TE/Prabhupada 1047 - ఒక తప్పుడు కర్తవ్యమును తీసుకున్నాడు దాని కోసం కష్టపడి పని చేశాడు ఆయన గాడిద అయినాడు

Revision as of 06:45, 18 December 2017 by Kamalakar (talk | contribs) (Created page with "<!-- BEGIN CATEGORY LIST --> Category:1080 Telugu Pages with Videos Category:Telugu Pages - 207 Live Videos Category:Prabhupada 1047 - in all Languages Category:...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


750712 - Lecture SB 06.01.26-27 - Philadelphia


ఆయన ఒక తప్పుడు కర్తవ్యమును తీసుకున్నాడు దాని కోసం కష్టపడి పని చేశాడు, అందువలన ఆయన ఒక గాడిద అయినాడు కాబట్టి మనం నిర్ణయించుకోవాలి, ఈ మానవ జీవితము. కానీ మీకు ఏ సమాచారం లేదు, "నేను ఏ విధమైన శరీరాన్ని తదుపరి పొందబోతున్నాను," మీరు నమ్మకపోతే... మీరు నమ్మినా లేదా నమ్మకపోయినా, అది పట్టింపు లేదు; ప్రకృతి చట్టాలు పనిచేస్తాయి. మీరు చెపితే "నేను తరువాతి జీవితమును నమ్మను" అని చెప్పినట్లయితే, మీరు ఇలా చెప్పవచ్చు, కానీ ప్రకృతి చట్టాలు పనిచేస్తాయి. Karmaṇā daiva-netreṇa ( SB 3.31.1) మీరు వ్యవహరిస్తూన్నట్లు, ఆ ప్రకారం, మీరు మీ తదుపరి శరీరం తయారు చేస్తున్నారు. కాబట్టి మరణం తర్వాత - మరణం తర్వాత ఈ శరీరం పూర్తి అయినప్పుడు అంటే - మీరు వెంటనే మరో శరీరాన్ని పొందుతారు, ఎందుకంటే మీరు ఇప్పటికే పనిని తయారు చేసారు, మీకు ఏ రకమైన శరీరము కావాలి.

కాబట్టి ఈ వ్యక్తి, అజామిళ, తన పిల్లవాడిని జాగ్రత్తగా చూసుకోవడంలో నిమగ్నమైనాడు, మొత్తం మనస్సు పిల్లవాని మీద నిమగ్నమైఉంది (ఎవరో అంటున్నారు) (ప్రక్కన :) గొడవ చేయవద్దు. అందువల్ల ఆయనను మూర్ఖునిగా వర్ణించారు. ఇక్కడ చెప్పబడింది, bhojayan pāyayan mūḍhaḥ. మనము ఏదో ఒక రోజు వస్తున్నట్లు మర్చిపోతున్నాం. ఇది మన ముందు ఉంది. దానిని మృత్యువు, మరణం అంటారు. మనము దానిని మర్చిపోయాము. ఇది మన అపరిపూర్ణము. కావున ఈ వ్యక్తి మరచిపోయాడు ఆయన ప్రేమపూర్వకమైన తండ్రి లేదా భర్త వలె చాలా తీరిక లేకుండా ఉన్నాడు. లేదా ఏదైనా. నాకు చాలా సంబంధం ఉంది. అభిమానం కలిగిన స్నేహితుడు లేదా అసూయపడే శత్రువుగా, మనకు కొంత సంబంధం ఉంది. అందరూ, ఈ ప్రపంచంలో, మనము కొంత కలిగి ఉన్నాము, అది అభిమానము అయినా కాని లేదా అసూయ కావచ్చు; అది పట్టింపు లేదు. కాబట్టి ఈ విధముగా మనం జీవిస్తున్నాం, మరణం ముందు ఉంది అని మరచి పోతున్నాము. అందువలన మనము మూర్ఖులము

మూఢః అనగా మూర్ఖుడు, గాడిద, వాస్తవమైన ఆసక్తి ఏమిటో అతనికి తెలియదు. ఉదాహరణకు గాడిద వలె. మూఢః ... ముర్ఖుడు అంటే గాడిద. గాడిదకు తన సొంత ఆసక్తి తెలియదు. మనము గాడిదను మూడు టన్నుల వస్త్రముల బరువును పెట్టారని మనము చూశాము, అతడు వెళ్ల లేడు; ఇప్పటికీ, ఆయన చేయవలసి ఉంది. ఆయనకు తెలియదు "నేను నా వెనుక చాలా టన్నుల వస్త్రాముల బరువును కలిగి ఉన్నాను, నేను ఏమి ఆసక్తి కలిగి ఉన్నాను? ఒక్క వస్త్రము కూడా నాది కాదు. " కాబట్టి గాడిదకు అటు వంటి భావన లేదు. గాడిద అంటే అటు వంటి భావం లేదు. అది ఆలోచిస్తుంది, "ఇది నా బాధ్యత. నేను చాలా వస్త్రాల బరువును మోయటము నా బాధ్యత. " ఎందుకు కర్తవ్యము? ఇప్పుడు, "ఎందుకంటే చాకలి వాడు నీకు గడ్డి ఇస్తాడు కాబట్టి." అందువల్ల అతడు "నేను గడ్డిని ఎక్కడైనా పొందగలను, నేను ఎందుకు ఈ బాధ్యతను తీసుకున్నాను?" అనే భావన ఉండదు ఇది... ప్రతి ఒక్కరూ తన కర్తవ్యము గురించి ఆందోళన చెందుతున్నారు. కొందరు రాజకీయవేత్త, కొందరు గృహస్థులు, కొందరు వేరేది ఏదో. కానీ ఆయన కొంత తప్పుడు కర్తవ్యముని తీసుకున్నందుకు దాని కోసం కష్టపడి పనిచేసినందున, ఆయన ఒక గాడిద. ఆయన తన వాస్తవమైన పనులను మరచిపోతాడు. వాస్తవ కర్తవ్యము మరణం వస్తుంది. ఇది నన్ను వదలివేయదు. ప్రతి ఒక్కరూ చెప్తారు, "మరణం వలె తప్పని సరిగా." ఇప్పుడు, మరణం ముందు, నేను వ్యవహరించాలి, నాకు వైకుంఠములో, వృందావనములో స్థానము ఉండవచ్చు, నేను కృష్ణుడితో జీవించడానికి శాశ్వత జీవితాన్ని కలిగి ఉంటాను. ఇది మన వాస్తవమైన కర్తవ్యము. కానీ మనకు తెలియదు. Na te viduḥ svārtha-gatiṁ hi viṣṇum ( SB 7.5.31)