TE/Prabhupada 1024 - మీరు ఈ రెండు సూత్రాలను అనుసరిస్తే, కృష్ణుడు మీ పట్టు లోపల ఉంటారు: Difference between revisions

 
m (Text replacement - "(<!-- (BEGIN|END) NAVIGATION (.*?) -->\s*){2,}" to "<!-- $2 NAVIGATION $3 -->")
 
Line 9: Line 9:
[[Category:Telugu Language]]
[[Category:Telugu Language]]
<!-- END CATEGORY LIST -->
<!-- END CATEGORY LIST -->
<!-- BEGIN NAVIGATION BAR -- TO CHANGE TO YOUR OWN LANGUAGE BELOW SEE THE PARAMETERS OR VIDEO -->
<!-- BEGIN NAVIGATION BAR -- DO NOT EDIT OR REMOVE -->
{{1080 videos navigation - All Languages|French|FR/Prabhupada 1023 - Si Dieu est Tout-puissant, pourquoi vous limitez Son pouvoir, en disant qu'Il ne peut pas venir?|1023|FR/Prabhupada 1025 - Krishna attend simplement, "quand ce coquin va tourner son visage vers Moi?|1025}}
{{1080 videos navigation - All Languages|Telugu|TE/Prabhupada 1023 - భగవంతుడు సర్వశక్తిమంతుడైతే,ఆయన శక్తిని ఎందుకు తగ్గిస్తున్నారు|1023|TE/Prabhupada 1025 - కృష్ణుడు కేవలం నిరీక్షిస్తూనే ఉన్నాడు, 'ఈ దుష్టుడు నా వైపు ఎప్పుడు ముఖం తిప్పుతాడు'|1025}}
<!-- END NAVIGATION BAR -->
<!-- END NAVIGATION BAR -->
<!-- BEGIN ORIGINAL VANIQUOTES PAGE LINK-->
<!-- BEGIN ORIGINAL VANIQUOTES PAGE LINK-->
Line 20: Line 20:


<!-- BEGIN VIDEO LINK -->
<!-- BEGIN VIDEO LINK -->
{{youtube_right|qIucT6wdka8|మీరు ఈ రెండు సూత్రాలను అనుసరిస్తే, కృష్ణుడు మీ పట్టు లోపల ఉంటారు  <br/>- Prabhupāda 1024}}
{{youtube_right|cswXQzuXAuk|మీరు ఈ రెండు సూత్రాలను అనుసరిస్తే, కృష్ణుడు మీ పట్టు లోపల ఉంటారు  <br/>- Prabhupāda 1024}}
<!-- END VIDEO LINK -->
<!-- END VIDEO LINK -->



Latest revision as of 23:45, 1 October 2020



730408 - Lecture SB 01.14.44 - New York


మీరు ఈ రెండు సూత్రాలను అనుసరిస్తే, కృష్ణుడు మీ పట్టు లోపల ఉంటారు ప్రభుపాద: తెలివి తక్కువ తరగతి వ్యక్తులకు మోసము చేయడము అవసరం. కానీ మనము మోసం చేయడము లేదు. మనము చాలా సరళము. ఎందుకు మనము మోసం చేయాలి? కృష్ణుడు చెప్పినారు,

man-manā bhava mad-bhakto
mad-yājī māṁ namaskuru
( BG 18.65)

మనం చెప్తాము, "దయచేసి ఇక్కడకు రండి. ఇక్కడ కృష్ణుడు ఉన్నాడు, మీరు కేవలము ఆయన గురించి ఆలోచించండి. "కష్టం ఎక్కడ ఉంది? ఇక్కడ రాధా-కృష్ణ ఉన్నారు, మీరు రోజూ వారిని చూస్తే, సహజంగా మీరు మీ మనస్సులో రాధా కృష్ణులను కలిగి ఉంటారు. కాబట్టి ఏ ప్రదేశములో నైన, ఎక్కడైనా, మీరు రాధా-కృష్ణుల గురించి ఆలోచించవచ్చు. ఇబ్బంది ఎక్కడ ఉంది? మన్ మనా. మీరు హారే కృష్ణ కీర్తన చేయండి. మీరు కీర్తన చేసిన వెంటనే "కృష్ణ," అని వెంటనే మీరు ఆలయంలో కృష్ణుడి రూపాన్ని, నామ-రూపములో గుర్తు తెచ్చుకుంటారు. అప్పుడు మీరు కృష్ణుడి గురించి వింటున్నారు ; మీరు ఆయన లక్షణాల గురించి, ఆయన కార్యక్రమాలను గురించి, నామ, గుణ, రూప, లీలా, పరివారం, వసిష్ట. ఈ విధముగా ఇది, ఇది... మీరు సాధన చేయవచ్చు. ఇబ్బంది ఎక్కడ ఉంది? ఇది అభ్యాసము యొక్క ఆరంభం. వాస్తవానికి కృష్ణుడు ఉన్నాడు, కానీ కృష్ణుని చూడడానికి నాకు కళ్ళు లేవు కనుక, నేను ఆలోచిస్తున్నాను, ఇక్కడ ఉన్నారు... ఎక్కడ కృష్ణుడు ఉన్నాడు? ఇది ఒక రాయి, ఒక విగ్రహము. కానీ రాయి కూడా కృష్ణుడు అని ఆయనకు తెలియదు. రాయి కూడా కృష్ణుడు. నీరు కూడా కృష్ణుడు. భూమి కూడా కృష్ణుడు. గాలి కూడా కృష్ణుడు. కృష్ణుడు లేకుండా, ఏ ఇతర ఉనికి లేదు. దానిని భక్తుడు చూడగలడు. అందువలన, ఆయన రాయిని చూసినా కూడా, ఆయన కృష్ణుడిని చూస్తాడు. ఇక్కడ నాస్తికుడు చెప్తాడు "మీరు రాళ్లను ఆరాధిస్తున్నారు" అని చెబుతారు. కానీ వారు రాయిని పూజించడము లేదు. వారు కృష్ణుడిని ఆరాధిస్తున్నారు, ఎందుకనగా వారికి తెలుసు కృష్ణుడు తప్ప మరి ఏదీ లేదని వారికి తెలుసు. Premāñjana-cchurita-bhakti-vilocanena (Bs. 5.38). ఆ దశకి మనము రావాలి. రాయి కృష్ణుడు కాదని మీరు ఎలా చెప్పగలరు? కృష్ణుడు చెపుతాడు... మీరు కృష్ణుడిని అర్థం చేసుకోవాలి, కృష్ణుడు చెప్పినట్లుగా.

కాబట్టి కృష్ణుడు భగవద్గీత లో చెప్తాడు,


bhūmir āpo 'nalo vāyuḥ
khaṁ mano buddhir eva ca
bhinnā prakṛtir aṣṭadhā
( BG 7.4)

వారు నా వారు. ఉదాహరణకు నేను మాట్లాడుతున్నట్లుగానే. నేను మాట్లాడుతున్నాను, అది నమోదు చేయబడుతోంది, మనము మళ్లీ చూస్తాము. అదే ధ్వని వస్తుంది. మీకు తెలిస్తే "ఇక్కడ మన ఆధ్యాత్మిక గురువు ఉన్నారు..." కానీ నేను అక్కడ లేను. ధ్వని నాకు భిన్నంగా ఉంది. భిన్నా. భిన్నా అనగా "విడిపోయినా." కానీ రికార్డు మరల పెట్టిన వెంటనే ప్రతి ఒక్కరూ వింటారు, "ఇక్కడ భక్తి సి... , భక్తివేదాంత స్వామి మాట్లాడుతున్నారు." మీకు తెలిస్తే. కాబట్టి దానికి విద్య అవసరం. అది కృష్ణుడు... (విరామం)

కాబట్టి, మీరు ye yathā māṁ ( BG 4.11) .. కాబట్టి మీరు కృష్ణుని సేవలో మీరు ఎంత ఎక్కువ నిమగ్నం అయితే, మరింత మీరు కృష్ణుడిని గ్రహించవచ్చు.

sevonmukhe hi jihvādau
svayam eva sphuraty adaḥ
( CC Madhya 17.136)

కాబట్టి మన పద్ధతి చాలా సులభం. కేవలము మీ నాలుకను నిమగ్నం చేయండి. అన్ని ఇతర ఇంద్రియాలను ప్రక్కన విడిచిపెట్టండి. నాలుక చాలా బలంగా ఉంది. నాలుక మన భయంకరమైన శత్రువు, నాలుక మీ అత్యంత సన్నిహిత స్నేహితుడు కావచ్చు. ఈ నాలుక. అందుచేత శ్రాస్తం sevonmukhe hi jihvādau: చెప్తుంది నీ నాలుకను భగవంతుని సేవలో నిమగ్నము చేయండి, ఆయన మీకు వెల్లడి చేయబడతాడు. చాలా బాగుంది. ఇప్పుడు, నాలుకతో మనము ఏమి చేస్తాము? మనము మాట్లాడతాము: కృష్ణుని గురించి మాట్లాడండి . మనము పాడతాము: కృష్ణుని కీర్తన. మనము తింటున్నాము: రుచి చూడండి, కృష్ణుని ప్రసాదమును తినండి. మీరు కృష్ణుని అర్థం చేసుకుంటారు. ఏ మూర్ఖుడు అయినా, ఏ నిరక్షరాస్యుడు అయినా లేదా జీవితములో ఏ పరిస్థితిలో అయినా, మీరు మీ నాలుకని కృష్ణుని సేవ కోసం ఉపయోగించవచ్చు. కృష్ణునిచే తినబడని ఏదైనా తినవద్దు- మీ నాలుక మీ అత్యంత సన్నిహిత స్నేహితుడు అవుతుంది. కృష్ణుని గురించి తప్ప మరేమీ మాట్లాడకండి. మీరు ఈ రెండు సూత్రాలను అనుసరిస్తే, కృష్ణుడు మీ పట్టు లోపల ఉంటాడు. చాలా ధన్యవాదాలు.

భక్తులు: జయ, హరిబోల్