TE/Prabhupada 1018 - ప్రారంభంలో మనము రాధా కృష్ణులను లక్ష్మీ నారాయణుని స్థాయిలో పూజించాలి

Revision as of 23:38, 1 October 2020 by Elad (talk | contribs) (Text replacement - "(<!-- (BEGIN|END) NAVIGATION (.*?) -->\s*){2,}" to "<!-- $2 NAVIGATION $3 -->")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


730408 - Lecture SB 01.14.44 - New York


ప్రారంభంలో మనము రాధా కృష్ణులను లక్ష్మీ నారాయణుని స్థాయిలో పూజించాలి ప్రద్యుమ్న: అనువాదం: "లేదా నీవు నీ సమయము అంతా ఒంటరిగా అనుభూతి చెందుతున్నావా ? ఎందుకంటే నీ అత్యంత సన్నిహిత స్నేహితుడు, భగవంతుడు కృష్ణుని నీవు పోగొట్టుకున్నావా? ఓ నా సోదరా అర్జునా, నీవు అలా దిగులుగా ఉన్నందుకు నాకు మరొక కారణం కనబడటము లేదు. "

ప్రభుపాద: కృష్ణుడు అర్జునుని సన్నిహిత మిత్రుడు. అర్జునునికి మాత్రమే కాదు, పాండవులు అందరికీ. కాబట్టి వారు కృష్ణుని నుండి విరహమును తట్టుకోలేక పోతున్నారు. ఇది కృష్ణ భక్తుడు యొక్క చిహ్నము. చైత్యన్య మహా ప్రభు చెప్తారు "నాకు కృష్ణుని మీద ప్రేమ లేదు." ఆ శ్లోకము, ఇప్పుడు నేను మరచిపోయాను... Na prema-gandho ’sti ( CC Madhya 2.45) కాబట్టి మీకు కృష్ణుని పై ప్రేమ లేదు? మీరు ఎల్లప్పుడు కృష్ణుని కోసం ఏడుస్తున్నారు, అయినప్పటికీ మీకు కృష్ణుని పై ప్రేమ లేదని చెప్తున్నారా? " లేదు, నేను చూపెట్టుకోవడానికి ఏడుస్తున్నాను. నిజానికి నేను కృష్ణుని భక్తుని కాదు. ఎందుకు? ఎందుకంటే "నేను కృష్ణుని భక్తుడిని అయితే , నేను ఆయన లేకుండా ఎలా జీవిస్తాను? నేను ఇంకా చనిపోలేదు. అంటే నాకు కృష్ణుని మీద ప్రేమ లేదు. " ఇది ప్రేమకు గుర్తు - ఒక ప్రేమికుడు క్షణం కూడా నివసించలేడు ప్రియమైన వారితో సంబంధం లేకుండా. ఇది ప్రేమ యొక్క చిహ్నం.

కాబట్టి ఈ ప్రేమను రాధా మరియు కృష్ణుని మధ్య మాత్రమే అభినందించవచ్చు, లేదా గోపికలు మరియు కృష్ణుని మధ్య; లేకపోతే లేదు. వాస్తవానికి మనకు ప్రేమ అంటే అర్థం ఏమిటో తెలియదు. ఉదాహరణకు చైతన్య మహాప్రభు చెప్పినట్లు, అది

āśliṣya vā pāda-ratāṁ pinaṣṭu mām
adarśanān marma-hatāṁ karotu vā
yathā tathā vā vidadhātu lampaṭo
mat-prāṇa-nāthas tu sa eva nāparaḥ
(CC Antya 20.47, Śikṣāṣṭaka 8)
yugāyitaṁ nimeṣeṇa
cakṣuṣā prāvṛṣāyitam
śūnyāyitaṁ jagat sarvaṁ
govinda-viraheṇa me
(CC Antya 20.39, Śikṣāṣṭaka 7)

గోవింద- విర . విర అంటే విరహము. అంటే రాధారాణి... చైతన్య మహా ప్రభు శ్రీమతి రాధారాణి యొక్క పాత్రను పోషిస్తున్నారు. కృష్ణుడు, ఆయన తనను తాను అర్థం చేసుకోలేనప్పుడు... కృష్ణుడు అపరిమితమైనవాడు. ఆయన ఎంత అపరిమితంగా ఉన్నాడు అంటే కృష్ణుడు స్వయంగా అర్థం చేసుకోలేదు. అది అపరిమితమైంది అంటే. ఆ అపరిమితము తన అపరిమితము గురించి అర్థం చేసుకోలేదు. అందువల్ల కృష్ణుడు శ్రీమతి రాధారాణి యొక్క పారవశ్యం తీసుకున్నాడు, అది శ్రీ చైతన్య మహాప్రభు అంటే. ఆ చిత్రము చాలా బాగుంది: కృష్ణుడు, పారవశ్యం తీసుకొని, రాధారాణి యొక్క ప్రేమను, శ్రీ చైతన్య మహాప్రభువుగా అవతరించారు. Śrī-kṛṣṇa-caitanya rādhā-kṛṣṇa nahe anya (Śrī Guru-paramparā 6). కాబట్టి భగవంతుడు చైతన్య మహా ప్రభువును ఆరాధించడం ద్వారా, మీరు ఏకకాలంలో రాధా కృష్ణులను పూజిస్తారు. రాధా-కృష్ణులను పూజించడము కష్టము. అందువల్ల మనము పూజిస్తున్న రాధా కృష్ణులు, ఆ రాధా-కృష్ణులు వారు నారాయణ రూపంలో ఉన్నారు- లక్ష్మీ-నారాయణులుగా. ప్రారంభంలో మనం రాధా కృష్ణులను లక్ష్మీ-నారాయణుల స్థాయిలో పూజించాలి, భక్తి మరియు గౌరవముతో, చాలా ఖచ్చితముగా నియమాలు మరియు నిబంధనలను అనుసరిస్తూ. లేకపోతే, రాధ-కృష్ణ వృందావనములో, వారు, భక్తులు, వారు కృష్ణుడు భగవంతుడు అని వారు పూజించరు, కానీ వారు కృష్ణుడిని పూజిస్తారు. ఆరాధన కాదు - ఆరాధన కంటే ఎక్కువగా. ఇది కేవలం ప్రేమ. ఉదాహరణకు మీ ప్రియురాలిని ప్రేమించడం వలె, అంటే అది ఆరాధన కాదు. ఇది సహజసిద్ధమైనది, హృదయము యొక్క పని. ఇది వృందావన స్థితి. కాబట్టి మనము అత్యధిక ప్రమాణమైన వృందావణ స్థాయిలో లేనప్పటికీ, అయినప్పటికీ, మనము కృష్ణుని విరహమును అనుభూతి చెందకపోతే, అప్పుడు మనం తెలుసుకోవాలి, మనము ఇంకా కృష్ణుని యొక్క ఖచ్చితమైన భక్తులము కాదు. ఇది కావలసినది: విరహమును అనుభూతి చెందటము