TE/Prabhupada 1055 - విధులను నిర్వర్తించటం ద్వారా మీరు భగవంతుణ్ణి ఆనందింప చేసారా లేదా అని చూడండి

Revision as of 05:36, 26 December 2017 by Kamalakar (talk | contribs) (Created page with "<!-- BEGIN CATEGORY LIST --> Category:1080 Telugu Pages with Videos Category:Telugu Pages - 207 Live Videos Category:Prabhupada 1055 - in all Languages Category:...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


750522 - Conversation B - Melbourne


విధులను నిర్వర్తించటం ద్వారా మీరు భగవంతుణ్ణి ఆనందింప చేసారా లేదా అని చూడండి

ప్రభుపాద: ఏ విభాగములోనైనా జ్ఞాన పురోగతి, చాలా మంచిది. కానీ లక్ష్యం ఏమిటి? లక్ష్యం భగవంతుని కీర్తింప చేయడము. ఉదాహరణకు మీరు ఒక న్యాయవాది. కొన్ని కష్టమైన సమయములలో మాకు సహాయము చేశారు. ఎందుకు? మీరు భగవంతుని కీర్తించడమును కొనసాగించాలని కోరుకున్నారు కనుక, ఈ వ్యక్తులు చాల చక్కగా చేస్తున్నారు, ఎందుకు వారిని బాధ పెట్టాలి? అంటే మీరు భగవంతుని స్తుతించటానికి సహాయం చేసారు. కాబట్టి ఇది ఒక న్యాయవాదిగా మీ విజయము. కావున ఈ ఉద్యమమునకు సహాయము చేసిన వారు ఎవరైనా, వారు కృష్ణ చైతన్యమును, భగవంతుని చైతన్యమును వ్యాప్తి చేస్తున్నారు. వారికి అన్ని విషయాల్లోనూ సహాయపడాలి, "ఇది పరిపూర్ణత. ప్రతిదీ అవసరమే, కానీ భగవంతుని కీర్తించుటలో అది సమాప్తము అవ్వాలి. అప్పుడు అది పరిపూర్ణము . ఇంకొక ప్రదేశములో... (పక్కన) ఈ శ్లోకమును కనుగోనండి:

ataḥ pumbhir dvija-śreṣṭhā
varṇāśrama-vibhāgaśaḥ
svanuṣṭhitasya dharmasya
saṁsiddhir hari-toṣaṇam
(SB 1.2.13)

ఉదాహరణకు మీరు ఈ సంస్థకు కష్టమైన పరిస్థితిలో సహాయపడిన విధముగానే. అంటే మీరు కృష్ణుడిని సంతోష పెట్టినారు. ఇది మీ విజయము నా భక్తులు కష్టములో ఉన్నారు. వారికి కొంత చట్టపరమైన సహాయం కావలెను. మీరు ఒక న్యాయవాదిగా, వారికి సహాయం చేసారు, కాబట్టి మీరు కృష్ణుడిని భగవంతుడిని సంతోష పెట్టినారు. అది జీవితం యొక్క లక్ష్యం. ఒక న్యాయవాదిగా, వ్యాపారవేత్తగా, వివిధ రంగాలలో నా పని ద్వారా, లేదా ఒక విద్వాంసునిగా, ఒక తత్వవేత్తగా, ఒక శాస్త్రవేత్తగా, ఆర్థికవేత్తగా... చాలా కోరికలు ఉన్నాయి. ఇది పట్టింపు లేదు. కానీ మీరు విజయవంతమైనారా అని మీరు చూడాలి. విజయము యొక్క ప్రమాణాము ఏమిటి? విజయము యొక్క ప్రమాణాము మీరు భగవంతుని సంతోష పెట్టినారా? (పక్కన :) మీరు ఈ చదవండి. Ataḥ pumbhir dvija-śreṣṭhāḥ...

శృతికారి: Ataḥ....

ప్రభుపాద: Pumbhir.

శృతికారి: Ataḥ pumbhir dvija-śreṣṭhāḥ. .

ప్రభుపాద:హ్మ్. ఈ శ్లోకమును కనుగొనండి.

శృతికారి:

ataḥ pumbhir dvija-śreṣṭhā
varṇāśrama-vibhāgaśaḥ
svanuṣṭhitasya dharmasya
saṁsiddhir hari-toṣaṇam
(SB 1.2.13)

ఓ ద్విజోత్తమా రెండు సార్లు జన్మించినవారిలో అత్యుత్తమమైనవాడా, అందువల్ల సారంశముగా చెప్పబడినది అత్యుత్తమమైన పరిపూర్ణత ఒకరు సాధించ గలిగేది తనకు నిర్దేశించిన విధులు నిర్వర్తించడము ద్వారా, ధర్మా, కుల విభాగాలు మరియు జీవితం యొక్క అశ్రమముల ప్రకారం, భగవంతుని, హరిని సంతోష పెట్టడము. "

ప్రభుపాద: అది. అది అయి ఉండాలి... అది "నా వృత్తి ద్వారా, నా వ్యాపారము ద్వారా, నా ప్రతిభతో, నా సామర్థ్యాల ద్వారా..." - వివిధ వర్గాలు ఉన్నాయి- "నేను భగవంతుణ్ణి సంతోష పెట్టినానా?" అప్పుడు అది విజయవంతమైనది. మీ న్యాయ వృత్తి ద్వారా భగవంతుని మీరు సంతోష పెట్టి ఉంటే- మీరు వేరే దుస్తులలో ఉన్నారు, అది పట్టింపు లేదు. మీరు భగవంతునికి పూర్తి సమయము సేవ చేస్తున్న వారితో సమానము. ఎందుకంటే వారి కర్తవ్యము భగవంతుని సంతోష పెట్టడము. అదేవిధముగా, మీరు భగవంతుని సంతోష పెట్టినట్లయితే, అప్పుడు మీ న్యాయవాద వృత్తిని ఆచరించడము ద్వారా, మీరు సాధువులతో సమానము అది లక్ష్యంగా ఉండాలి: "నా వృత్తిపరమైన పని లేదా ఉద్యోగముతో నేను భగవంతుని సంతోష పెట్టినానా?" అది ప్రామాణికమైనది. దీన్ని ప్రజలు తీసుకోనివ్వండి. మనము చెప్పము "మీరు మీ స్థానాన్ని మార్చుకోండి. మీరు ఒక సన్యాసి అవ్వండి లేదా మీ వృత్తిని వదిలివేసి, గుండు చేసుకోండి. " లేదు, మనము చెప్పము. (నవ్వుతూ) మనము స్వభావంతో ఉంటాము. (నవ్వు) కాబట్టి ఇది కృష్ణ చైతన్యము, మీ స్థానములోనే ఉండండి, మీ విధులను నిర్వర్తించడము ద్వారా మీరు భగవంతుని సంతృప్తి పరచండి. అప్పుడు ప్రతిదీ సరిగ్గా ఉంటుంది.