TE/Prabhupada 1010 - మీరు చెక్కను, రాయిని చూస్తారు. మీరు ఆత్మ అంటే ఏమిటో చూడలేరు: Difference between revisions

 
m (Text replacement - "(<!-- (BEGIN|END) NAVIGATION (.*?) -->\s*){2,}" to "<!-- $2 NAVIGATION $3 -->")
 
Line 9: Line 9:
[[Category:Telugu Language]]
[[Category:Telugu Language]]
<!-- END CATEGORY LIST -->
<!-- END CATEGORY LIST -->
<!-- BEGIN NAVIGATION BAR -- TO CHANGE TO YOUR OWN LANGUAGE BELOW SEE THE PARAMETERS OR VIDEO -->
<!-- BEGIN NAVIGATION BAR -- DO NOT EDIT OR REMOVE -->
{{1080 videos navigation - All Languages|French|FR/Prabhupada 1009 - Si vous respectez le maître spirituel comme Dieu, vous devez lui offrir les installations de Dieu|1009|FR/Prabhupada 1011 - Vous devez apprendre ce qui est la religion de Dieu. Ne fabriquez pas votre propre religion|1011}}
{{1080 videos navigation - All Languages|Telugu|TE/Prabhupada 1009 - ఆధ్యాత్మికగురువును భగవంతుని వలె గౌరవిస్తే ఆయనకు భగవంతునికి ఇచ్చే సౌకర్యాలను ఇవ్వాలి|1009|TE/Prabhupada 1011 - దేవుడు నుండి మతము అంటే ఏమిటో తెలుసుకోవాలి. మీరు మీ స్వంత మతాన్ని తయారు చేయవద్దు|1011}}
<!-- END NAVIGATION BAR -->
<!-- END NAVIGATION BAR -->
<!-- BEGIN ORIGINAL VANIQUOTES PAGE LINK-->
<!-- BEGIN ORIGINAL VANIQUOTES PAGE LINK-->
Line 20: Line 20:


<!-- BEGIN VIDEO LINK -->
<!-- BEGIN VIDEO LINK -->
{{youtube_right|5EvNsBeL2xA|మీరు చెక్కను, రాయిని చూస్తారు. మీరు ఆత్మ అంటే ఏమిటో చూడలేరు  <br/>- Prabhupāda 1010}}
{{youtube_right|oU-6Cs2tDF4|మీరు చెక్కను, రాయిని చూస్తారు. మీరు ఆత్మ అంటే ఏమిటో చూడలేరు  <br/>- Prabhupāda 1010}}
<!-- END VIDEO LINK -->
<!-- END VIDEO LINK -->



Latest revision as of 23:38, 1 October 2020



750713 - Conversation B - Philadelphia


మీరు చెక్కను, రాయిని చూస్తారు. మీరు ఆత్మ అంటే ఏమిటో చూడలేరు

అన్నే జాక్సన్: నాకు మరొక ప్రశ్న మాత్రమే ఉంది, అది కూడా బయటి వ్యక్తుల అభిప్రాయము నుండి. నాకు అనిపిస్తుంది కృష్ణ చైతన్యములో కష్టమైన అంశాలలో ఒకటి అంగీకరించడానికి కొందరికి, ఆ దృక్కోణం వెలుపల పెరిగిన వారికి, అర్చాముర్తులు, అవి కృష్ణుడిని సూచిస్తాయి అనే ఆలోచన.

ప్రభుపాద: అర్చామూర్తులా? దాని గురించి కొంచెం మాట్లాడగలరా? ప్రభుపాద: అవును. ప్రస్తుతానికి, మీరు కృష్ణుడిని చూడడానికి శిక్షణ పొందలేదు కనుక, కాబట్టి మీరు చూడగలిగినట్లుగా కృష్ణుడు దయతో మీకు కనిపిస్తున్నాడు. మీరు చెక్కను, రాయిని చూడగలరు. మీరు ఆత్మ అంటే ఏమిటో చూడలేరు. మీరు మిమ్మల్ని మీరు చూడలేరు. మీరు ఆలోచిస్తున్నారు, "నేను ఈ శరీరం." కానీ మీరు ఆత్మ. రోజువారీ మీ తండ్రిని తల్లిని మీరు చూస్తున్నారు, తండ్రి లేదా తల్లి మరణించినప్పుడు, మీరు ఏడుస్తారు. ఎందుకు మీరు ఏడుస్తున్నారు? "ఇప్పుడు నా తండ్రి వెళ్ళిపోయారు." మీ తండ్రి ఎక్కడకు వెళ్ళి పోయారు ? ఆయన ఇక్కడే పడుకున్నాడు. మీరు ఎందుకు వెళ్లిపోయారు అని అంటున్నారు? వెళ్ళిపోయిన విషయము ఏమిటి? మంచం మీద పడుకొని ఉన్నప్పటికీ "నా తండ్రి పోయినాడు" అని మీరు ఎందుకు చెప్తారు? మీరు రోజు మీ తండ్రిని చూశారు. ఇప్పుడు మీరు, "నా తండ్రి వెళ్లిపోయారు." అని అంటున్నారు... కానీ ఆయన మంచము మీద పడుకొని ఉన్నారు. కాబట్టి ఎవరు వెళ్లిపోయారు? మీ సమాధానం ఏమిటి?

అన్నే జాక్సన్: (వినడంలేదు) భగవంతుడు ఎక్కడ ఉన్నాడు?

జయతీర్థ: ఎవరు వెళ్ళారు? మీ చనిపోయిన తండ్రిని మీరు చూసి, అతడు చనిపోయాడని చెప్తే, ఎవరు వెళ్ళిపోయినారు?

అన్నే జాక్సన్: ఆయన తండ్రి.

ప్రభుపాద: ఆ తండ్రి ఎవరు?

అన్నే జాక్సన్: ఈ భౌతిక శరీరము మాత్రమే వెళ్ళి పోయింది.

ప్రభుపాద: భౌతిక శరీరము అక్కడే ఉంది, మంచం మీద పడుకొని ఉంది.

రవీంద్ర-స్వరూప: ఆయన శరీరం అక్కడ ఉంది. మీరు, "నా తండ్రి వెళ్ళి పోయారు." అని చెప్తారు కాబట్టి ఏమి పోయింది?

అన్నే జాక్సన్: సరే, ఆయన ఆత్మ ఇప్పటికీ ఉంది...

ప్రభుపాద: మీరు ఆ ఆత్మను చూశారా? అన్నే జాక్సన్: లేదు.

ప్రభుపాద: కాబట్టి మీరు ఆత్మను చూడలేరు, భగవంతుడు సర్వోన్నతమైన ఆత్మ. అందువలన, మీ మీద దయ చూపించడానికి, మీరు చూడగలిగేలా ఆయన చెక్క మరియు రాయిలా ఆవిర్భవించారు.

అన్నే జాక్సన్:ఓ, నేను అర్థం చేసుకున్నాను.

ప్రభుపాద: ఆయన ప్రతిదీ. ఆయన ఆత్మ మరియు పదార్థము, ప్రతిదీ ఉంది. కానీ ఆయనను ఆధ్యాత్మిక వ్యక్తిగా చూడలేరు. అందువల్ల మీరు చూడగలిగే విధముగా ఆయన భౌతిక రూపంలో ఆవిర్భవించారు. ఇది అర్చాముర్తి. ఆయన భగవంతుడు, కానీ మీరు ఆయనను ప్రస్తుత క్షణంలో ఆయన వాస్తవ ఆధ్యాత్మిక రూపమును ఆయనని చూడలేరు. అందువలన, ఆయన అకారణమైన కరుణ వలన ఆయన మీ ముందు ఆవిర్భవించారు మీరు చూడగలిగే విధముగా చెక్క, రాళ్ళతో తయారు చేయబడినట్లుగా.

అన్నే జాక్సన్: చాలా ధన్యవాదాలు.

ప్రభుపాద: హరే కృష్ణ. హ్మ్. మీరు మన సమావేశములకు రోజు వస్తారా?

శాండీ నిక్సన్: రోజు కాదు, కానీ నేను వస్తాను.

ప్రభుపాద: ఇది బాగుంది.

శాండీ నిక్సాన్: అవును.