"ఈ భౌతిక శరీరం, మనం ఒకటి ఖచ్చితంగా తెల్సుకోవాలి, ఇది ఒక పరాయి వస్తువు. ఇది దుస్తులు లాంటిదని మేము ఇదివరకే మీకు వివరించాము. దుస్తులు. దుస్తులు నా శరీరానికి ఒక విదేశీ విషయం. అదేవిధంగా, ఈ స్థూలమైన మరియు సూక్ష్మమైన శరీరం - స్థూల శరీరం ప్రాపంచిక పంచ తత్వాలతో మరియు సూక్ష్మ శరీరం మనస్సు, అహం, జ్ఞానముతో-అవి నా అన్యమైన విషయాలు. కాబట్టి నేను ఇప్పుడు అన్యమైన విషయాలలో చిక్కుకొనిపోయాను. నా జీవిత లక్ష్యం ఈ అన్యమైన విషయాల నుండి బయటపడటం. ఒక నిజమైన ఆధ్యాత్మిక శరీరంగా నేను ఉండాలనుకుంటున్నాను. అది మీరు సాధన చేస్తే సాధించవచ్చు."
|