TE/Prabhupada 1036 - మనకు పైన ఏడు లోకములుక్రింద ఏడు లోకములుఉన్నాయి

Revision as of 23:46, 1 October 2020 by Elad (talk | contribs) (Text replacement - "(<!-- (BEGIN|END) NAVIGATION (.*?) -->\s*){2,}" to "<!-- $2 NAVIGATION $3 -->")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


720403 - Lecture SB 01.02.05 - Melbourne


మనకు పైన ఏడు లోకములు క్రింద ఏడు లోకములు ఉన్నాయి. శ్యామసుందర: ఏడు లోకములు, యోగి యొక్క ఏడు రంగులు మరియు ఏడు ఆభరణాలకు అనుగుణంగా ఉంటాయా?

ప్రభుపాద: లేదు. మనకు పైన ఏడు లోకములు కింద ఏడు లోకములు ఉన్నాయి. అందుకే విశ్వాన్ని చతుర్దశ - భువనంగా పిలుస్తారు: " పదునాలుగులోకములు”. ఇది భూర్ లోక. దీనికి పైన, భువర్ లోక ఉంది. దానికి పైన, జనలోక ఉంది. దానికి పైన మహర్ లోక ఉంది. దానికి పైన, సత్యలోక ఉంది. దానికి పైన బ్రహ్మలోక ఉంది. ఉన్నతమైన లోకము అదేవిధంగా, క్రింద కూడా, మనకు తల, అతల, తలాతల, వితల, పాతాల‌, రసాతల ఉన్నాయి. వేదముల సాహిత్యం నుండి మనకు ఈ సమాచారం లభిస్తుంది, పదునాలుగు లోకాలు. ప్రతి విశ్వము ఈ పదునాలుగు లోకములను కలిగి ఉంటుంది, ఇంకా లెక్క లేనన్ని విశ్వాలు వున్నాయి. అందువల్ల మనము బ్రహ్మ సంహిత నుండి సమాచారాన్ని కూడా పొందవచ్చు. యస్య ప్రభాప్రభవతో జగదండ కోటి (BS 5.40). జగదండ కోటి. జగదండ అంటే ఈ విశ్వము పెద్దది, నేను చెప్పేదానికి అర్థం ఏమిటంటే ఘనపరిమాణము అని అర్థం. గుడ్డు, గుడ్డు వలె. ప్రతీది, ప్రతి గ్రహము గుడ్డు వలె ఉంటుంది. ఈ బ్రహ్మాండము, ఈ విశ్వము, కూడా గుడ్డు లాగా ఉంటుంది. అందువల్ల చాలా, చాలా, చాలా మిలియన్ల జగదండ ఉన్నాయి ప్రతి ఒక జగద్-అండలో, కోటిషు వసుధాది విభూతి భిన్నం, లెక్కలేనన్ని గ్రహాలు కూడా ఉన్నాయి. అందువల్ల వేదముల సాహిత్యము నుండి ఈ సమాచారం మనకు లభిస్తుంది. మీకు నచ్చితే, మీరు అంగీకరించవచ్చు. మీకు నచ్చకపోతే మీరు తిరస్కరించవచ్చు. అది మీ ఇష్టం