TE/Prabhupada 1041 - కేవలము లక్షణములకు మాత్రమే చికిత్స ఇవ్వడము ద్వారా మీరు మానవుణ్ణి ఆరోగ్యంగా చేయలేరు

Revision as of 23:46, 1 October 2020 by Elad (talk | contribs) (Text replacement - "(<!-- (BEGIN|END) NAVIGATION (.*?) -->\s*){2,}" to "<!-- $2 NAVIGATION $3 -->")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


751001 - Lecture Arrival - Mauritius


కేవలం సూచకముగా వుండే చికిత్స ద్వారా మీరు మానవుడిని ఆరోగ్యంగా ఉంచలేరు మొత్తం ప్రపంచం, గొప్ప గొప్ప దేశాలతో సహా శారీరక భావనలో జీవితాన్ని గడుపుతున్నారు. మీ ప్రధానమంత్రి ఐక్యరాజ్యసమితికి వెళ్లారు ఐక్యరాజ్యసమితిలో అనేక గొప్ప, గొప్ప వ్యక్తులు ఉన్నారు. వారు మాట్లాడతారు, 30 సంవత్సరాలుగా మాట్లాడుతున్నారు. ఐక్యరాజ్యసమితి ఏర్పడింది, కానీ వారు జీవిత సమస్యలకు పరిష్కారం కనుగొనలేకపోయారు, ఎందుకంటే వారు ప్రాథమిక సూత్రాన్ని కోల్పోతున్నారు; వారికి తెలియదు. వారిలో ప్రతి ఒక్కరూ శారీరక స్థితిపై ఆలోచిస్తున్నారు. నేను భారతీయుడిని, "నేను అమెరికన్ ను", "నేను జర్మన్ ను" మరియు "నేను ఆంగ్లేయుడిని", ఇలా. కాబట్టి పరిష్కారం లేదు, ఎందుకంటే ప్రాథమిక సూత్రం తప్పు. మన శరీరం యొక్క క్రియాశీలక సూత్రంపై తప్పు ఏమిటో అర్థం చేసుకోకపోతే, సమస్యలు పరిష్కారం కావు. ఎలా అంటే మీరు వ్యాధిని నిర్ధారించ లేకపోతే, కేవలం మానసిక చికిత్స ద్వారా మీరు మనిషిని ఆరోగ్యకరంగా చేయలేరు. అది సాధ్యం కాదు.

కాబట్టి మా కృష్ణ చైతన్య ఉద్యమం శారీరక స్థితి పై ఆధారపడినది కాదు. ఇది ఆత్మ యొక్క ప్రాథమిక సూత్రం మీద ఉద్యమం. ఆత్మ ఏమిటి, ఆత్మ యొక్క అవసరం ఏమిటి, ఆత్మ శాంతిగా, సంతోషంగా ఎలా ఉంటుంది. అప్పుడు ప్రతీది సరిగ్గా ఉంటుంది