TE/660711 ఉపన్యాసం - ప్రభుపాద కృపామృత బిందువులు న్యూయార్క్

TE/Telugu - ప్రభుపాద కృపామృత బిందువులు
"మనం ఈ శరీరానికి సంబంధించి ఆలోచించినప్పుడు, అది భౌతిక స్థితి. ఈ శరీరాన్ని దృష్టిలో ఉంచుకుని చేసే ఏదైనా... ఈ శరీరం అంటే ఇంద్రియాలు. శరీరం అంటే ఇంద్రియాలు. అంటే మనం ఇంద్రియ భోగము కోసం చేసే ఏదైనా, అది భౌతికం. మరియు మనం పరమాత్మ సంతృప్తి కోసం చేసే ఏదైనా, అది ఆధ్యాత్మిక స్థితి. అంతే. కాబట్టి మనం విచక్షణ చూపాలి, "నేను ఇంద్రియ భోగం కోసం పనిచేస్తున్నానా లేదా నేను పరమాత్మ సంతృప్తి కోసం పనిచేస్తున్నానా?" ఈ కళను మనం నేర్చుకోగలిగితే, మన జీవితం ఆధ్యాత్మికమవుతుంది. ఆధ్యాత్మిక జీవితం అంటే మనం ఇప్పటికే నిమగ్నమై ఉన్న ఈ కార్యకలాపాలలో దేనినైనా మార్చాలని లేదా మన శరీర రూపం అసాధారణమైనదిగా మారుతుందని కాదు. ఏమీ లేదు."
660711 - ఉపన్యాసం BG 04.01 and Review - న్యూయార్క్