు తన స్వంత నివాసంలో ఉన్నాడు, దీనిని గోలోక వృందావనము అని పిలుస్తారు. ఆధ్యాత్మిక ప్రపంచంలో ఒక లోకము ఉంది, ఉన్నతమైన లోకము