TE/Prabhupada 1020 - హృదయం ప్రేమ కోసం ఉంది, కానీ ఎందుకు మీరు అంత కఠిన హృదయముతో ఉన్నారు

Revision as of 23:38, 1 October 2020 by Elad (talk | contribs) (Text replacement - "(<!-- (BEGIN|END) NAVIGATION (.*?) -->\s*){2,}" to "<!-- $2 NAVIGATION $3 -->")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


730408 - Lecture SB 01.14.44 - New York


హృదయం ప్రేమ కోసం ఉంది, కానీ ఎందుకు మీరు అంత కఠిన హృదయముతో ఉన్నారు? కాబట్టి ఈ పాండవులు, వారు కూడా కృష్ణుడి మీద ప్రేమలో ఉన్నారు. అందరూ ఆ వేదిక మీద ఉన్నారు, కానీ అది వివిధ స్థాయిలలో. అదే ప్రేమ. కొందరు తన కుటుంబమును ప్రేమిస్తున్నారు, కొందరు తన భార్యను ప్రేమిస్తున్నారు, కొందరు తన సమాజమును లేదా స్నేహమును, సమాజమును మరియు స్నేహాన్ని ప్రేమిస్తారు. వారు విభజించబడి ఉంటారు. అయితే మీరు కృష్ణుడి దగ్గరకు వచ్చినప్పుడు అది అంతిమ అంతిమముగా ప్రేమించవలసిన విషయము. Sa vai puṁsāṁ paro dharmo ( SB 1.2.6) ధర్మ అంటే కర్తవ్యము. అది ధర్మము. లేదా లక్షణాలు. ధర్మ అంటే మతపరమైన మూఢత్వం కాదు. కాదు అది సంస్కృత అర్థం కాదు. ధర్మ అంటే నిజమైన లక్షణం. నీరు ద్రవము అని చాలాసార్లు నేను వివరించాను. ఇది నీటి యొక్క శాశ్వతమైన లక్షణం. నీరు గడ్డ కట్టినప్పుడు, అది నీటి యొక్క శాశ్వతమైన లక్షణం కాదు. నీటి స్వభావము ద్రవముగా ఉండడము. నీరు గడ్డ కట్టి ఉన్నప్పుడు, ఐస్ వలె ఉంటుంది, ధోరణి మళ్లీ ద్రవంగా మారడం. మళ్ళీ. మళ్ళీ ద్రవముగా మారడము.

కాబట్టి మన నిజమైన పరిస్థితి, స్వరూప పరిస్థితి, కృష్ణుడిని ప్రేమించడం. కానీ ఇప్పుడు కృష్ణుడిని ప్రేమించకుండా ఉండేటట్లు మనము కఠిన హృదయము కలిగినవారము అయినాము. ఉదాహరణకు సందర్భానుసారముగా నీరు, ఐస్ లా మారుతుంది. ఉష్ణోగ్రత చాలా తక్కువగా ఉన్నప్పుడు, నీరు గడ్డ కడుతుంది అదేవిధముగా, మనము కృష్ణుని ఇష్టపడకపోతే, మన హృదయాలు కఠినము, కఠినమవుతాయి. ప్రేమ కోసం హృదయం ఉంది, కానీ ఎందుకు మీరు కఠిన హృదయులు అయ్యారు? ఎందుకు మీరు చాలా కఠిన హృదయులుగా మారారు, మనము మరొక తోటి జీవిని లేదా మరొక జంతువును చంపడానికి - మనము దాని గురించి పట్టించుకోము - నా నాలుక యొక్క సంతృప్తి కోసం? ఎందుకంటే మనము కఠిన హృదయులు అయ్యాము కనుక. కఠిన హృదయులు. కృష్ణుడి యొక్క ప్రేమికులము కానందున, మనమంతా కఠిన హృదయము గల వారిగా అవుతున్నాము. అందువల్ల ప్రపంచం మొత్తం సంతోషంగా ఉంది. కానీ మీరు, హృదయేన... అందువల్ల అది చెప్పబడింది, preṣṭhatamenātha hṛdayenātma-bandhunā. మీరు కృష్ణుడిని ప్రేమిస్తే, ఆయన మన నిజమైన స్నేహితుడు, కృష్ణుడు భగవద్గీతలో చెప్పినట్లుగా., సుహృదం సర్వ-భూతానామ్ ( BG 5.29) కావున మీరు కృష్ణుడి భక్తునిగా మారినప్పుడు, ఎందుకంటే కృష్ణుని యొక్క లక్షణాలు మీలో ఉన్నాయి, చిన్న పరిమాణంలో ఉన్నప్పటికీ, కాబట్టి మీరు కూడా సుహృదం సర్వ-భూతానామ్ అయ్యారు. సుహృదం సర్వ-భూతానామ్ అంటే అన్ని జీవుల యొక్క స్నేహితుడు. సుహృదం. వైష్ణవుని యొక్క కర్తవ్యము ఏమిటి? వైష్ణవుని యొక్క కర్తవ్యము భౌతికముగా బాధపడుతున్న వ్యక్తుల మీద కనికరం కలిగి ఉండడము. ఇది వైష్ణవిజం. కాబట్టి వైష్ణవుని వివరణ,

vāñchā-kalpatarubhyaś ca
kṛpā-sindhubhya eva ca
patitānāṁ pāvanebhyo
vaiṣṇavebhyo namo namaḥ
(Śrī Vaiṣṇava Praṇāma)

పతితానామ్ పావనేభ్యో. పతిత అంటే "పతితులైన" అని అర్థం