TE/Prabhupada 0999 - ఆత్మవత్ అంటే ఎవరికి ఆత్మ అంటే తెలుసో

Revision as of 05:54, 11 December 2017 by Kamalakar (talk | contribs) (Created page with "<!-- BEGIN CATEGORY LIST --> Category:1080 Telugu Pages with Videos Category:Telugu Pages - 207 Live Videos Category:Prabhupada 0999 - in all Languages Category:...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


730406 - Lecture SB 02.01.01-2 - New York


ఆత్మవత్ అంటే ఎవరికి ఆత్మ అంటే తెలుసో ఇప్పుడు, ఈ kṛṣṇā-sampraśnaḥ, ఈ ప్రశ్నలు మరియు సమాధానాలు కృష్ణుని గురించి , మనము కేవలం విన్నట్లయితే, అది చైతన్య మహా ప్రభు యొక్క సిఫారసు. Sthāne sthitāḥ śruti-gatāṁ tanu-vāṅ-manobhir. మీరు ఉన్న స్థితిలోనే మీరు ఉండండి, కానీ మీరు కృష్ణుని గురించి శ్రవణము చేయడానికి ప్రయత్నిoచండి. ఇది సిఫార్సు చేయబడింది. కేవలం మీరు ఈ దేవాలయంలో వచ్చి కృష్ణుని గురించి శ్రవణము చేయడానికి ప్రయత్నిoచండి , sthāne sthitāḥ śruti-gatāṁ tanu-vāṅ. అది పవిత్రము చేస్తుంది. కృష్ణుడి కీర్తన, కృష్ణుడి నామము చాలా శక్తివంతమైనది, కేవలము మీరు విన్నప్పుడు "కృష్ణుడు, కృష్ణుడు, కృష్ణుడు, కృష్ణుడు, కృష్ణ," మీరు పవిత్రము అవుతారు. మీరు పరిశుద్ధులయ్యారు. అందువల్ల ఇది చెప్పబడినది, varīyān eṣa te praśnaḥ kṛto loka-hitaṁ nṛpa, ātmavit-sammataḥ ( SB 2.1.1) Ātmavit. నేను కేవలం పొగుడుతున్నాను అనే కాదు. Ātmavit-sammataḥ. ఆత్మ జ్ఞానము ఉన్న అందరు గొప్ప వ్యక్తులు, ఆత్మవిత్. ఆత్మవిత్ అనగా ఎవరికైతే ఆత్మ తెలుసో వారు అని అర్థం. సాధారణ ప్రజలు, వారికి ఆత్మ గురించి తెలియదు. కానీ ఆత్మవిత్ అంటే ఆత్మను తెలిసిన వాడు, అహం బ్రహ్మాస్మి, నేను ఆత్మను, నేను ఈ శరీరం కాదు, ఈ ఆత్మ తత్వము గురించి బాగా తెలిసిన వ్యక్తి. అందువల్ల ఈ అత్మ-తత్త్వం గురించి ఒక అవగాహన ఏర్పడినట్లయితే తప్ప, అతడు చేస్తున్నది ఏమైనా, ఆయన ఓడిపోతాడు. వారు చూస్తున్నారు... సాధారణంగా ప్రజలు, వారు ఆలోచిస్తున్నారు నేను ఇప్పుడు ఈ గొప్ప ఆకాశహర్మ్య భవనాన్ని నిర్మించాను. నేను విజయవంతం అయ్యాను. నేను rothschild అయ్యాను, నేను ఫోర్డ్ అయ్యాను. " అది అత్మ-విత్ కాదు. ఆత్మ-విత్... ఆయన భౌతికంగా సంపన్నమైనందున, అంటే అది అత్మ-విత్ అని కాదు. ఆ విషయమును తరువాతి శ్లోకములో చర్చించినారు, apaśyatām ātma-tattvam ( SB 2.1.2) తన ఆత్మను చూడలేనివాడు:gṛheṣu gṛha-medhinām. వారు ఈ భౌతిక జీవన విధానంలో తృప్తిగా ఉన్నారు. gṛheṣu gṛha-medhinām. వారి పరిస్థితి ఉంది... వాస్తవానికి ఇది ఈ మొత్తం ప్రపంచం యొక్క పరిస్థితి. వారు అత్మ- విత్ కాదు. వారికి అత్మ-తత్వము అవసరము లేదు; అందుచే వారు తక్కువ తెలివిగలవారు. విమానాశ్రయంలో నేను చెప్పేదేమిటంటే, మన ప్రచారము ప్రజలను మరింత మేధస్సు కలిగిన వారిగా చేయడము. వారు చాలా చక్కగా అర్థం చేసుకునట్లు కాదు. వారు "ఈ పేద స్వామి మనల్ని మేధావులను చేయటానికి వచ్చాడు" అని అనుకున్నారు. వాస్తవానికి అది సత్యము. అది సత్యము. ఇది మేధస్సు కాదు, శరీర భావన, నేను శారీరక సుఖాలు కోసం నా మొత్తం జీవితాన్ని పాడు చేసుకున్నాను, తరువాత ఈ శరీరాన్ని విడిచిపెట్టిన తరువాత, నేను పిల్లి లేదా కుక్క అయ్యాను. ఆప్పుడు ఆ బుద్ధి ఏమిటి? అది చాలా మంచి బుద్దా?

వాస్తవమునకు అది జరిగింది. నేను చర్చించడానికి ఇష్టపడను. మా Godbrother, శ్రీధర మహారాజు , చెప్తాడు... ఆయన ఒక పత్రిక నుండి చూసి చెప్తున్నారు మన గొప్ప రాజకీయ నాయకుల్లో ఒకరు, భారతదేశంలో నుండి, ఆయన ఇప్పుడు స్వీడన్లో ఒక కుక్క అయ్యాడు. ఇది ప్రచురించబడింది. భారతదేశంలోని ఎవరో ప్రముఖుల గురించి విచారణలు జరిగాయి, అతడు సమాధానము ఇచ్చాడు వాటిలో ఒక సమాధానం ఏమిటంటే, "ఫలానా రాజకీయ నాయకుడు, ఆయన ఇప్పుడు స్వీడన్లో ఒక పెద్ద మనిషి యొక్క రెండు కుక్కలలో ఒకడు. " మీరు చూడండి. ఈ సమయం లో, ఈ జీవితంలో నేను చాలా గొప్ప మనిషి కావచ్చు, లేదా గొప్ప రాజకీయ నాయకుడు, గొప్ప దౌత్యవేత్త, గొప్ప వ్యాపారవేత్త, కానీ తరువాతి జీవితములో, మీ మరణం తరువాత, ఇది... మీ గొప్ప, ఈ భౌతిక జీవితము యొక్క గొప్పతనము మీకు సహాయం చేయదు. మీ పని మీద ఆధారపడి ఉంటుంది, ప్రకృతి మీకు ఒక నిర్దిష్ట రకమైన శరీరాన్ని అందిస్తుంది. మీరు అంగీకరించాలి. అయితే మీరు మర్చిపోతారు. ఇది ప్రకృతిచే ఇవ్వబడిన రాయితీ. ఉదాహరణకు మన గత జీవితంలో మనం ఏలా ఉన్నామో గుర్తు లేన్నట్లుగానే. నా గత జీవితంలో నేను ఒక రాజు అని నాకు గుర్తుంటే , ఇప్పుడు నేను ఒక కుక్క అయ్యాను, అప్పుడు ఎంత బాధ ఉంటుందో. అందువలన ప్రకృతి చట్టం ద్వారా ఒకరు మర్చిపోతారు. మరణం అంటే ఈ మరూపము అని అర్థం. మరణం అంటే ఈ మరూపము అని అర్థం